కొత్త హీరో డెస్టినీ స్కూటర్‌ ఆవిష్కరణ.. డిజైన్‌, ఫీచర్లు కెవ్వుకేక.. హోండా యాక్టివాకు గడ్డు కాలమే!

హీరో మోటోకార్ప్ నుంచి ఫేమస్ అయిన స్కూటర్లలో హీరో డెస్టినీ (Hero Destini 125) ఒకటి. ఇప్పుడు ఇదే స్కూటర్ సరికొత్త అవతారంలో మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. దీనికి సంబంధించిన డిజైన్ అప్ డేట్స్, ఇతర వివరాలను హీరో మోటోకార్ప్ వెల్లడించింది. భారతీయ మోటార్ సైకిల్ విభాగంలో హీరో మోటోకార్ప్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అందుకు తగినట్లుగానే ఈ స్కూటర్‌ని పలు మార్పులతో విడుదల చేయనుంది. దీని రాకతో స్కూటర్ విభాగంలో తిరుగులేని శక్తిగా అవతరించాలని ఆ కంపెనీ భావిస్తుంది. ఈ స్కూటర్‌లో భారీ ఫీచర్లు, ముఖ్యంగా సరికొత్త డిజైన్ అప్‌డేట్స్‌తో తీసుకురానుంది. ఈ కొత్త స్కూటర్‌కి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

ఇక ఈ స్కూటర్ గురించి ముందుగా మాట్లాడుకోవాల్సింది డిజైన్. ఇదివరకు లేని విధంగా సరికొత్త డిజైన్‌లో ఈ స్కూటర్‌ రానుంది. అప్‌డేటెడ్ సిల్హౌట్, హెడ్‌లైట్ డిజైన్‌తో ఈ స్కూటర్ కనిపించనుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు మునుపటి మోడళ్ల కంటే మూడు రెట్లు ప్రకాశవంతంగా రానున్నాయి. హెచ్ ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్ సెటప్‌ కలదు. ఫ్రంట్ ఆప్రాన్‌లో క్రోమ్ యాక్సెంట్స్‌, వెనుక హెచ్ ఆకారంలో LED టెయిల్‌లైట్ ఆకర్షణీయంగా ఉంటుంది.

2024 Hero Destini 125 Launch

దీని చుట్టూ మెరుస్తూ ఉండే క్రోమ్ యాసెంట్‌ (Chrome Accent) ఈ స్కూటర్‌కి ప్రీమియం లుక్‌ని అందిస్తుంది. మీరు ఎంచుకునే కలర్‌ ఆప్షన్‌ బట్టి సిల్వర్‌, బ్రాంజ్‌ కలర్స్‌లో ఈ యాసెంట్ ఫినిషింగ్‌ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త డెస్టినీ 125 ఎటర్నల్ వైట్, రీగల్ బ్లాక్, మెజెస్టిక్ మెజెంటా, కాస్మిక్ బ్లూ, గ్రూవీ రెడ్ అనే ఐదు కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. సీటు డ్యూయల్-టోన్ కలర్‌లో వస్తుంది.

ఇందులో లాంగ్ సీట్‌ కలదు. ఇక పిలియన్ రైడర్‌ కోసం బ్యాక్‌రెస్ట్‌ని అందించారు. ఇది స్కూటర్‌కి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇది ఫ్యామిలీ కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ ఈ స్కూటర్ VX, ZX ZX + అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. టాప్‌ వేరియంట్స్‌ ZX, ZX + తో పోలిస్తే బేస్ వేరియంట్ VXలో తక్కువ ఫీచర్లు ఉండనున్నాయి.

2024 Hero Destini 125 Unveiled

12 ఇంచెస్‌ అల్లాయ్ వీల్స్, సెల్ఫ్ క్యాన్సిలింగ్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో భాగంగా ముందు భాగంలో బైబ్రే కాలిపర్స్‌తో (ByBre) డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ యూనిట్‌తో వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్‌లో RSU టెలిస్కోపిక్ ఫోర్క్స్‌ ఉన్నాయి. వెనుక భాగంలో సింగిల్ సైడ్ షాక్ అబ్జార్బర్ కలదు. ఈ స్కూటర్ ముందు భాగంలో 90-సెక్షన్ టైర్, వెనుక భాగంలో 100-సెక్షన్ టైర్‌తో ప్రయాణిస్తుంది.

ఎల్ఈడీ బూట్ లైట్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌ అదనపు ఫీచర్స్‌గా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త డెస్టినీ 125కి మరొక ప్రత్యేకత అని చెప్పవచ్చు. దీనిలో నోటిఫికేషన్స్‌ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్‌లను సూచిస్తుంది. ఇందులోని ఇంజిన్ సీవీటీ యూనిట్, డ్రై సెంట్రిఫ్యూగల్ క్లచ్‌తో జతచేయబడి ఉంటుంది.

2024 Hero Destini 125 Launch date

ఇందులోని 124.6 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 7,000 rpm వద్ద 9 bhp పవర్ మరియు 5,500 rpm వద్ద 10.4 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కొత్త హీరో డెస్టిని 125 దాని అప్‌డేటెడ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్‌ అధునాతన ఫీచర్లతో మెరుగైన ఫర్పామెన్స్‌ని అందించనుందతి. దీని పోటీ ధరను ఇంకా ప్రకటించలేదు.

ఈ స్కూటర్ హోండా యాక్టివా 125, యమహా ఫాసినో, టీవీఎస్ జూపిటర్ 125, సుజుకి యాక్సెస్ 125 వంటి ప్రముఖ 125సీసీ సెగ్మెంట్ స్కూటర్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. సరికొత్త నియో-రెట్రో డిజైన్ మార్పులు, ఇతర అప్డేట్స్ తో భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కూటర్‌ పూర్తి స్తాయిలో మార్కెట్‌లో విడుదలైతే ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, September 9, 2024, 16:33 [IST]
English summary
2024 hero destini 125 unveiled with new upgrades check what changed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+