Yamaha R3 యమహా ఆర్3 సూపర్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే.!
భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా R3 బైక్‌ను యమహా సంస్థ శుక్రవారం(డిసెంబర్ 15)న అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ పూర్తిగా విదేశంలో తయారుకాగా దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తున్నారు. Yamaha R3 ధర, ఫీచర్లు, డిజైన్ పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశీయ మార్కెట్లో యమహా బ్రాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. నాణ్యమైన పనితీరుతో బైక్ రైడర్లకు ఫేవరెట్‌గా మారింది. యమహా బైక్‌లకు కస్టమర్లలో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో బైక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న YZF R3 బైక్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ధర రూ. 4.65 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. దీనితో పాటు, యమహా MT-03 అనే బైక్‌ను కూడా లాంచ్ చేసింది.

యమహా R3 బైక్ విషయానికొస్తే.. ఇటీవలే భారత్‌లో విడుదలైన ఇది కవాసకి నింజా 400, నింజా 300, Aprilia RS 457 బైక్‌లకు గట్టి పోటీగా లాంచ్ అయింది. ఇంకా ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న కేటీఎం RC 390, టీవీఎస్ అపాచీ RR 310, BMW G310 RR బైక్‌లకు కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.
యమహా MT-03 బైక్ మరియు యమహా R3 బైక్‌లో ఒకే ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 321cc లిక్విడ్ కూల్డ్, లైన్ ట్విన్ సిలిండర్, DOHC 4 వాల్వ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 10,750 rpm వద్ద 42 PS శక్తిని మరియు 9000 rpm వద్ద 29.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
యమహా R3 బైక్‌ను లైట్ వెయిట్ ప్రైమ్ బైక్‌గా సంస్థ ప్రవేశపెట్టింది. ముందు భాగంలో తలక్రిందులుగా ఉండే USD ఫోర్కులు ఉన్నాయి. ఇది పెద్ద స్వింగ్ ఆర్మ్ మరియు మోనోక్రాస్ రియర్ సస్పెన్షన్ కూడా కలిగి ఉంటుంది. ఎల్‌ఈడీ లైట్లు, బైక్ ముందు భాగంలో మల్టీ-ఫంక్షన్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుపరిచారు.
యమహా ప్రకారం, ఈ కొత్త R3 బైక్ బరువు 169 కిలోలు. రైడర్ ఫ్రెండ్లీగా ఉంటుందని సంస్థ తెలిపింది. రైడర్-ఫ్రెండ్లీ సీట్ ఎత్తు 780mm. సాంకేతికత పరంగా, Yamaha R3 బైక్ మినిమలిస్ట్ విధానాన్ని కలిగి ఉంది. డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్‌ను ఈ ప్రీమియం బైక్‌లో జోడించారు.
కాగా జపనీస్ టూ వీలర్ తయారీదారు యమహాకు భారత మార్కెట్లో బలమైన పునాది వేసిన మోడల్ యమహా ఆర్‌ఎక్స్100. నేటికీ యమహా ఆర్‌ఎక్స్ 100 బైక్‌కు యువతలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. యమహా కంపెనీకి చెందిన ఆర్‌ఎక్స్100 సౌండ్‌తో మార్కెట్‌లో తుఫాను సృష్టించింది.
ఇది యువతకు ఫేవరెట్ బైక్. 2003 వరకు ఆర్‌ఎక్స్ 100 బైక్ సేల్స్ జరగ్గా.. ఆ తర్వాత ఉత్పత్తి ఆగిపోయింది. అయినప్పటికీ యమహా బైక్‌లకు మార్కెట్లో క్రేజ్ తగ్గడం లేదు. ఆ తర్వాత వచ్చిన ప్రీమియం బైక్‌లన్నీ మంచి డిమాండ్‌ను ఏర్పరుచుకున్నాయి. కాగా తాజాగా రూ. 4.10 లక్షల ధరతో విడుదలైన అప్రిలియా RS 357కి.. యమహా R3 బైక్ గట్టి పోటీ ఇవ్వనుంది.
భారత మార్కెట్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బైక్ కావడంతో యమహా కంపెనీ నుంచి ఈ బైక్‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిగా చూపిస్తున్నారు. ముఖ్యంగా యువరైడర్లకు ఈ బైక్‌పై చాలా క్రేజ్ ఉంది. బుకింగ్, డెలివరీ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. భారత్‌లో ఈ బైక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే ఈ బైక్ తయారీని దేశంలోనే చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే బైక్ ధర కూడా తగ్గుతుంది.


Click it and Unblock the Notifications








