తక్కువ ధరకే టీవీఎస్‌ iQube ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!!.. ఇక కస్టమర్లకు పండగే..

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా కొనుగోలు దారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటో మేకర్లు సైతం పోటాపోటీగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్లను తయారు చేస్తూ మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి.

ఇటీవలి కాలంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు TVS యొక్క ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ iQube భారీ డిమాండ్‌ను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఐక్యూబ్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్కూటర్‌ విక్రయాలు మార్కెట్‌లో ఆశాజనకంగా ఉన్నాయి.

TVS తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొత్త వేరియంట్‌ను అతి తక్కువ ధరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దేశీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈథర్, బజాజ్ మరియు ఓలా ఇ-స్కూటర్‌లతో పోలిస్తే, TVS iQube తక్కువ ధరలో లభిస్తోంది.

TVS-iQube

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయాలంటే కంపెనీలు దాని బ్యాటరీ కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగానే ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం FAME 2 సబ్సిడీని సవరించిన తర్వాత, దేశంలో ఇ-స్కూటర్ల ధరలు పెరిగాయి. దీంతో వినియోగదారులు వెనకడుగు వేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో టీవీఎస్ దీనికి పరిష్కారాన్ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందరికీ అందుబాటులో ధరలో ఉండేలా iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొత్త వేరియంట్‌లో అందించాలని చూస్తున్నట్లు సమాచారం. చిన్న బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించడం ద్వారా కస్టమర్లకు కొనుగోలు ఖర్చును తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.

TVS-iQube

అదేవిధంగా ఇప్పటికే ఉన్న iQube వేరియంట్‌లలోని కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్‌లు కొత్త వేరియంట్‌లో ఉండకపోవచ్చు. ప్రధానంగా TFT డిస్‌ప్లే చిన్నదిగా ఉండే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం త్వరలో తెలియనుంది. అయితే ఇప్పటికే iQube రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

TVS గత జూన్‌లో 14,46 iQube ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ యూనిట్లను విక్రయించింది. ఇది మే నెలతో పోలిస్తే, FAME 2 సబ్సిడీ ప్రభావం కారణంగా ఇది స్వల్పంగా విక్రయాలు తగ్గాయి. ఇప్పుడు, iQube వినియోగదారుల కోసం చిన్న బ్యాటరీ ప్యాక్ యొక్క కొత్త వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

TVS-iQube

ప్రస్తుతం భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న TVS iQube ధర రూ.1,23,776 గా ఉంది. iQube S వేరియంట్ ధర రూ.1,38,883 గా ఉంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు. రెండు వేరియంట్‌లు 3.04 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికను కలిగి ఉన్నాయి. పూర్తి ఛార్జ్‌పై 100 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి. గరిష్ఠంగా గంటకు 75 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

TVS iQube స్కూటర్ బ్యాటరీ ప్యాక్ 0-80 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. అంతే కాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లను ఆకర్షించే అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ప్రధానంగా ఇది పెద్ద TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కలిగి ఉంది. రైడింగ్ గణాంకాలు, బ్యాటరీ పరిధికి సంబంధించిన సమాచారాన్ని పొందడానికి డిస్‌ప్లేను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 19, 2023, 17:35 [IST]
English summary
Tvs working on most affordable iqube electric scooter full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+