సరికొత్త ఫీచర్లు, కలర్స్‌లో బజాజ్ పల్సర్ N250 లాంచ్.. ధర, ఇతర వివరాలివే.!!
భారత మార్కెట్లో బజాజ్ బైక్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బజాజ్ పల్సర్‌కు దేశంలో అభిమానులు ఎక్కువ. ఈ క్రమంలో తాజాగా బజాజ్ పల్సర్ N250 ని అప్‌డేట్‌తో విడుదల చేసింది. ఆకర్షణీయమైన మార్పులతో రీలాంచ్ చేసింది. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఈ కథనంలో..
యూత్ ఫేవరెట్ బైక్ బజాజ్ పల్సర్ మోడల్‌లోని బజాజ్ పల్సర్ N250 బైక్(2024 Bajaj Pulsar) అప్‌డేటెడ్ వెర్షన్‌ను సంస్థ రూ. 1.51 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. తాజా అప్‌డేట్లతో ఈ బైక్ దాని ముందున్న వెర్షన్ కంటే కూడా గణనీయమైన మార్పులను కలిగి ఉంది.

అప్‌డేటెడ్ బజాజ్ పల్సర్ 2024 లో అతిపెద్ద మార్పు.. బైక్ ముందు వైపు ఎండ్యూరెన్స్-సోర్స్డ్ 37mm అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లను కలిగి ఉంది. ఆపై, ఇది ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. మూడు ABS మోడ్‌లు.. రెయిన్, రోడ్ మరియు ఆఫ్-రోడ్ వంటి మోడ్‌లను సంస్థ ప్రవేశపెట్టింది.
మీరు ఎంచుకున్న రైడింగ్ మోడ్ ఆధారంగా ABS పనితీరు మారుతుంటుంది. రెయిన్ మోడ్‌లో రైడింగ్ చేసేటప్పుడు ఏబీఎస్ సిస్టమ్ అత్యంత అప్రమత్తంగా పనిచేస్తుంది. వీల్ లాక్‌ను కూడా గుర్తిస్తూ రైడర్‌కు అనుకూలంగా ఉంటుంది. అంటే ఆఫ్ రోడ్ మోడ్‌లో మాత్రమే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను స్విచ్ ఆఫ్ చేయవచ్చు.

ఇక కొత్త బజాజ్ పల్సర్ N250 లో విస్తృత, 140-సెక్షన్ వెనుక టైర్‌ను కూడా కలిగి ఉంటుంది. కాగా మిగిలిన చక్రం భాగాల్లో మార్పులు ఉండవు. కలర్స్ విషయానికొస్తే బజాజ్ పల్సర్ N250 రెడ్, వైట్ మరియు బ్లాక్ అనే మూడు కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎరుపు, తెలుపు కలర్ బైక్‌లు గోల్డ్ కలర్ ఫోర్క్‌లను పొందగా, బ్లాక్ కలర్ వేరియంట్ బ్లాక్ కలర్ ఫోర్క్స్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇంజిన్ విషయానికొస్తే.. పల్సర్ N250 లో 249 cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 24.1 bhp మరియు 21.5 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉంది.

ఇక బజాజ్ పల్సర్ N250 లో అన్ని అప్‌గ్రేడ్‌ల తర్వాత దీని ధర రూ. 1,829 పెరిగి రూ. 1.51 లక్షల వద్ద ఉంది. పోటీ పరంగా, భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ N250.. సుజుకి Gixxer 250కి గట్టి పోటీనిస్తుంది. కాగా ఇటీవల బజాజ్ ఆటో ఇండియా తన పల్సర్ మోడల్‌లోని పలు బైక్‌లను అప్‌డేట్ చేస్తూ ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: టెక్నాలజీ యుగంలో యువ కస్టమర్లు ఎక్కువగా టెక్ ఫీచర్లు ఉన్న వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఆటో కంపెనీలు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లను అప్‌గ్రేడ్‌లతో లాంచ్ చేస్తున్నాయి. ఆ బాటలోనే బజాజ్ కూడా ఆకర్షణీయమైన అప్‌డేట్లతో కస్టమర్లను మరింతగా పెంచుకునేందుకు యత్నిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








