మిడిల్‌క్లాస్ వాళ్లకోసమే భారీ మైలేజ్‌తో.. రూ.లక్షలోపు ధరలో లభించే ఇండియా బెస్ట్ టూవీలర్స్ ఇవే..
టూవీలర్ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. ప్రజల రోజువారీ అవసరాలకు బైక్ లేదా స్కూటర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దేశంలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాటిని అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా రూ. ఒక లక్ష లోపు ధరలో లభించే బైకులు అధికంగా సేల్ అవుతుంటాయి. దేశీయ దిగ్గజ కంపెనీలు హీరో, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు సామాన్య మధ్యతరగతి కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని అందరు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో బైకులు, స్కూటర్లను విడుదల చేస్తూ టూవీలర్ కలిగి ఉండాలనే అందరి కోరికను తీరుస్తున్నాయి. ఇదిలా ఉంటే 2024 ఏడాదిలో ఈ కంపెనీలు అధునాతన మోడళ్లను విడుదల చేశాయి.
వీటిలో ప్రధానంగా బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ(Bajaj freedom 125 cng) మోడల్, హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (Hero Splendor Plus Xtec), టీవీఎస్ జూపిటర్ 110(tvs jupiter 110) స్కూటర్ ఈ ఏడాది ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ ధరలో లభించడంతో పాటు, మంచి మైలేజ్ అందిస్తాయి. వీటి గురించిన వివరాలను క్రింది కథనంలో తెలుసుకుందాం.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ గురించి మాట్లాడుకుంటే, ఇండియా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మోడల్ ఇది. దీని ప్రారంభ ధర రూ.89,997 నుంచి మొదలై రూ.1.10 లక్షల వరకు ఉంటుంది. ఇది 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇంజిన్ 9.4 హార్స్‌పవర్‌ను, 9.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను ఇచ్చారు. ఇది పొడవాటి సీటుతో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
ఇది సీఎన్‌జీ వేరియంట్ కాబట్టి 2-లీటర్/కేజీ కెపాసిటీ కలిగిన cng,పెట్రోల్ ఆప్షన్‌ను కలిగి ఉంది. సీఎన్‌జీలో దాదాపు 200 కిలోమీటర్లు, పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇది అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఫ్రంట్ ప్రకాశవంతమైన LED హెడ్‌లైట్, హ్యండిల్ బార్‌లో LCD డిస్‌ప్లే వంటి వాటితో పాటు మెరుగైన సస్పెన్సన్ సెటప్, లేటెస్ట్ బ్రేకింగ్ సిస్టం వంటివి ఉన్నాయి.

డిస్క్ బ్రేక్ హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC విషయానికి వస్తే, ఇది 97.2 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.83,461 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ఇంజిన్ 7.9 bhp పవర్, 8.05 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ బైక్ మైలేజ్‌కు పెట్టింది పేరు. లీటర్ పెట్రోల్‌పై 70 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌తో వచ్చింది.
ఈ బైక్‌లో లేటెస్ట్ ఆప్షన్లు చాలా ఉన్నాయి. చీకట్ల మెరుగైన వెలుతురు కోసం LED హెడ్‌ల్యాంప్, I3S స్టార్ట్/స్టాప్ ఆప్షన్, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ సిస్టం, సైడ్-స్టాండ్ అలర్ట్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. రోడ్లు సరిగ్గా ప్రాంతాల్లో కూడా ఈజీగా ప్రయాణించడానికి మెరుగైన సస్పెన్సన్ సెటప్ ఉంది. అలాగే ముందు 240 mm డిస్క్, వెనుక 130 డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌ను ఇచ్చారు.

ఇక TVS జూపిటర్ 110 స్కూటర్ ఇండియాలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోతున్న లిస్ట్‌లో మంచి స్థానంలో ఉంది. ఇది 113 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 48 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇంజిన్ 7.91 bhp పవర్ 9.8 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 78,391 నుండి రూ. 90,691 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








