మళ్లీ వస్తున్న 'హీరో డెస్టినీ 125' స్కూటర్‌.. ఈ సారి మాములుగా ఉండదు

2024 హీరో డెస్టినీ 125 భారీ అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. త్వరలోనే ఈ స్కూటర్‌ విడుదల కానుంది. దీనికి సంబంధించిన లీకైన వివవరాలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో స్మార్ట్‌ ఫీచర్లతో రానున్న ఈ స్కూటర్‌ మెకానికల్‌గా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే హీరో నుంచి త్వరలో విడుదల కాబోతున్న 110 కాంబాట్ ఎడిషన్ తర్వాత దీనిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన సన్నాహకాలను హీరో మోటోకార్ప్ చేస్తుంది. డెస్టినీ 125 యొక్క అప్డేటెడ్ వెర్షన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా హీరో మోటోకార్ప్‌ ఉంది. ఆ కంపెనీ నుంచి డెస్టినీ 125 స్కూటర్‌ని 2018 చివరలో విడుదల చేసింది. ఈ స్కూటర్‌కి వినియోగదారున నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఈ స్కూటర్‌ హోండా యాక్టివా స్కూటర్‌ని ఢీకొట్టలేక పోయింది. నిజానికి హీరో దీనిని హోండా యాక్టివాకు ప్రత్యామ్నాయంగా భావించి తీసుకువచ్చింది. కానీ యాక్టివాకు ఉన్న క్రేజ్‌తో దాని సేల్స్‌ని తాకలేక పోయింది.

2024-Hero-Destini

అయినా కానీ డెస్టినీ వినియోగదారుల నుండి మంచి ఆదరణ పొందింది. త్వరలో రాబోయే మోడల్ భారీ మార్పులతో వస్తుంది. ముఖ్యంగా టర్న్ సిగ్నల్స్ స్లీక్‌గా (హెడ్‌లైట్‌ పక్కన) రానున్నాయి. త్రిభుజాకారంలో ఉన్న హాలోజెన్ LED యూనిట్‌లను గమనించవచ్చు. అదనంగా, బాడీ ప్యానెల్స్ పునర్నిర్మించబడ్డాయి. ప్రస్తుత స్కూటర్ పోల్చితే ఇది మరింత సొగసైనదిగా కనిపిస్తుంది. డ్యూయల్-స్పోక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ అప్డేటెడ్ డెస్టినీకి 125 కి స్పోర్టినెస్‌ లుక్‌ని అందిస్తుంది.

సైడ్ మిర్రర్లు, టెయిల్ ల్యాంప్స్, సైడ్ బాడీవర్క్‌లో పూర్తి మార్పులు ఉన్నాయి. లీకైన చిత్రం ప్రకారం మీరు వెనుక భాగంలో బ్యాక్‌రెస్ట్‌ని కూడా పొందవచ్చు. ఈ స్కూటర్‌ (బ్లాక్ పర్ల్)తో సహా హీరో అందించే కొత్త కలర్ స్కీమ్‌లలో ‌అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ సరికొత్త కలర్స్‌ హీరో డెస్టినీకి మంచి లుక్‌ని అందించనున్నాయి. లీకైన ఫోటోలోని బ్లాక్‌ పర్ల్ కలర్‌ విపరీతంగా ఆకట్టుకోనుంది.

2024-Hero-Destini-Scooter

ప్రస్తుతం హీరో చెస్టర్న్‌ బ్రాంజ్, నోబెల్ రెడ్, పెరల్ సిల్వర్ వైట్, పాంథర్ బ్లాక్, మ్యాట్ గ్రే సిల్వర్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, లిమిటెడ్ ఎడిషన్ మరియు మాట్ బ్లాక్ అనే ఎనిమిది కలర్‌ ఆప్షన్లలో స్కూటర్లను అందిస్తుంది. లీకైన ఫొటోల్లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, హీట్ షీల్డ్ ఎగ్జాస్ట్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్ యూనిట్‌లను గమనించవచ్చు. ఇంకా మరెన్నో స్మార్ట్‌ అప్‌గ్రేడ్స్‌తో ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది.

ముందు భాగంలో సస్పెన్షన్ హార్డ్‌వేర్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌, వెనుక భాగంలో స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్, టాప్-స్పెక్ వేరియంట్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సెటప్‌లతో వస్తుంది. 124.6 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది. BSVI స్టేజ్ 2 కంప్లైంట్ ఇంజిన్ 7,000 rpm వద్ద 9 bhp మరియు 5,500 rpm వద్ద 10.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర ఇంకా వెల్లడించలేదు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2024, 18:49 [IST]
English summary
2024 hero destini 125 updated scooter details leaked engine and performance details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+