ట్రెండ్ సెట్ చేస్తున్న టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇందులో అంత స్పెషాలిటీ ఏముందో తెలుసా.!!

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ ఆటో కంనీలు ఈవీ మార్కెట్ ను విస్తరిస్తుండగా.. ఈ సెగ్మెంట్లో స్టార్టప్‌లు సైతం దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టూ వీలర్ కంపెనీ టీవీఎస్ ఆగస్టు నెలలో విక్రయాల్లో దూసుకుపోయిింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ ఆగస్టు 2023లో మొత్తం 3,45,848 వాహనాలను విక్రయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఆగస్టు నెలలో TVS మోటార్ కంపెనీ అమ్మకాలతో పోలిస్తే దాదాపు 12,061 వాహనాలను అధికంగా విక్రయించింది. అంటే 3.61 శాతం వృద్ధి నమోదు చేసింది.

TVS-Sales

ఈ సేల్స్‌లో దేశీయంగా విక్రయించబడినవి మరియు విదేశాలకు ఎగుమతి చేయబడినవి రెండూ ఉన్నాయి. అంతే కాకుండా, TVS బ్రాండ్ నుంచి కొన్ని 3 వీలర్లు కూడా అమ్ముడయ్యాయి. అవి కూడా 3,45,848 లో చేర్చబడ్డాయి. గత ఆగస్టులో దేశీయంగా విక్రయించిన టీవీఎస్ వాహనాల సంఖ్య 2,58,333. ఆగస్టు 2022లో టీవీఎస్ 2,40,676 వాహనాలను మాత్రమే విక్రయించింది.

దేశీయంంగా విక్రయించిన టీవీఎస్ వాహనాల వృద్ధి 7.34 శాతం పెరిగింది. కానీ విదేశీ ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. 2022 ఆగస్టులో TVS విదేశాలకు 93,111 వాహనాలను ఎగుమతి చేసింది. అయితే గత నెలలో ఈ సంఖ్య కొద్దిగా తగ్గి 87,515కి చేరుకుంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో టీవీఎస్ 3 వీలర్ల విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి.

TVS-Sales

గత ఆగస్టులో టీవీఎస్ బ్రాండ్ నుంచి 13,738 త్రీ వీలర్లను కంపెనీ విక్రయించింది. గతేడాది ఆగస్టులో 18,248 త్రీ వీలర్స్ అమ్ముడయ్యాయి. TVS 3 వీలర్స్ దేశంలో ప్రతి నెలా 1,000 నుంచి 2,000 యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. 3 వీలర్స్ విక్రయాల పరంగా, TVS విదేశీ ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. గతేడాది ఆగస్టులో టీవీఎస్ టూ వీలర్స్ 3,32,110 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఆగస్టు 2022లో విక్రయించిన 3,15,539 TVS ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఇది 5.25 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం 3,32,110 TVS టూ వీలర్లలో 2,56,619 భారత మార్కెట్లో అమ్ముడయ్యాయి. మిగిలిన 75,491 మాత్రమే విదేశాలకు ఎగుమతి అయ్యాయి. అంటే TVS మోటార్స్ తన టూ వీలర్స్ దేశీయ విక్రయాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది.

నిజానికి, TVS మోటార్ దేశీయ టూ వీలర్ అమ్మకాలు ప్రతి నెలా గణనీయంగా మెరుగుపడుతున్నాయి. ఆగస్టు చివరి నెలలో కూడా 7.23 శాతం వృద్ధిని సాధించింది. టీవీఎస్ మోటార్ సైకిల్స్ గత ఆగస్టులో 1,53,047 యూనిట్లను విక్రయించింది.

ఆగస్టు 2022లో, దీని కంటే కొంచెం ఎక్కువగా 1,57,118 TVS బైక్‌లు అమ్ముడయ్యాయి. టీవీఎస్ స్కూటర్లు గత ఆగస్టులో 1,42,502 యూనిట్ల సేల్స్ నమోదయ్యింది. ఆగస్టు 2022లో కేవలం 1,21,866 టీవీఎస్ స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

TVS-IQube-Sales

టీవీఎస్ స్కూటర్ల పెరుగుదలకు టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ ప్రధాన కారణం. ఎందుకంటే, గత ఏడాది ఆగస్టులో విక్రయించిన కేవలం 4,418 TVS iQube స్కూటర్లతో పోలిస్తే, గత ఆగస్టులో 23,887 iQube స్కూటర్లు అమ్ముడయ్యాయి. దాదాపు 440.67 శాతం పెరిగింది. టీవీఎస్ మోపెడ్ టూ వీలర్ సేల్స్ గత నెలలో 36,561 యూనిట్లుగా నమోదైంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 2, 2023, 17:31 [IST]
English summary
Tvs motor sales august 2023 iqube records highest ever sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+