TVS Raider సరికొత్త బైక్ వెర్షన్ ను విడుదల చేసిన టీవీఎస్.. ధర 93,719, ఫీచర్లు అదుర్స్..!
సరసమైన ధరల్లో టీవీఎస్ బైక్ లను రూపొందిస్తుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు నిత్యం ఏదో ఒక బైక్ ని సరికొత్తగా ఆ సంస్థ విడుదల చేస్తుంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే బైక్ లు అధిక మైలేజ్ ని అందించడమే కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ బైక్స్ యువతతో పాటు సామాన్యులను ఆకట్టుకుంటున్నాయి.
టీవీఎస్ రైడర్‌లో సింగల్ పీస్ సీట్ బైక్ ని ఆ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం తీసుకువచ్చిన రైడర్ వెర్షన్ లో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. సేమ్ స్ల్పిట్ సీట్ వేరియంట్ డిజైన్ లో ఈ బైక్ రానుంది. కాస్త విభిన్నంగా కనిపించే LED హెడ్‌లైట్, స్లిమ్ బాడీవర్క్‌ను మార్పుల్నీ ఈ కమ్యూటర్ మోటార్‌సైకిల్ లో గమనించవచ్చు.

సింగిల్-పీస్ సీటు మినహా ఎటువంటి మార్పుల్నీ లేదా అప్ డేట్లను ఈ బైక్ లో మనం గమనించకపోవచ్చు. ఎందుకంటే ఎంట్రీ-స్పెక్ TVS రైడర్ ట్రిమ్‌ల మాదిరిగానే ఉంటుంది. ఈ బైక్ 124.8cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 11.4hp వద్ద 11.2Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టెలిస్కోపిక్ ఫోర్క్, మోనోషాక్ ద్వారా సస్పెన్షన్ ని ఇందులో గమనించవచ్చు.
ఫ్రంట్ వీల్ వద్ద 240mm డిస్క్, వెనుక 130mm డ్రమ్ బ్రేక్ ఆప్షన్ లభిస్తుంది. TVS రైడర్ 125 బైక్ కేవలం 5.9 సెకన్లలో 60km/h వేగాన్ని అందుకునే శక్తి ఉంది. ఈ బైక్ లో10 లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ ని పొందవచ్చు. మొత్తానికి ఈ బైక్ బరువు విషయానికి వస్తే 123కిలోల వెయిట్ ని కలిగి ఉండనుంది. సింగిల్ సీట్ వేరియంట్ అద్భుతమైన రెడ్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఇక స్మార్ట్ Xonnect వేరియంట్ దానికి భిన్నమైన కలర్లలో లభ్యం కానుంది. ఫిరి ఎల్లో, వికెడ్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. TVS రైడర్ 125 బైక్ టాప్-ఎండ్ వేరియంట్ స్మార్ట్ Xonnect ధర రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్) ధరలో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ లో 5 అంగుళాల TFT స్క్రీన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, రైడ్ మోడ్‌లు, వాయిస్ కమాండ్‌లు, కాల్ అలర్ట్‌లు, మెసేజ్ నోటిఫికేషన్ మరియు మ్యూజిక్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
బ్రేకింగ్ హార్డ్‌వేర్ ఒకే ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. రోడ్-బయాస్డ్ టైర్‌లలో చుట్టబడిన 17-అంగుళాల మిశ్రమాలపై బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి. ఈ బైక్ LCDతో డిస్ప్లేతో వస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఇంధన-స్థాయి సూచిక, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరిన్ని వంటి వివిధ రీడౌట్‌లను ఈ బైక్ కలిగి ఉంది.
ఈ బైక్‌లో USB ఛార్జింగ్ పోర్ట్ సీటు కింద చిన్నపాటి స్టోరేజ్ యూనిట్ కలిగి ఉంది. TVS రైడర్ సింగిల్-సీట్ వెర్షన్ ధర మార్కెట్ లో రూ. 93,719(ఎక్స్ షోరూమ్)గా ఉండనుంది. స్ప్లిట్ సీట్ మోడల్ కంటే రూ. 1,000 తక్కువగా ఈ బైక్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా సరికొత్త టీవీఎస్ రైడర్ ని కొనుగోలు చేసేయండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








