G20 డెలిగేట్స్‌ను ఆకట్టుకున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. వైరల్‌ అవుతున్న వీడియో.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ భారతీయ రైల్వే శాఖ చేపట్టిన విప్లవాత్మకమైన ప్రాజెక్ట్‌. ఈ సెమీ హై స్పీడ్‌ రైలు దేశంలో అత్యంత వేగవంతమైన రైలు మాత్రమే కాదు.. అత్యంత అధునాతమైనది కూడా. ఆటోమేటిక్‌ డోర్లు, ఆన్‌బోర్డ్‌ వైఫై ఇంకా ఇతర ఆధునిక సౌకర్యాలు ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా 25 రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న 50 వందే భారత్‌ రైళ్లు ఇతర రైళ్లతో పోలిస్తే అధిక ఛార్జీలను కలిగి ఉన్నప్పటికీ అత్యంత వేగంతో ప్రయాణించడం వీటి ప్రత్యేకత. గంటకు 180 కి.మీ వేగంతో వీటిని ప్రతిపాదించినా ప్రస్తుతం 160 కి.మీ వేగంతో నడుస్తున్నాయి.

Vande-Bharat-Express

కాగా మరికొద్ది రోజుల్లో ముంబయి- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ సిద్ధం కానుంది. అప్పటివరకూ అత్యంత వేగవంతమైన రైలుగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అనడంలో సందేహం లేదు. అయితే తాజాగా మన వందేభారత్‌ రైళ్లు G20 దేశాలకు చెందిన డెలిగేట్స్‌ను ఆకర్షించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకూ దేశంలో ప్రతి వందే భారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో మొదటిసారిగా G20 సమ్మిట్‌ జరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం G20 ప్రతినిధి బృందానికి రవాణా మార్గంగా వందే భారత్‌ రైలును కేటాయించింది.

Vande-Bharat-Express

ఆదివారం(ఆగస్టు 20) G20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్- ముంబయి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి తమ ప్రయాణ అనుభవంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. పశ్చిమ రైల్వే తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో సంబంధిత వీడియోను షేర్‌ చేసింది

"G20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గుజరాత్‌ రాజధాని గాంధీనగర్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి ప్రపంచ స్థాయి, స్వదేశీంగా తయారు చేసిన #VandeBharatExpressలో ప్రయాణించింది. భారతీయ ఇంజినీరింగ్ మరియు సౌకర్యాల సారాంశాన్ని వారు ఆస్వాదించారు." అని ట్వీట్ చేసింది.

Vande-Bharat-Express

దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ప్రతినిధులలో ఒకరు, స్టేషన్ నుంచి రైలు సమయానికి బయలుదేరడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామర్థ్యం తనను ఆకట్టుకున్నట్లు వెల్లడించారు. రైలులో అధునాతన సౌకర్యాలు ఉండటంతో పాటు పరిశుభ్రత అత్యున్నతంగా ఉందన్నారు. ఇది అభినందనీయమని తమ అనుభవాన్ని పంచుకున్నారు.

భారతీయ రైల్వే శాఖ కొత్త ఆరెంజ్ మరియు గ్రే నేపథ్యంతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇంకా పునరుద్ధరించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తయింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఆధ్వర్యంలో రూపొందిన ఈ కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ చెన్నైలో మొదటి ట్రయల్ రన్‌కు ముందు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు.

Vande-Bharat-Express

కాగా ప్రస్తుతం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలోని 25 మార్గాల్లో అమలవుతోంది. వివిధ రైల్వే జోన్‌లలో బహుళ రాజధాని నగరాలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూపోతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, భోపాల్, లక్నో, గాంధీనగర్, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్‌, మైసూరు, హౌరా, న్యూ జల్పైగురి, షిర్డీ, కోయంబత్తూర్, గౌహతి, డెహ్రాడూన్, జైపూర్, జోధ్‌పూర్, త్రివేండ్రం వంటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనుసంధానించబడిన కొన్ని ప్రధాన నగరాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 21, 2023, 16:59 [IST]
English summary
Vande bharat express impresses g20 delegates with its efficiency video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+