అదిరిపోయే అప్‌డేట్లతో బజాజ్ పల్సర్ బైక్స్ వచ్చేశాయ్.. ధరలు ఎంతంటే.??
భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా ఉన్న బజాజ్ ఆటో రెండు సరికొత్త బైక్‌లను విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బజాజ్ పల్సర్ NS160 మరియు NS200 లలో పలు అప్‌డేట్లు చేసి సంస్థ కొత్తగా ప్రవేశపెట్టింది. వీటిలో సంస్థ చేసిన అప్‌డేట్లు ఏంటి.. ఇక్కడ చదివేయండి.
దేశంలో బజాజ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా పల్సర్. యువతకు పల్సర్ మోడల్ బైక్‌లంటే విపరీతమైన క్రేజ్. ఆకర్షణీయమైన లుక్, డిజైన్ పరంగానే కాకుండా మెరుగైన తీరుతో యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో బజాజ్ తన ప్రముఖ బైక్‌లు NS160, NS200 లో అధునాతన అప్‌డేట్లు తీసుకువచ్చింది.

అప్‌డేట్ చేయబడిన 2024 పల్సర్ NS160 మరియు పల్సర్ NS200 ధరలు ఇలా ఉన్నాయి. Pulsar NS160 ధర రూ. 1.46 లక్షలుగా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది రూ. 9000 ఎక్కువగా ఉంది. ఇక రెండో మోడల్.. NS200ను రూ. 1.55 లక్షలతో ప్రవేశపెట్టింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇది రూ. 8000 ఎక్కువగా ఉంది.
2024 అప్‌డేటెడ్ పల్సర్ NS160, NS200 లలో రీఫ్రెష్ చేసిన స్టైలింగ్, కొత్త LCD డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీతో సహా అధునాతన మార్పులను తీసుకువచ్చింది. కాగా వీటిలో అతిపెద్ద మార్పు కొత్త LED హెడ్‌లైట్‌ను వీటిలో చూడవచ్చు. దాని చుట్టూ ఉన్న DRLలు ఇప్పుడు మెరుస్తూ ఆకట్టుకుంటాయి. ఈ రెండు మోడల్స్‌లోనూ ఈ మార్పులను చూడవచ్చు.

పల్సర్ N250లో కనిపించే ఇండికేటర్లు మరియు LED యూనిట్లను వీటిలో చూడవచ్చు. ఇక డిజిటల్ డ్యాష్ బోర్డ్ ద్వారా రైడర్లు కాల్ ఇంకా SMS నోటిఫికేషన్ అలర్ట్‌లను పొందవచ్చు. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌ను డిస్‌ప్లేకు కనెక్ట్ చేసుకోవచ్చు. కన్సోల్ ఇప్పుడు స్పీడోమీటర్, రెవ్ కౌంటర్, ఓడోమీటర్, ఫ్యూయెల్ లెవెల్ స్థాయి తదితర వివరాలను.. స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని రైడర్లు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

2024 బజాజ్ పల్సర్ NS మోడల్‌లలో మొత్తం బాడీవర్క్ మరియు మస్కులర్ బాడీ ప్యానెల్‌లు అలాగే ఉన్నాయి. కొత్త NS160 లో 160cc సింగిల్-సిలిండర్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది 17.03bhp పవర్ మరియు 14.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
కొత్త పల్సర్ NS200 లో 199cc సింగిల్-సిలిండర్‌ను ఉపయోగించారు. ఇది 24.13 bhp మరియు 18.74 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. 2024 బజాజ్ పల్సర్ NS160 మరియు పల్సర్ NS200 రియర్ మోనోషాక్‌తో USD ఫ్రంట్ ఫోర్క్‌లపై ప్రయాణిస్తుంది. ABS ఫీచర్‌తో ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. 17 అంగుళాల వీల్స్‌ను కలిగి ఉంది.

ఇక మార్కెట్లో NS160, NS200 లకు ఈ సెగ్మెంట్‌లో గట్టిపోటీనిచ్చే బైక్‌లు ఉన్నాయి. టీవీఎస్ అపాచీ RTR 160 4V, హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V.. పల్సర్ NS160 కి గట్టిపోటీనిస్తున్నాయి. ఇక టీవీఎస్ అపాచీ RTR 200 4V, హోండా హార్నెట్ 2.0.. కొత్త పల్సర్ NS200 కి పోటీగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








