సరికొత్త హీరో గ్లామర్ బైక్‌ వచ్చేసింది.. కొత్త కలర్‌ ఆప్షన్‌, LED హెడ్‌ల్యాంప్‌ ఇంకా మరెన్నో అప్‌గ్రేడ్స్!

హీరో మోటోకార్ప్ 2024 గ్లామర్ 125 ను సరికొత్త ఫీచర్లతో హీరోమోటోకార్ప్‌ విడుదల చేసింది. అదనపు ఫీచర్లతో పాటు, కొత్త కలర్ ఆప్షన్లు ఇతర అప్‌గ్రేడ్స్‌తో ఈ బైక్‌ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ మార్పులతో బైక్ ధర రూ.1,000 వరకు పెరిగింది. ఈ ధరల పెంపుతో అందుబాటులోకి వచ్చిన కొత్త గ్లామర్ 125 ఇప్పుడు దేశంలో నేటినుంచే అమ్మకానికి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ పోస్ట్‌లో చూడబోతున్నాం. కొనుగోలు, బుకింగ్స్‌ ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు మీ కోసం..

గ్లామర్ 125 హెడ్‌ల్యాంప్ మునుపటి కంటే మరింత అందంగా కనిపిస్తుంది. ఇందులో భారీ మార్పులు ఉన్నాయి. కొత్త LED హెడ్‌లైట్‌ కాంతిని సుదూర ప్రాంతాలకు వ్యాపింపజేశాలా ఉంది. ఇది రైడర్‌కి స్పష్టమైన దృష్టిని అందిస్తుంది. రాత్రి వేళల్లో రైడర్లకు ఇది మెరుగైన సౌకర్యాన్ని ఇవ్వనుంది. కొత్త గ్లామర్ 125లో ఇదొక ముఖ్యమైన అప్డేట్‌గా చెప్పవచ్చు.

2024 Hero Glamour Launched

ఈ బైక్‌లో హజార్డ్ లైట్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్ ద్వారా మనం ఎదుర్కొంటున్న ప్రమాదాలు, ప్రమాదాల గురించి ఇతర రైడర్లను అప్రమత్తం చేయవచ్చు. భారీ వర్షాలు, మంచులో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందని హీరోమోటోకార్ప్‌ పేర్కొంది. ఈ బైక్‌లో స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఫీచర్‌ని అందించారు. కీని ఉపయోగించకుండానే బైక్‌ని ఆఫ్ చేయడానికి ఈ స్విచ్ మీకు సహాయపడుతుంది. ఇదొక స్మార్ట్‌ ఫీచర్‌గా ఉంది.

ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే ఇప్పటికే అందుబాటులో ఉన్న కలర్‌ ఆప్షన్స్‌తో పాటు బ్లాక్ మెటాలిక్ సిల్వర్ కలర్‌ని కొత్తగా అందించింది. కొత్త కలర్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది. ఇక ఈ బైక్‌ క్యాండీ బ్లేజింగ్ రెడ్, బ్లాక్ స్పోర్ట్స్ రెడ్, బ్లాక్ టెక్నో బ్లూతో పాటు కొనుగోలుకి అందుబాటులో ఉంది.

2024 Hero Glamour Features

ఈ బైక్ డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోటార్ సైకిల్ 124.7 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 10.72bhp పవర్ మరియు 10.6nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయును. మెరుగైన రైడింగ్‌ అనుభవం కోసం బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌ మరియు వెనుక భాగంలో షాక్ అబ్జార్బర్లను పొందుతుంది.

మెరుగైన బ్రేకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఇంతకు ముందు చెప్పిన విధంగా డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ కూడా ఇది పొందుతుంది. ఇది 2051 mm పొడవు, 1074 mm ఎత్తు, 1273 mm వీల్‌బేస్‌ని కలిగి ఉంది. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కలిగి ఉంది. దీనివల్ల ఈ బైక్ వివిధ రహదారి పరిస్థితులలో సులభంగా ప్రయాణిస్తుంది. ఇందులో 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కలదు.

2024 Hero Glamour Price

ఎక్కువ మైలేజీ కోరుకునే వారు ఈ బైక్‌ని ఎంచుకోవచ్చు. యువతను ఆకట్టుకునేలా కొత్త కలర్ ఆప్షన్, LED లైట్ ఆకట్టుకుంటుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇతర కమర్షియల్‌ అవసరాల కోసం ఈ బైక్‌ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీని డ్రమ్‌ వేరియంట్‌ దీని ధర 83,598గా ఉంది. డిస్క్ బ్రేక్ హీరో గ్లామర్ 125 ధర 87,598గా నిర్ణయించారు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలే.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 23, 2024, 16:08 [IST]
English summary
2024 hero glamour launched with new upgrades check details here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+