మీరు తరచూ సైడ్‌ స్టాండ్‌ వేయడం మర్చిపోతున్నారా.. ఇప్పుడే ఈ సెన్సార్‌ టెక్నాలజీని ఇన్‌స్టాల్‌ చేసుకోండి.!!

మీరు బైక్‌ రైడ్‌ చేస్తున్నప్పుడు కనీసం ఒక్కసారైనా మీకు సైడ్‌ స్టాండ్‌ సమస్య ఎదురై ఉంటుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు సైడ్‌ స్టాండ్‌ పడలేదని తోటి వాహనదారులు మీకు చెప్పడం.. లేదంటే ఇతరులే అలా వెళ్తున్నప్పుడు మీరు గమనించి వారికి చెప్పడం.. జరిగే ఉంటుంది. సైడ్‌ స్టాండ్‌ సరిగా పడకపోవడం చాలా పెద్ద సమస్య.. అయితే దీనికో పరిష్కారం ఉంది.

బైక్‌ రైడ్‌ చేస్తున్నప్పుడు తరచూ రైడర్లకు సైడ్‌ స్టాండ్‌ సమస్య ఎదురవుతుంటుంది. ఒక్కోసారి సరిగా సైడ్‌ స్టాండ్‌ పడకపోవడంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. సైడ్‌ స్టాండ్‌ సరిగా వేయకుండా మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్నప్పుడు టర్నింగుల్లో, సడెన్‌ బ్రేక్‌ వేసినప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇకపై అలా జరగకుండా సైడ్‌ స్టాండ్‌ సెన్సార్లు అందుబాటులోకి వచ్చాయి.

Side-Stand-Sensors-For-Motorcycles

సైడ్‌ స్టాండ్‌ వెనక్కి తీసుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాలను నివారిస్తూ.. బైక్‌ రైడర్‌ భద్రతను మెరుగుపరిచేందుకు యునో మిండా(Uno Minda) కంపెనీ.. ప్రత్యేకంగా సైడ్‌ స్టాండ్‌ సెన్సార్లు, స్విచ్‌లు అనే అత్యాధునిక లైన్‌ను లాంచ్‌ చేసింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే..

Uno Minda ప్రవేశపెట్టిన ఈ సైడ్‌ స్టాండ్‌ సెన్సార్లు, స్విచ్‌లు.. బైక్‌పై వెళ్తున్నప్పుడు సైడ్ స్టాండ్ సరిగా పడకపోతే.. ఇంజిన్ సర్క్యూట్‌ను విడదీస్తుంది. ఫలితంగా బైక్‌కు ప్రొపల్షన్‌ రద్దు అవ్వడం ద్వారా ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తుంది. రైడర్ భద్రతకు హామీ ఇస్తూ యునో మిండా ఈ సరికొత్త ఇన్నోవేషన్‌ చేసింది. మాగ్నెటిక్‌ సెన్సార్‌ ఆధారంగా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు.

Side-Stand-Sensors-For-Motorcycles

ఈ మాగ్నెటిక్‌ సెన్సార్‌ ద్వారా బైక్‌ యొక్క ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ LED ఇండికేటర్‌ను కలిగి ఉంటుంది. ఇది సైడ్‌ స్టాండ్‌ సరిగా పడనప్పుడు LED లైట్‌ వెలుగుతూ రైడర్‌ను హెచ్చరిస్తుంది. దీని ద్వారా బైక్‌ రైడర్‌ అప్రమత్తమై సురక్షితంగా రైడ్‌ చేయవచ్చు.

యునో మిండా ప్రవేశపెట్టిన ఈ మాగ్నెటిక్‌ సెన్సార్‌ సైడ్‌ స్టాండ్‌ అలర్ట్‌, స్విచ్‌ టెక్నాలజీ కోసం కస్టమర్లు కొత్త బైక్‌ కొనుగోలు చేయనవసరం లేదు. ఇప్పటికే వారి ఉపయోగిస్తున్న బైక్‌లలో ఈ టెక్నాలజీని అమలుపరచవచ్చు. తద్వారా సురక్షితంగా బైక్‌ రైడ్‌ చేయవచ్చు.

Side-Stand-Sensors-For-Motorcycles

మాగ్నెటిక్‌ సెన్సార్‌ టెక్నాలజీ లాంచ్‌పై యునో మిండా లిమిటెడ్‌ ఆఫ్టర్‌ మార్కెట్‌ డొమైన్‌ ప్రొడక్షన్‌ అండ్‌ స్ట్రాటజీ హెడ్‌ ఆనంద్‌ కుమార్‌ మాట్లాడారు. కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రమాదాలను నివారించడంలో సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

భారత్‌లో రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా ఈ సెన్సార్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు ఆనంద్‌ కుమార్‌ అన్నారు. ఇవి దేశంలోని ఎలాంటి రోడ్లనైనా తట్టుకుని పనిచేస్తాయని చెప్పారు. అయితే సాధారణంగా బైక్‌లు సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌లతో ముందుగానే ఇన్‌స్టాల్‌ అయి వస్తాయని.. కానీ తాము ప్రవేశపెట్టిన ఈ మాగ్నెటిక్‌ సైడ్‌ స్టాండ్‌ సెన్సార్ల ద్వారా టర్నింగులు, గరుకు రోడ్లపై సురక్షితంగా డ్రైవ్‌ చేయవచ్చని చెప్పారు.

Side-Stand-Sensors-For-Motorcycles

ఈ మాగ్నెటిక్‌ సైడ్ స్టాండ్ సెన్సార్‌లు మరియు స్విచ్‌లు.. ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ. 172 బేస్‌ ధరతో ప్రారంభమవుతాయి. Uno Minda లిమిటెడ్‌ ఈ లైఫ్-సేవింగ్ ఉత్పత్తులపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 31, 2023, 10:43 [IST]
English summary
Uno minda launches side stand sensors and switches for motorcycles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+