TVS X e Scooter Review Video టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ వీడియో
పవర్‌ట్రెయిన్, సౌకర్యవంతమైన రైడ్, మంచి రైడింగ్ డైనమిక్స్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అద్భుతమైన టెక్నాలజీతో TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ రూపొందింది. మరికొన్ని వారాల్లో కస్టమర్లకు డెలివరీలు చేసేందుకు సిద్ధంగా ఉన్న కొత్త TVS X ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మా డ్రైవ్‌స్పార్క్ టీమ్ టెస్ట్ రైడ్ చేసింది. పూర్తి రివ్యూ వీడియోను ఇక్కడ అందిస్తున్నాం.
కొత్త TVS X డిజైన్‌ను పరిశీలిస్తే ఇందులో LED టెయిల్‌లైట్‌లు, టర్న్ ఇండికేటర్‌లతో పాటు స్పోర్టీ స్ప్లిట్ సీట్ సెటప్, TVS X వెనుక సబ్-ఫ్రేమ్‌లోని విభాగాలు కూడా ప్రకాశవంతమైన బ్లూ పెయింట్ ఫినిషింగ్ ఇచ్చారు. 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆఫ్‌సెట్ రియర్ మోనోషాక్, రియర్ సబ్-ఫ్రేమ్ వెంబడి TVS X యొక్క రేక్డ్ టెయిల్ సెక్షన్‌ను పొందుపరిచారు.
ఫీచర్లను పరిశీలిస్తే 10.2-అంగుళాల టిల్టింగ్ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇందులో స్పీడ్, రేంజ్ ఇంకా రైడ్ మోడ్‌ల వరకు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా నావిగేషన్, మ్యూజిక్, వార్తలు, మీ కాల్‌లు మరియు సందేశాలు ఇలా అన్నిటినీ యాక్సెస్ చేసుకునే సదుపాయం ఉంటుంది. SmartXonnect సిస్టమ్ జియోఫెన్సింగ్, క్రూయిజ్ కంట్రోల్, క్రాష్ అండ్ ఫాల్ అలర్ట్, టో అండ్ థెఫ్ట్ అలర్ట్, షేర్డ్ డిజిటల్ కీలు వంటి ఫీచర్లను కలిగి ఉంది.

TVS Xలో అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ 4.4kWh ను ఉపయోగించారు. ఇది పూర్తి ఛార్జ్‌పై 140 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 950W పోర్టబుల్ ఛార్జర్‌ను ప్రవేశపెట్టారు. ఇది కేవలం నాలుగున్నర గంటల్లో బ్యాటరీని 0-80 శాతం వరకు పూర్తి చేస్తుంది. కేవలం 2.6 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకోగా.. దీని గరిష్ఠ వేగం గంటకు 105 కి.మీ.


Click it and Unblock the Notifications








