టీవీఎస్ నుంచి మరో స్టైలిష్ బైక్ అపాచీ RTR 160 4V లాంచ్.. తక్కువ ధర, అదరహో అనిపించే ఫీచర్లు
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి టీవీఎస్ మోటార్స్(TVS Motors). గోవాలో జరిగిన గ్రాండ్ MotoSoul- 2023 ఈవెంట్‌లో TVS Apache RTR 160 4V బైక్‌ను టీవీఎస్ మోటార్స్ విడుదల చేసింది. ఈ బైక్‌కకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో..
కొత్త TVS Apache RTR 160 4V బైక్‌ను సంస్థ రూ.1,34,990 ఎక్స్-షోరూమ్(చెన్నై) ధర వద్ద సంస్థ విడుదల చేసింది. ఈ బైక్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందించారు. ఇందులో కొత్త హెడ్‌లైట్‌ను పొందుపరిచారు. అంతేకాకుండా కంపెనీ స్మార్ట్-కనెక్ట్ (SmartXonnect) వాహన సాంకేతికతను కూడా ఇందులో ప్రవేశపెట్టింది. కాగా ఈ బైక్‌లో రెయిన్, అర్బన్ మరియు స్పోర్ట్ అనే 3 రైడ్ మోడ్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త టీవీఎస్ అపాచీ RTR 160 4V బైక్ 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ 157.9 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 8,600 rpm వద్ద 15.42 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుండగా.. ఇంకా రెయిన్, అర్బన్ మోడ్‌లలో 7,250 వద్ద 14.14 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ తెలిపింది.
కాగా కొత్త టీవీఎస్ అపాచీ RTR 160 4V స్పోర్ట్స్ మోడ్‌లో.. సింగిల్ సిలిండర్ ఇంజిన్ 9,250 rpm వద్ద 17.3 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 7,250 rpm వద్ద 14.73 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త టీవీఎస్ అపాచీ RTR 4V సస్పెన్షన్ సెటప్‌ను పరిశీలిస్తే.. ఇది ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు అరుదైన మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. ఈ బైక్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు 90/90 మరియు వెనుక 130/70 ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. దీని ద్వారా రోడ్డుపై సులభంగా డ్రైవ్ చేయవచ్చు.
కొత్త టీవీఎస్ అపాచీ RTR 160 4V బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. ఈ బైక్ ముందు 270mm డిస్క్, వెనుక వైపు 230mm పెటల్ డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇంకా డ్యూయల్ ఛానల్ ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో టీవీఎస్ అపాచీ కొత్త బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

కొత్త టీవీఎస్ అపాచీ RTR 4V బైక్ బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని TVS షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది (2024) నుంచి ఈ కొత్త బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయి. టీవీఎస్ కంపెనీ అపాచీ RTR 160 4V బైక్‌ను తక్కువ ధరలో ఆకర్షణీయమైన డిజైన్‌తో ప్రవేశపెట్టింది. ప్రీమియం బైక్ ఫీచర్లతో లాంచ్ అయిన ఈ కొత్త బైక్‌కు డిమాండ్ అధికంగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








