Zypp Electric: 2027 నాటికి 5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురానున్న జిప్ ఎలక్ట్రిక్..
2027 నాటికి 5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని జిప్ ఎలక్ట్రిక్ (Zypp Electric) లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకీ ఈ జిప్ ఎలక్ట్రిక్ కంపెనీ ఏంటి.. దీని కార్యకలాపాలేంటి?? ఇది ఎలా పనిచేస్తుంది.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..
Zypp Electric అనేది పూర్తిగా టెక్నాలజీ-ఆధారిత సంస్థ. జిప్ ఎలక్ట్రిక్ 2017లో ప్రారంభమైంది. ఈ కంపెనీ లక్ష్యం ఇతర కార్పొరేట్‌ల డెలివరీ కార్యకలాపాలను సులభతరం చేయడం. అంతే కాకుండా ఆ కంపెనీలకు సంబంధించిన డెలివరీ వాహనాలను విద్యుదీకరిస్తుంది. జిప్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ ద్వారా కార్పొరేట్‌లకు అనేక విధాలుగా ఈవీలను డెలివరీ చేయడంలో సహాయపడుతుంది.

అయితే జిప్ ఎలక్ట్రిక్ సంస్థ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు కాదు. మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తుంది. వాటిని మరొక డెలివరీ కంపెనీకి ఉపయోగించే కంపెనీ ఇది. Zypp Electric ఈ డెలివరీ కార్యకలాపాలను సాఫీగా చేయడానికి కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తుంది.
జిప్ ఎలక్ట్రిక్ ఈ సేవ కోసం, కంపెనీ కార్పొరేట్ల నుండి కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. ఈ క్రమంలో ఇందులో భాగంగా జిప్ ఎలక్ట్రిక్ సెప్టెంబర్ 2023 నాటికి దాని ఉపయోగం కోసం 1 లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి లెక్ట్రిక్స్ EVతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

దీంతో పాటు ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో(Zomato)తో జిప్ ఎలక్ట్రిక్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం, జిప్ ఎలక్ట్రిక్ 2024 చివరి నాటికి జొమాటోకు దాదాపు 1 లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్లను సరఫరా చేయనుంది. ఈ నేపథ్యంలో జిప్ ఎలక్ట్రిక్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఆకాష్ గుప్తా ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో ఈ విషయాలను పంచుకున్నారు.
Zypp ఎలక్ట్రిక్ అనేది పూర్తి స్థాయి SaaS సాఫ్ట్‌వేర్ సహాయంతో పనిచేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ సహాయంతో, జిప్ ఎలక్ట్రిక్ కంపెనీ తమ EV వాహనాలను నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా డెలివరీలను సకాలంలో పూర్తి చేయడానికి తోడ్పడుతుంది. జిప్ ఎలక్ట్రిక్ భారతదేశంలో ఎక్కడైనా సరే తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ట్రాక్ చేస్తుంది.
Zypp Electric తన డేస్పోర్ట్‌తో వాహనాన్ని నడిపే పైలట్‌ని SaaS సాఫ్ట్‌వేర్ ద్వారా మరియు అతనికి డెలివరీ జాబ్‌ని కేటాయించే భాగస్వామి కంపెనీ యాప్‌ను కలుపుతుంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా, జిప్ ఎలక్ట్రిక్ డెలివరీ సేవను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడమే కాకుండా, డెలివరీ సమయంలో రైడర్‌కు అవసరమైన సహాయాన్ని కూడా అందించేందుకు ప్రయత్నిస్తుంది.
అంతే కాకుండా జిప్ ఎలక్ట్రిక్‌కు చెందిన డెలివరీ వాహనాల యొక్క ముఖ్య లక్షణం మోటార్ లాక్. జిప్ ఎలక్ట్రిక్ ప్రకారం, ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్‌కు భద్రతను అందించడమే కాకుండా, డెలివరీ వాహనాల యొక్క ఖచ్చితమైన ట్రాకింగ్‌ను కూడా సులభతరం చేయడంలో దోహదపడుతుంది. వీటితో పాటు సంస్థ యొక్క సాంకేతిక లక్షణాలు బ్యాటరీ నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంటాయని సీఈవో పేర్కొన్నారు.
ఈ బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ స్థితిని సాఫ్ట్‌వేర్ పర్యవేక్షిస్తుంది. దానికి అనుగుణంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఈ టెక్నాలజీ.. తమ సేవలను మెరుగుపరచడానికి, సమయానికి మరమ్మతులు చేయడానికి, నిర్వహణకు సహాయపడతాయి. అంతేకాకుండా కొత్త మరియు వినూత్న ఆవిష్కరణలను కనుగొనడంలో సహాయపడతాయని జిప్ ఎలక్ట్రిక్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








