బైక్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. సరికొత్తగా వస్తున్న రోనిన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌, ఫీచర్లు ఇవే.!!

పండుగ సీజన్‌లో కొత్త వాహనాలు కొనుగోలు చేయడం భారతీయులకు సెంటిమెంట్‌. అందుకే ఆటోమేకర్లు కొత్త వాహనాలను విడుదల చేయడంతో పాటు.. ప్రస్తుతం ఉన్న వాహనాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్లతో ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో టీవీఎస్‌ తన రోనిన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌ను విడుదల చేసింది.

కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను జత చేస్తూ దీపావళి సందర్భంగా టీవీఎస్‌ తన రెట్రో రోనిన్‌(TVS Retro Ronin Special Edition) స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే రెట్రో డిజైన్‌తో టీవీఎస్‌ యువ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో పండుగ కానుకగా రోనిన్‌కు మరిన్ని ఫీచర్లను జత చేస్తూ స్పెషల్‌ ఎడిషన్‌ను మరింత డైనమిక్‌గా విడుదల చేసింది.

Ronin-Special-Edition-Bike

కొత్త రోనిన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌ ధరు రూ. 1.72 లక్షలుగా(ఎక్స్‌ షోరూమ్‌) టీవీఎస్‌ నిర్ణయించింది. కాగా ఇప్పటికే ఉన్న రోనిన్‌ బైక్‌తో పోలిస్తే ఇది రూ. 3 వేలు ఎక్కువ. ఈ బైక్‌లో టీవీఎస్‌ స్వల్ప మార్పులు చేసింది. ముఖ్యంగా ఇది విభిన్న బాడీ గ్రాఫిక్స్‌తో నింబస్‌ గ్రే కలర్‌తో ఆకర్షణీయంగా డిజైన్‌ చేశారు.

రోనిన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌కు ఈ కలర్‌ అదనపు రెట్రో రూపాన్ని ఇస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ యొక్క కొన్ని భాగాలపై ఎరుపు, తెలుపు రంగు షేడ్స్‌ను ఉపయోగించారు. ట్రిపుల్‌ కలర్‌ స్కీన్‌ టోన్‌తో గ్రే షేడ్‌ బేస్‌గా రూపొందించడం ప్లస్‌ పాయింట్‌. ఫ్యూయెల్‌ ట్యాంక్‌, సైడ్‌ ప్యానల్స్‌పై ఎరుపు, తెలుపు షేడ్స్‌ ఉండగా.. వీల్‌పై ఆకర్షణీయంగా రెడ్‌ కలర్‌ షేడ్‌ ఉపయోగించారు.

Ronin-Special-Edition-Bike

రోనిన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌లో చిన్న ఫ్లై స్క్రీన్ మరియు EFI కవర్‌తో కూడిన USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ బైక్‌లో ఇంజిన్‌ పరంగా టీవీఎస్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కారణంగా రెగ్యులర్‌ రోనిన్ బైక్‌లో కనిపించే అదే మోటారు రోనిన్ స్పెషల్ ఎడిషన్‌లో కూడా ఉంటుందని గమనించాలి.

ఇందులో 225.9 cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ మోటారు ఉపయోగించారు. ఈ ఈ మోటార్ గరిష్ఠంగా 7,750 rpm వద్ద 20.1 bhp పవర్, 19.93 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌లో 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉపయోగించారు. కొత్త రోనిన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌లో స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ సౌకర్యాన్ని అందించారు.

కాగా టీవీఎస్ దీన్ని స్టాండర్డ్ ఫీచర్‌గా అందించింది. కొత్త రోనిన్‌ స్పెషల్‌ ఎడిషన్ ఉత్తమ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ కోసం 41 mm అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్ (ఫ్రంట్ సైడ్), 7-స్టెప్-ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ (వెనుక వైపు)తో వస్తుంది. ముందు మరియు వెనుక వైపు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉపయోగించారు. ఇంకా సింగిల్ ఛానల్ ABS సిస్టమ్ మరో అడ్వాంటేజ్‌.

కొత్త రోనిన్‌ బైక్‌లో T- ఆకారపు LED DRL, LED హెడ్‌ల్యాంప్‌లను అమర్చగా.. ఈ బైక్‌లో రెయిన్, అర్బన్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు అందించారు. ఇంకా ఇందులో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ బైక్ కచ్చితంగా కస్టమర్లను, బైక్ లవర్స్‌ను ఆకర్షిస్తుందని టీవీఎస్‌ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 28, 2023, 9:27 [IST]
English summary
Tvs launches ronin special edition bike for diwali festive season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+