Electric scooters త్వరలో విడుదల కానున్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. డిజైన్, ఫీచర్లు, పూర్తి వివరాలు..
భవిష్యత్తులో ఆటో మెబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో అందుబాటులో ఉండటం కూడా ఒక కారణం.
ఎలక్ట్రిక్ స్కూటర్లు పట్టణాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పెరిగాయి. ఎక్కువ దూరం సునాయాసంగా ప్రయాణించే సౌకర్యం ఉండటంతో వాహనదారులు ఈవీలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆటో మొబైల్ రంగం అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్న నేపథ్యంలో భారత్ మార్కెట్‌లోకి కొత్తగా లాంచ్ అవుతున్న 5 ఈవీల గురించి తెలుసుకుందాం.

TVS iQube ST : TVS iQube ST 2023 ఆటో ఎక్స్‌పో కొత్త ఫీచర్లతో మరికొద్ది వారాల్లో మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే iQube శ్రేణిలో అగ్రస్థానంలో ఉన్న ఈ ఈవీ పవర్‌ట్రెయిన్ పరంగా 4.56kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. రేంజ్ 145 కిలోమీటర్ల పరిధిలో.. గరిష్ఠ వేగం 82 కిలోమీటర్లను ఇస్తుంది. TPMS, వాయిస్ అసిస్ట్‌లు, కొత్త పెయింట్ స్కీమ్‌లు ఈ ఈవీలో కొత్త ఫీచర్లు.
Suzuki e- burgman : సుజుకి ఇ-బర్గ్‌మ్యాన్ మార్చి 2023లో పరిచయం కాగా.. ఈ ఈవీ ఇప్పటికే భారత్‌లో పలు టెస్ట్ రన్‌లను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది నాటికి ఇ-బర్గ్‌మ్యాన్ మార్కెట్‌లోకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై అధికారికంగా సంస్థ ధ్రువీకరించలేదు. ఇది 4kW మోటార్ శక్తిని కలిగి ఉంది. 60km/h వేగం వద్ద 44 కిలోమీటర్ల పరిధి రేంజ్‌ను ఇస్తుంది.

2024లో హోండా 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనుంది. ఈ రెండు ఈవీలు ఇండియాలోనే తయారుకానున్నాయి. మొదటి ఈవీ యాక్టివా ఎలక్ట్రిక్‌గా మార్కెట్‌లోకి రానున్నట్లు సమాచారం. ఈ డెబ్యూట్ స్కూటర్‌లో స్థిరమైన బ్యాటరీ ఉండగా.. రెండవ స్కూటర్‌లో బ్యాటరీని మార్చుకునే వీలుంటుంది.
యమహా నియో & E01 : యమహా నియో, E01 ల ఫీచర్లు ఇంకా బహిర్గతం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా, ఈ రెండు మోడల్‌లు ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నియో మోడల్ త్వరలో విడుదల కానుంది. దేశీయంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఈవీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60-70 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.

రివర్ ఇ స్కూటర్(River e scooter) : బెంగళూరు ఆధారిత స్టార్టప్ త్వరలో భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. రివర్ ఇ స్కూటర్ పేరుతో విడుదల కానుంది. ఇది 2023 ఏడాది మధ్యలో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. పెద్ద LED లైట్లు, పెద్ద 14-అంగుళాల వీల్స్ రివర్ ఇ స్కూటర్ ప్రత్యేకత. రివర్ ఇ కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు,టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








