సూపర్ యమహా స్కూటర్స్ లాంఛ్.. యాక్టీవాకు ధీటుగా ఫీచర్స్..!

యమహా మోటార్ ఇండియా నుంచి ఓ అద్భుతమైన యమహా స్కూటర్ ఆ కంపెనీ లాంఛ్ చేసింది. పూర్తిగా టెక్నాలజీ ఫీచర్లతో దీనిని ఆ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం ఓ యాప్ ద్వారా స్కూటర్ లోని అన్ని ఫీచర్లను నియంత్రించేలా యాప్ ను రూపొందించారు. మరీ ఈ ప్రత్యేక స్కూటీ విశేషాల్ని ఇక్కడ తెలుసుకోండి.

125సీసీ ఇంజన్ తో కూడిన ఈ ఆహ్లాదకరమైన ఫీచర్‌ ప్యాక్డ్‌ 2023 స్కూటర్.. మూడు మోడళల్లో సంస్థ తీసుకువచ్చింది. వీటిలో ఫాసినో 125 ఎఫ్‌ ఐ హైబ్రిడ్‌ Fascino S 125 Fi Hybrid (Disc), రే జడ్‌ ఆర్‌ 125 ఎఫ్‌ ఐ హైబ్రిడ్‌ Ray ZR 125 Fi Hybrid (Disc), రే జడ్‌ ఆర్‌ స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ ఐ హైబ్రిడ్‌ Ray ZR Street Rally 125 Fi Hybrid (Disc) గా నామకరణం చేసింది.

యమహా స్కూటర్

కార్బన్‌ ఉద్గారాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నియమాలకు అనుగుణంగా ఈ 2023 వెర్షన్‌ యయహా 125 సీసీ హైబ్రిడ్‌ స్కూటర్‌ లను సంస్థ రూపొందించింది. E20 ఫ్యూయల్‌ ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌ ను ఇందుకోసం ఉపయోగించింది. ఈ నూతన ఇంజిన్‌ ఓబీడీ2 ప్రమాణాలను సైతం కలిగి ఉంది.

BS-6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ స్కూటర్ ను రూపొందించారు. ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ (FI), 125 cc బ్లూ కోర్ ఇంజిన్‌ కలిగి ఉంది. 5,000 RPM వద్ద 10.3 NM టార్క్‌ ను ఈ స్కూటర్ ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ ఇంజన్ స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్‌తో కూడా ఈ స్కూటర్ వస్తుంది.

యమహా బైక్

Y- కనెక్ట్ యాప్ ద్వారా స్కూటర్ ను పూర్తిగా కస్టమర్ స్కూటర్ నీ మానిటర్ చేయవచ్చు. బ్లూటూత్ కనెక్షన్ ద్వారా స్కూటర్ లోని అధునాతన ఫీచర్లను యాప్ నుంచి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. పూర్తిగా యాప్ నుంచే స్కూటర్ నిర్వహణ చేయవచ్చు అని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త టెక్నాలజీ కల్గిన స్కూటర్.. మార్కెట్ లోని ప్రధాన పోటీదారులకు సవాల్ విసరనుంది.

ఈ స్కూటర్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ లో, ఇంధన యూసేజ్ ట్రాకర్‌, నిర్వహణ సూచనలు, చివరి పార్కింగ్‌ లొకేషన్‌, మాల్‌ ఫంక్షన్‌ నోటిఫికేషన్‌, రైడర్‌ ర్యాంకింగ్‌, రివ్స్ డాష్ బోర్డ్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ ను నడిపిన అనుభవం ఒక ఎత్తు అయితే యాప్ ద్వారా స్కూటర్ ను నావిగేట్ చేస్తూ రైడర్ మంచి అనుభూతిని పొందుతాడని యమహా పేర్కొంది.

యమహా స్కూటర్

ఈ సరికొత్త డిజైన్లలోని యమహా 125 హైబ్రిడ్‌ స్కూటర్లు.. 3 రంగుల్లో విడుదల చేస్తున్నామని స్కూటర్ లాంచింగ్ సందర్భంగా యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ ఐషిన్‌ చిహానా తెలిపారు. 'కాల్‌ ఆఫ్‌ ద బ్లూ బ్రాండ్‌' పేరిట ఈ మూడు కలర్స్ వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తాయని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో స్కూటర్ విభాగంలో లో మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు.

డార్క్ మాట్ బ్లూ రంగులో ఫాసినో ఎస్ 125 హైబ్రిడ్ (డిస్క్) స్కూటర్ అందుబాటులో ఉంది. ఢిల్లీ ఎక్స్‌ షోరూంలో ఈ స్కూటర్ ధర రూ. 91,030 ఉంది. రే జడ్ ఆర్ 125 ఎఫ్ ఐ హైబ్రిడ్ (డిస్క్ స్కూటర్ డార్క్ మాట్ బ్లూ రంగులో అందుబాటులో ఉంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 89,530. ఇక లాస్ట్ స్కూటర్ రే జడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (డిస్క్) లైట్ గ్రే వెర్మిలియన్, మాట్ బ్లాక్ రంగుల్లో లభ్యమవుతోంది. ఈ స్కూటర్ ధర రూ. 93, 530గా కంపెనe నిర్ణయించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 21, 2023, 15:51 [IST]
English summary
Yamaha 125cc scooter reveled by the company with the new features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+