TVS Apache RTR 310 అపాచీ లవర్స్‌కి గుడ్‌న్యూస్ త్వరలోనే విడుదల కాబోతున్న సరికొత్త మోడల్..!

కొన్ని బైకు కంపెనీలు విడుదల చేసిన మోడళ్లు చాలా ప్రాచుర్యం పొందాయి. అందులో బజాజ్ నుంచి పల్సర్, టీవీఎస్ నుంచి అపాచీ, హీరో నుంచి స్ప్లెండర్, హోండా నుంచి షైన్ ఇలా ఎన్నో కంపెనీలు ఈ మోడళ్లతో తమ బ్రాండ్ వ్యాల్యూని పెంచుకున్నాయి. ఈ పేరుతో కూడిన సిరీస్ లు ఇప్పటికీ విజయవంతంగా మార్కెట్లో అమ్ముడవుతున్నాయి.

టీవీఎస్ మోటార్స్ లో అపాచీ బైక్‌లకు మంచి పేరుంది. మరో మాటలో చెప్పాలంటే అపాచీ బైకులకు యూత్ లో చాలా క్రేజ్ ఉంది. ఈ అపాచీ బైక్‌లు 160సీసీ ఇంజన్‌తో ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. 310సీసీ వరకు ఇంజన్‌లతో కూడా అందుబాటులో ఉన్నాయి. పల్సర్ బైకులు, యమహా సీరీస్ బైకులకు మార్కెట్ లో గట్టి పోటీని ఇస్తున్నాయి.

TVS Apache RTR 310 side view

ప్రస్తుతం 310సీసీలో అపాచీ RR310 మోటార్‌సైకిల్ మాత్రమే విక్రయంలో ఉంది. ఈ బైక్‌ను టీవీఎస్ మోటార్స్ బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్‌తో కలిసి తయారు చేసింది. తక్కువ కాలంలోనే ఈ బైక్ మంచి గుర్తింపును పొందింది. ఇప్పుడు టీవీఎస్ మరో కొత్త 310సీసీ బైక్‌ను అపాచీ RTR310 పేరిట విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్‌తో కలిసి తయారు చేస్తుండటంతో అపాచీ RR310 వంటి 310cc బైక్‌లు కూడా BMW బ్రాండ్‌లలో కూడా విక్రయించబడుతున్నాయి. Apache RR310 ధర ప్రస్తుతం రూ. 2.5 లక్షలు ఎక్స్-షోరూమ్ గా ఉంది. అపాచీ RTR310 బైక్ ధర అంతకంటే తక్కువగా లభించే అవకాశం ఉంది. ఒక్కసారి మార్కెట్లోకి రిలీజ్ అయ్యాక తన సత్తాను చాటనుంది.

TVS Apache RTR 310

ధరలలో తేడాలు ఉన్నప్పటికీ, కొత్త Apache దాని స్పోర్ట్స్ వెర్షన్ RR310 నుండి చాలా భాగాలను పొందవచ్చని భావిస్తున్నారు. ప్రత్యేకించి, RR310 బైక్ 312cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ తో పనిచేస్తుంది. అలానే కొత్త Apache RTR310 బైక్‌కు కూడా అమర్చబడే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 34 PS వద్ద 27 Nm టార్క్ ఉత్పత్తి చేయనుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడనుంది.

RR 310 వలె TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తో ఇది రావచ్చు. డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్, స్లిప్పర్ క్లచ్, USD ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్‌తో మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి. సర్దుబాటు చేయగల బ్రేక్, క్లచ్ అసిస్ట్, స్ప్లిట్ సీట్లు చుట్టూ LED లైటింగ్ ఇందులో గమనించవచ్చు.

TVS Apache RTR 310 running shot

ఈ సూపర్ బైక్ BMW G310R ధర కంటే తక్కువగా ఉండనుంది. KTM 250 డ్యూక్, హోండా CB300 R మరియు 390 డ్యూక్‌ల బైకులతో పోటీ పడవచ్చు. మార్కెట్లో అపాచీలకు ఉన్న ఆదరణ ఆధారంగా దీన్ని కంపెనీ తీసుకురాబోతుంది. ఇవి బైక్ కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

అపాచీ RR310 బైక్‌లు 'బిల్డ్ టు ఆర్డర్' ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడ్డాయి. అంటే ఆర్డర్ వస్తేనే RR310 బైక్‌ను తయారు చేస్తారు. కొత్త RTR310 బైక్‌ను కూడా అదే విధంగా విక్రయిస్తారో లేదో తెలియదు. అయితే ఈ కొత్త అపాచీ బైక్‌లను హోసూర్‌లోని టీవీఎస్ మోటార్స్ ఫ్యాక్టరీలో తయారు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 10, 2023, 16:58 [IST]
English summary
Tvs apache rtr 310 may launch soon details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+