ప్రీమియం బైక్స్ కి సవాల్.. టీవీఎస్ నుంచి సరికొత్త రోనిన్ బైక్స్ విడుదల..
ద్విచక్ర వాహనాల్లో TVS కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో బైక్స్ ను తీసుకువస్తూ మరింతగా వినియోగదారులకు చేరువవుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ మోటోసోల్ (motosoul) పేరిట గోవాలో రెండు రోజుల బైక్స్ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో సంస్థకు సంబంధించిన కొత్త బైక్స్ ను విడుదల చేసింది. అవేంటో చూద్దాం..
రెండు రోజులుగా ఈ ఈవెంట్ ను గోవాలో టీవీఎస్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా తొలిరోజు (TVS Motosou)l రెండవ ఎడిషన్ లో, భారతదేశంలో రోనిన్ మోటార్ సైకిళ్లు రోనిన్ కొత్త ఎడిషన్ లను అధికారికంగా ఆవిష్కరించింది. రోనిన్ మోడళ్లను విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో తయారు చేశారు.

నాలుగు వేరియంట్లలో..
మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ బైక్స్ ని విడుదల చేసింది. అందులో ముసాషిని మోడల్ ను ఇండోనేషియాకు చెందిన స్మోక్డ్ గ్యారేజ్ డెవలప్ చేయగా, 'అగోండా' జర్మనీకి చెందిన JvB Moto, 'వాకిజాషి' రాజ్‌పుతానా కస్టమ్స్, 'SCR' TVS డిజైన్ టీమ్ ద్వారా డెవలప్ చేయబడ్డాయి. TVS రోనిన్ బైక్స్ ద్వారా ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ లోకి ప్రవేశిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. రేసింగ్ ఔత్సాహికులకు ఇవి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు చెప్పవచ్చు.
ఈ బైక్‌లు అమ్మకానికి అందుబాటులో ఎప్పుడు వస్తాయనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ అమ్మకానికి వస్తే, అందరి దృష్టి వాటిపైనే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా స్పోర్ట్స్ లోక్ లో చాలా అందంగా కళ్లు చెదిరే వాహనాలుగా వీటిని తయారు చేశారు. భారతదేశంలో రూ. TVS రోనిన్ ప్రారంభ ధరలు రూ.1.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉండనుంది.

స్పెషల్ అట్రాక్షన్ తో సరికొత్తగా..
హెడ్ లైట్, ఫ్యూయల్ ట్యాంక్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్ ప్రత్యేక ఆకృతి బైక్ కి మరింత లుక్ ని ఇవ్వనుంది. మరీ ముఖ్యంగా హెడ్ లైట్, స్ప్లిట్ సీటు డిజైన్ బైక్ ని మరో స్థాయి తీసుకెళ్లనున్నాయి. 5 స్పీడ్ గేర్‌బాక్స్ అందించబడుతుంది. గంటకు 120 కి.మీ. ఈ బైక్స్ ప్రయాణించనున్నాయి. సరికొత్త మోడళ్లలో రానున్న ఈ బైక్స్ రైడర్ ఫ్రెండ్లీగా నిలువనున్నాయి.
రెండు చక్రాలు డిస్క్ బ్రేక్ లను కూడా పొందుతుంది. TVS రోనిన్ ఆధునిక-రెట్రో మోటార్ సైకిల్ గా పరిగణించవచ్చు. ఇది డ్యూయల్-ఛానల్ ABS, రెయిన్ అర్బన్ రైడింగ్ మోడ్ లలో రానుంది. వాయిస్ రైడ్ అసిస్టెన్స్ తో బ్లూటూత్ కనెక్టివిటీ సైలెంట్ స్టార్టర్ తో వస్తుంది. ఆయిల్-కూల్డ్, 225.9cc ఇంజన్‌తో నడిచే ఈ TVS రోనిన్ 20bhp వద్ద 20Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ స్లిప్ అండ్ అసిస్ట్ ఫీచర్ ని కలిగి ఉంది. అంతేకాకుండా, రోనిన్ బైక్ అల్లాయ్ వీల్స్, LED టర్న్ ఇండికేటర్స్, ఆల్-LED టెయిల్ లైట్, డిజిటల్ స్పీడోమీటర్ తో రానుంది.

దూసుకుపోతున్న టీవీఎస్..
మోటార్ సైకిళ్లు, రైడింగ్ కమ్యూనిటీల మధ్య బైకింగ్ ఫెస్టివల్ ను జరుపుకోవడం ఆనందంగా ఉందని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ తెలిపారు. మోటార్‌సైకిళ్ల పట్ల ఉన్న అభిమానంతో TVS MotoSoul రెండవ ఎడిషన్ ను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మోటార్ సైకిళ్లు, రైడింగ్ కమ్యూనిటీల ప్రయాణంలో అనేక మైలురాళ్లను ఎదుర్కొన్నామని ఆయన చెప్పారు. TVS Apache సిరీస్ కోసం మా ముఖ్యమైన 5 మిలియన్ల ప్రపంచ విక్రయాల మైలురాయిని చేరుకుందని ఇది కంపెనీకి శుభ సూచికమని అన్నారు. రోనిన్ బైక్స్ ద్వారా కంపెనీకి మంచి గుర్తింపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








