హీరో ఎక్స్‌ట్రీమ్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర తక్కువే!
దేశీయ విఫణిలో కొత్త వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) 'ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ' యొక్క 2024 ఎడిషన్ ప్రో వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త కొత్త బైక్ ఇప్పుడు కొత్త పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటి వాటితో పాటు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ ధర, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
హీరో మోటోకార్ప్ యొక్క 2024 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ ధర రూ. 138500 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ధర అనేది దీని స్టాండర్డ్ ఎడిషన్ కంటే కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ధర కొంత ఎక్కువగా ఉండటానికి కారణం కాస్మొటిక్ అప్డేట్స్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ అని తెలుస్తోంది. ఈ బైక్ ఇప్పుడు కెవ్లార్ బ్రౌన్ అనే కొత్త పెయింట్ స్కీమ్ పొందుతుంది.

2024 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ చూడటానికి మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. చిన్న కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. దీని ధర స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 1000 ఎక్కువ. కొత్త కలర్ ఆప్షన్లో మాత్రమే కాకుండా నియాన్ షూటింగ్ స్టార్, స్టెల్త్ బ్లాక్ ఎంపికలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌ట్రీమ్ ప్రస్తుతం ప్రో వేరియంట్లో మాత్రమే లభిస్తున్నట్లు సమాచారం.
స్టాండర్డ్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైకులో కేవలం సింగిల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే ఉండేది. కానీ 2024 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ ఇప్పుడు డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. అంతే కాకుండా హీరో ప్యానిక్ బ్రేక్ ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది. బ్రేక్ లాంప్, టర్న్ ఇండికేటర్స్ అన్నీ కూడా సడన్ బ్రేకింగ్ విషయంలో వేగంగా ఫ్లాష్ అవుతాయి. ఇవి రైడింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ బైక్ ఉత్తమమైన పిలియన్ సీటును పొందుతుంది. సింగిల్ పీస్ సాడిల్ కోసం స్ప్లిట్ సీట్ కాన్ఫిగరేషన్ తొలగించబడింది. కాబట్టి ఇది ఇప్పుడు రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ బైక్.. రైడర్లకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. మొత్తం మీద ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ ఆధునిక హంగులను పొందుతుంది.
2024 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ 163.2 సీసీ సింగిల్ పాటు ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 16.6 Bhp పవర్ మరియు 14.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ కేవైబీ యూఎస్డీ సెటప్, ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ వంటివి పొందుతుంది.

కొత్త 2024 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ ముందు భాగంలో 100/80-ఆర్17 సెక్షన్ టైర్, వెనుక భాగంలో 130/70-ఆర్17 సెక్షన్ టైర్ పొందుతుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ లేటెస్ట్ బైక్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, యమహా ఎఫ్జెడ్ఎస్ ఎఫ్ఐ వీ4 మరియు హొండా ఎస్పీ160 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








