బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. 265 కి.మీ వేగంతో రేసింగ్ బైక్ Ultraviolette F99 ఆవిష్కరణ
ఇటీవల జరిగిన EICMA(International Motorcycle And Accessories Exhibition) 2023లో.. Ultraviolette తన F77 ఎలక్ట్రిక్ బైక్ యూరోపియన్ వెర్షన్‌లో పరిచయం చేసింది. ఈ బైక్‌తో పాటు కంపెనీ చాలా కాలంగా ఎదురుచూస్తున్న F99 ఫ్యాక్టరీ రేసింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఆవిష్కరించిన బైక్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
Ultraviolette అనేది బెంగళూరు ఆధారిత స్టార్టప్ కంపెనీ. ఇతర భారత్ లోని ఇతర స్టార్ట్ అప్‌ల మాదిరిగా Ultraviolette తన ఫ్యూచర్ ప్రొడక్ట్‌లను EICMA 2023 ప్రదర్శించింది. F77 డెలివరీలు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో యూరప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Ultraviolette F77 ను మూడు విభిన్న రైడ్ మోడ్‌లలో పరిచయం చేసింది. గ్లైడ్, కంబాట్ మరియు బాలిస్టిక్ మోడ్‌లలో ఈ బైక్‌ను రూపొందించారు. మంచి రైడింగ్ అనుభూతితో పాటు స్మూత్ సస్పెన్షన్ సెటప్‌తో ఈ బైక్‌ను ప్రవేశపెట్టారు. ఈ బైక్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు అధికారిక వెబ్‌సైట్‌లో నవంబర్ 15 నుంచి ప్రారంభం అవుతాయి.
Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్‌లో 10.3kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. F77 40bhp గరిష్ట శక్తిని, 100 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి ఎఫ్ 77 ఎలక్ట్రిక్ బైక్.. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన పనితీరుతో బైక్ ప్రియులను అలరించనున్నట్లు సంస్థ తెలిపింది.

ఐరోపాలో Ultraviolette F77 ధర 9,000 నుంచి 11,000 యూరోల మధ్య ఉంటుంది. అయితే, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పన్నుల ప్రకారం ఫైనల్ ధర మారనుంది. ఇక Ultraviolette F99 ఫ్యాక్టరీ రేసింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రపంచ ప్రీమియర్‌తో ఇంటర్నేషనల్-స్పెక్ F77ని మించి విస్తరించాలని సంస్థ యోచిస్తోంది. ఈ బైక్ EICMA 2023లో విపరీతమైన క్రేజ్‌ను కలిగి ఉంది.
Ultraviolette F99 బైక్ విషయానికొస్తే ఇందులో చెప్పుకోదగినవి.. ఈ బైక్ యాక్టివ్ ఏరోడైనమిక్స్, సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌ల ఫార్ములా ద్వారా పనిచేస్తుంది. F99 దాని యాక్టివ్ ఏరోడైనమిక్స్ నిర్మాణంలో కార్బన్ ఫైబర్‌ను కూడా కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది. అయితే ఈ బైక్ రెండు ఫ్రంట్ కౌల్ డక్ట్‌లను కూడా కలిగి ఉంది.

దీని ద్వారా Ultraviolette F99 బైక్ మోటారుకు గాలి సరఫరా అవుతుంది. ఇది విండ్‌షీల్డ్‌గా పని చేస్తుంది. ఇంకా ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇందులో అదనంగా వింగ్‌లెట్‌లను వ్యూహాత్మకంగా అందించారు. ఈ బైక్ గరిష్ఠంగా గంటకు 265 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
Ultraviolette కో ఫౌండర్, CEO నారాయణ్ సుబ్రమణ్యం దీనిపై మాట్లాడారు. Ultraviolette F77 బైక్‌తో పాటు Ultraviolette F99 ఆవిష్కరణతో 190 దేశాల్లో బైక్ ప్రియుల నుంచి మంచి స్పందన పొందినట్లు చెప్పారు. Ultraviolet F77 పట్ల అధిక రెస్పాన్స్‌ను చూసినట్లు పేర్కొన్నారు. యూరోపియన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి EICMA దోహదపడిందన్నారు. ఇది ప్రారంభం మాత్రమే అని స్పష్టం చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








