బైక్ ధరల జాబితా ప్రకటించిన హార్లే డేవిడ్‌సన్ - పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఖరీదైన బైకుల జాబితాలో ఒకటైన 'హార్లే డేవిడ్‌సన్' దేశీయ మార్కెట్లో తన 2024 యొక్క కొత్త మోడల్ లైనప్ ధరలను ప్రకటించాయి. ఇందులో ఏకంగా 10 ప్రీమియం హార్లే డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి.
హార్లే డేవిడ్‌సన్ ప్రకటించిన తన 2024 మోడళ్ల జాబితాలో నైట్‌స్టర్ (రూ. 13.39 లక్షలు), నైట్‌స్టర్ స్పెషల్ (రూ. 14.09 లక్షలు), స్పోర్ట్‌స్టార్ ఎస్ (రూ. 16.49 లక్షలు), ఫ్యాట్ బాబ్ 114 (రూ. 21.49 లక్షలు), పాన్ అమెరికా స్పెషల్ (రూ. 24.61 లక్షలు), ఫ్యాట్ బాయ్ ( రూ. 25.69 లక్షలు) మరియు హెరిటేజ్ 114 (రూ. 27.19 లక్షలు) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్.

పైన పేర్కొన్న బైకుల ధరలు మాత్రమే కాకుండా.. కంపెనీ బ్రేక్‌అవుట్ 117 (రూ. 30.99 లక్షలు), స్ట్రీట్ గ్లైడ్ (రూ. 38.79 లక్షలు) మరియు రోడ్ గ్లైడ్ (రూ. 41.79 లక్షలు) ధరలను ప్రకటించింది. కంపెనీ వెల్లడించిన 10 బైకుల ధరలను గమనిస్తే.. జాబితాలో అతి తక్కువ ధర వద్ద లభించే బైక్ నైట్‌స్టర్, అత్యధిక ధర వద్ద లభించే బైక్ రోడ్ గ్లైడ్.
జాబితాలో అత్యధిక ఖరీదైన బైకులుగా ఉన్న 2024 మోడల్ స్ట్రీట్ గ్లైడ్ మరియు రోడ్ గ్లైడ్ అప్డేటెడ్ ఇంజిన్ పొందుతాయి. కాబట్టి మరింత గొప్ప పనితీరును అందిస్తాయి. సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ బైకులు మెరుగైన ప్యాడింగ్‌తో రీడిజైన్ చేయబడి ఉండటం చూడవచ్చు. సస్పెన్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి బైక్ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

లిక్విడ్ కూల్డ్ వీ ట్విన్ ఇంజిన్ కలిగి స్పోర్ట్‌స్టర్ ఫ్యామిలిలో మూడు బైకులు ఉన్నాయి. అవి నైట్‌స్టర్, నైస్టర్ స్పెషల్ మరియు స్పోర్ట్‌స్టర్ ఎస్. ఇవి కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి. ఇక స్టాండర్డ్ క్రూయిజర్ శ్రేణిలో ఫ్యాట్‌బాయ్ 114, ఫ్యాట్‌బాయ్ 117, హెరిటేజ్ 117 మరియు బ్రేక్‌అవుట్ 117 బైకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అద్భుతమైన పనితీరును అందిస్తాయి.
ఇక పాన్ అమెరికా అడ్వెంచర్ బైక్ కూడా భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఉపడ్తెడ్ స్ట్రీట్ గ్లైడ్ మరియు రోడ్ గ్లైడ్ మోడల్‌లు 117 మోటార్ ఉపయోగిస్తాయి. ఈ బైకులు మెరుగైన ఏరోడైనమిక్స్, పెరిగిన రియర్ సస్పెన్షన్ మరియు 12.3 ఇంచెస్ TFT డిస్‌ప్లే ద్వారా పనిచేసే కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో లభిస్తాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారతదేశంలో హార్లే డేవిడ్‌సన్ (Harley Davidson) బైకులకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. కొనుగోలు చేసేవారి సంఖ్య మాత్రం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం వీటి ధరలు ఎక్కువగా ఉండటమే. అయితే సెలబ్రిటీలు, సినీ తారలు ఈ బైకులను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు కంపెనీ 10 బైకుల ధరలను ప్రకటించింది. ఇవి కొనుగోలుదారులను తప్పకుండా ఆకర్శించే అవకాశం ఉందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








