ఫ్లెక్స్ ఫ్యూయల్ విభాగంలో TVS.. 2023 ఆటో ఎక్స్‌పోలో అపాచే RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆవిష్కరణ

దేశీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ యొక్క 'అపాచే' డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో తన బైకులను అప్డేట్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రదర్శించింది.

భారతదేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులకు ఎక్కువ ఆదరణ ఉంది, అయితే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్ కి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీనిని కంపెనీలు ఈ మోడల్స్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే హీరో మోటోకార్ప్ గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్, సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మరియు హోండా XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్ వంటివి ఆవిష్కరించబడ్డాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో TVS RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆవిష్కరణ

టీవీఎస్ అపాచే RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ విషయానికి వస్తే, ఈ బైక్ 159.7 సిసి ఆయిల్-కూల్డ్, SOHC ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజిన్ 9250 ఆర్‌పిఎమ్ వద్ద 17.39 బిహెచ్‌పి పవర్ మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైకులో అర్బన్, స్పోర్ట్స్ మరియు రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

టీవీఎస్ అపాచే RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఈ బైక్ పొడవు 2035 మిమీ, వెడల్పు 790 మిమీ, ఎత్తు 1050 మిమీ మరియు వీల్‌బేస్‌ 1357 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క మొత్తం బరువు 275 కేజీల వరకు ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో TVS RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆవిష్కరణ

భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న బైకులతో అపాచే RTR 160 4V ఒకటి. అయితే ఈ బైక్ ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ గా ఆవిష్కరించబడింది. ఇది చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది.ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ ఇథనాల్ ఆధారిత ఇంధనాల (E20 నుండి E85 వరకు) శ్రేణిపై నడుస్తుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయెల్ మరియు ఇథనాల్ ఆధారిత ఇంధనం విషయానికి వస్తే, సాధారణంగా రెండు అంకెల సంఖ్య ముందు 'E' తో సూచించబడతాయి. అంటే ఇక్కడ ఆ సంఖ్యలు ఇంధన శాతాన్ని చూపిస్తాయి. E20 ఇంధనం అంటే ఇందులో 20 శాతం ఇథనాల్ ఉంటుంది. అదే సమయంలో E80 అని ఉంటే ఇందులో 80 శాతం పెట్రోల్ ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల్లో 100 శాతం పెట్రోల్ ఉపయోగించబడదు. ఇందులో ఇథనాల్ కూడా ఉపయోగించబడుదుతుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో TVS RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆవిష్కరణ

టీవీఎస్ అపాచే RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ 12 లీ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ బైక్ డిజైన్ పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. ఫీచర్స్ కూడా సాధారణ మోడల్ మాదిగానే ఉంటుంది. ఇందులో పెద్దగా మార్పులు జరిగినట్లు కనిపించదు. కావున చూడటానికి మునుపటి టీవీఎస్ అపాచే RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.

టీవీఎస్ అపాచే RTR 160 4V ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ యొక్క పనితీరుని గురించి మరియు మైలేజ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. బహుశా కంపెనీ ఈ బైక్ కి సంబంధించిన చాలా సమాచారాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఆటో ఎక్స్‌పో 2023 లో సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మరియు హోండా XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్ వంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్ కూడా ప్రదర్శించబడ్డాయి.

ఇప్పటికే భారతీయ మార్కెట్లో 'టీవీఎస్ మోటార్' తన 'అపాచే' సిరీస్‌లోని RTR 160 4V ఎడిషన్‌కు కొత్త కలర్ ఆప్సన్ అందించింది. ఇది చూడటానికి మునుపటి బైక్ కంటే కూడా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పడు 'పెర్ల్ వైట్ కలర్‌'లో సరికొత్త లైట్ వెయిట్ బుల్‌పప్ ఎగ్జాస్ట్‌ను పొందుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 14, 2023, 12:16 [IST]
English summary
Tvs apache rtr 160 4v flex fuel showcased at 2023 auto expo details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+