Yamaha RX100 అభిమానులకు గుడ్‌న్యూస్.. మళ్లీ మార్కెట్‌లోకి క్రేజీ బైక్..!
యమహా RX100 మోటార్ సైకిల్ అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేని బైక్ మోడల్. యువత సహా ఎక్కువ మంది ఈ బైక్‌ను కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేసి 20 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ ఈ బైక్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. అయితే ఈ బైక్ గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది.
ఆర్‌ఎక్స్100 మోటార్ సైకిల్‌ను (Yamaha RX100 ) తొలుత 1985 సంవత్సరంలో ప్రారంభించారు. అయితే భారత్‌లో 2- స్ట్రోక్ ఇంజిన్‌లపై నిషేధం కారణంగా 1996లో ఈ బైక్ ఉత్పత్తిని నిలిపివేశారు. యమహా RX100 బైక్ 98.2cc 2-స్ట్రోక్ ఇంజిన్‌ను కలిగి ఉండేది. ఈ ఇంజిన్ 11PS శక్తి, 10.45Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేది. భారత్‌లో కాలుష్య ప్రమాణాల్లో మార్పులు కారణంగా ఈ బైక్‌ల ఉత్పత్తి నిలిచింది.

యమహా RX100 బైక్‌ను కొత్త ఇంజిన్‌తో (Yamaha RX100 New bike) విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ కొత్త లుక్, శక్తివంతమైన ఇంజిన్‌తో మరోసారి ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉన్న యమహా మోటార్ సైకిల్ ఇంజిన్‌ను మార్చనున్నారు.
తాజా అప్‌గ్రేడ్‌లో 200cc లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌తో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాత RX100 బైక్ 2 స్ట్రోక్ ఇంజిన్‌ను కలిగి ఉండేది. అదే కొత్త బైక్‌ను 4 స్ట్రోక్ ఇంజిన్‌తో లాంచ్ చేయాలని భావిస్తున్నారు. 2026 సంవత్సరం నాటికి ఈ బైక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
యమహా RX100 బైక్‌కు ఉన్న క్రేజీ లుక్‌తోపాటు డిస్క్ బ్రేకులు, అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్‌లు, DRL వంటి ముఖ్యమైన ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మార్పులు కారణంగా గతంలో ఆర్‌ఎక్స్100 బైక్ ఇంజిన్ సౌండ్ కూడా మారుతుంది.
ఆర్‌ఎక్స్ 100 పాత మోడల్ మోటార్ సైకిల్ అంటే ఇప్పటికే మంచి ఆదరణ ఉంది. యువతలో చాలా మంది నాటి బైక్ అందుబాటులో ఉంటే కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారు. ఆ బైక్ అంటే నాటికి నేటికి అంత క్రేజ్ ఉంది. డిజైన్, ఇంజిన్ సౌండ్ సహా ఇతర ఫీచర్లు బాగా ఆకట్టుకున్నాయి.
అయితే 2026లో లాంచ్ చేయాలని భావిస్తున్న కొత్త బైక్.. చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇంజిన్‌ను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసే అవకాశం ఉంది. జపాన్‌కు చెందిన యమహా సంస్థ భారత్‌లో మంచి మార్కెట్‌ను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








