మరింత అందంగా మారిపోయిన జావా 42 & యెజ్డీ రోడ్‌స్టర్‌: ఇవి తప్పకుండా మీ మనసు దోచేస్తాయ్..

దేశీయ మార్కెట్లో చాలామంది వాహన వినియోగదారులు ఆధునిక బైకులు మాత్రమే కాదు, ఆధునిక కలర్ ఆప్సన్స్ (కొత్త కలర్ ఆప్సన్స్) వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జావా 42 మరియు యెజ్డీ రోడ్‌స్టర్‌ బైకులు కొత్త కలర్ స్కీమ్ తో విడుదలయ్యాయి.

జావా 42 బైక్ ఇప్పుడు కాస్మిక్ కార్బన్ షేడ్‌లో మరియు యెజ్డీ రోడ్‌స్టర్‌ క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో అందుబాటులో ఉంది. ధరల విషయానికి వస్తే, జావా 42 కాస్మిక్ కార్బన్ షేడ్‌ ధర రూ. 1.92 లక్షలు కాగా, యెజ్డీ రోడ్‌స్టర్‌ క్రిమ్సన్ డ్యూయల్ టోన్ ధర రూ. 2.04 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు బైకులలో కలర్ ఆప్సన్ కాకుండా ఎలాంటి ఇతర మార్పులు జరగలేదు.

మరింత అందంగా మారిపోయిన జావా 42 & యెజ్డీ రోడ్‌స్టర్

జావా 42 బైక్ ఇప్పుడు కాస్మిక్ కార్బన్ కలర్ ఆప్సన్ లో మాత్రమే కాకుండా, గెలాక్టిక్ గ్రీన్ (మ్యాట్), స్టార్ లైట్ బ్లూ (మ్యాట్), కామెట్ రెడ్ (గ్లోసీ), హాలీస్ టీల్ (మ్యాట్), లుమోస్ లైమ్ (మ్యాట్), నెబ్యులా బ్లూ (గ్లాసీ), ఆల్ స్టార్ బ్లాక్, సిరియస్ వైట్ కలర్ మరియు ఓరియన్ రెడ్ అనే ఇతర కలర్ ఆప్సన్స్ లో కూడా లభిస్తుంది.

అదే సమయంలో యెజ్డీ రోడ్‌స్టర్‌ బైక్ కేవలం క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో మాత్రమే కాకుండా స్మోక్ గ్రే, సిన్ సిల్వర్, హంటర్ గ్రీన్, గాలియంట్ గ్రే మరియు స్టీల్ బ్లూ అనే ఇతర కలర్ ఆప్సన్స్ లో కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త కలర్ డ్యూయెల్ టోన్ ఆప్సన్ లో మరింత ఆకర్షణీయంగా ఉంది.

మరింత అందంగా మారిపోయిన జావా 42 & యెజ్డీ రోడ్‌స్టర్

ఇప్పటికే చెప్పుకున్నట్లు ఈ రెండు బైకులు కలర్ ఆప్సన్ కాకుండా ఇతర ఏ మార్పులకు లోను కాలేదు. కావున జావా 42 బైక్ అదే 293 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. కావున ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 27 బిహెచ్‌పి పవర్ మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 27.03 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇక యెజ్డీ రోడ్‌స్టర్‌ బైక్ విషయానికి వస్తే, ఇందులో 334 సిసి సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ అందుబాటులో ఉంటుంది. ఇది 29.3 బిహెచ్‌పి పవర్ మరియు 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా పొందుతుంది, అదే సమయంలో ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

యెజ్డీ రోడ్‌స్టర్‌ బైక్ మంచి డిజైన్ కలిగి ముందు భాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్‌ పొందుతుంది. ఇందులోని హ్యాండిల్‌బార్ కూడా పైకి ఉంటుంది, కావున రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో డిజిటల్ స్పీడోమీటర్ ముందు ఫోర్క్ పైన అమర్చబడి ఉంటుంది. అయితే కీహోల్ అనేది మోటార్ సైకిల్ యొక్క కుడి వైపున ఉంటుంది. రోడ్‌స్టర్ 12.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉండటం వల్ల లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

యెజ్డీ రోడ్‌స్టర్‌ హెడ్‌లైట్ గ్రిల్, USB టైప్-సి ఛార్జింగ్ సాకెట్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి కొన్ని ఆప్సనల్ ఫీచర్‌లను కూడా పొందుతుంది. ఈ బైక్ సింగిల్-పీస్ సీటు కలిగి ఉంటుంది, అంతే కాకుండా ఇది బ్యాక్‌రెస్ట్‌తో కలిపి సౌకర్యవంతంగా మరియు సపోర్టివ్‌గా కనిపిస్తుంది. సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Saturday, January 28, 2023, 9:41 [IST]
English summary
Yezdi roadster and jawa 42 launched new paint scheme price details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+