ఇయర్‌ ఎండింగ్‌లో అదిరే ఆఫర్‌.. Hero Vida V1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ. 31,000 భారీ డిస్కౌంట్‌.!!

దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా హీరో మోటోకార్ప్‌ ప్రసిద్ధి చెందింది. హీరో బైక్‌లు, స్కూటర్లు కస్టమర్లలో మంచి ఆదరణ పొందాయి. కాగా Hero Motocorp ప్రవేశపెట్టిన Vida V1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సంస్థ విజయవంతంగా విక్రయిస్తోంది. ఈ క్రమంలో 2023 ముగుస్తుండటంతో(Big Year End Discount) ఈ స్కూటర్‌పై భారీ తగ్గింపులను సంస్థ ప్రకటించింది.

Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మొత్తంగా రూ. 31,000 వరకు తగ్గింపు ప్రయోజనాన్ని హీరో మోటోకార్ప్‌ అందిస్తోంది. ఇందులో రూ. 6,500 స్టిక్కర్ ధర తగ్గింపు, రూ. 5,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్, రూ. 7,500 లాయల్టీ బోనస్, రూ. 2,500 కార్పొరేట్ తగ్గింపు, రూ. 1,125 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, రూ. 8,259 పొడిగించిన బ్యాటరీ వారంటీని పొందవచ్చు.

Hero-Vida-V1-Electric-Scooters

అంతే కాకుండా హీరో Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై కస్టమర్లు వివిధ ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 5.99 శాతం వడ్డీ రేటుతో ఫైనాన్స్‌లో ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. జీరో ప్రాసెసింగ్ ఫీజు, EMI ఆప్షన్లు ఈ స్కూటర్‌పై ఉన్నాయి. ఈఎమ్‌ఐ నెలకు రూ. 2,429 నుండి ప్రారంభమవుతుంది.

కస్టమర్లు సెలెక్ట్‌ చేసుకున్న నెలల ఆధారంగా ఈఎమ్‌ఐ వ్యాల్యూ మారుతుంది. అంతే కాకుండా హీరో కంపెనీతో భాగస్వామ్యం అయిన సంస్థల నుంచి కూడా కస్టమర్లు త్వరిత రుణ సౌకర్యాలను పొందవచ్చు. విడా V1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం మీ సమీపంలోని షోరూమ్‌ను సంప్రదించవచ్చు.

Hero-Vida-V1-Electric-Scooters

పండుగ సీజన్‌ నేపథ్యంలో గత నవంబర్‌లో హీరో విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్లు భారీ సేల్స్‌ను నమోదు చేసుకున్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 3,030 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది నవంబర్‌ నెలలో 1,935 యూనిట్లు విక్రయించగా.. ఈ ఏడాది నవంబర్‌లో 57 శాతం వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్-రోడ్ ధర రూ. 1,60,200 గా ఉంది.

Hero Vida V1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సంస్థ 2 వేరియంట్లలో ప్రవేశపెట్టింది. Vida V1 Plus, Vida V1 Pro. విడా V1 ప్లస్‌ వేరియంట్ 3.44 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 143 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. కేవలం 3.4 సెకన్లలో 0- 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

Hero-Vida-V1-Electric-Scooters

టాప్‌ ఎండ్‌ మోడల్‌ Vida V1 Pro వేరియంట్ 3.94 kWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ పూర్తి ఛార్జ్‌పై 165 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

కాగా Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్‌లు గరిష్ఠంగా 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. వీటిలో ఎకో, రైడ్ మరియు స్పోర్ట్ అనే 3 రైడింగ్ మోడ్ ఆప్షన్లు ఉంటాయి. ఇక ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రెండు వేరియంట్లలో TFT టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్, రివర్స్ మోడ్‌తో సహా ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Vida V1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సంస్థ ఆకర్షణీయమైన కలర్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మాట్ వైట్, మ్యాట్ స్పోర్ట్స్ రెడ్, గ్లోస్ బ్లాక్ వంటి అనేక కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన కలర్‌ను ఎంచుకోవచ్చు. రాష్ట్రాన్ని బట్టి ఈ స్కూటర్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధరలో మార్పు ఉంటుందని గమనించాలి.

More from DriveSpark

Article Published On: Monday, December 18, 2023, 19:05 [IST]
English summary
Year end discounts on hero vida v1 electric scooter upto rs 31 000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+