Husqvarna Svartpilen 401 Review Video హస్క్‌వర్నా స్వార్ట్‌పైలెన్ 401 పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ వీడియో
2018లో అంతర్జాతీయ మార్కెట్‌లో Husqvarna Svartpilen బైక్ అరంగేట్రం చేసింది. రెండేళ్ల తర్వాత 2020లో ఈ బైక్ భారత మార్కెట్లో ప్రవేశించింది. ఈ స్వీడిష్ స్ట్రీట్ మార్వెల్ తన నియో-రెట్రో లుక్‌తో 2024 Husqvarna Svartpilen 401 ఇటీవల లాంచ్ కాగా.. టెస్ట్ రైడ్ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌ను ఆహ్వానించింది. పూర్తి రివ్యూ వీడియో ఈ కథనంలో..
Husqvarna Svartpilen 401 డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రోడ్డుపైనే కాకుండా ఆఫ్ రోడింగ్‌లోనూ అనువుగా ఉండేలా టైర్‌లను ఈ బైక్‌కు అమర్చారు. హస్క్‌వర్నా స్వార్ట్‌పైలెన్ 401 వృత్తాకార LED హెడ్‌లైట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో సింగిల్ రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రెట్రో లుక్‌ను కలిగి ఉంటుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మరియు నాబీ టైర్ల ద్వారా రైడర్లు ఆహ్లాదకరమైన రైడింగ్‌ను పొందవచ్చు.
సొగసైన ఇండికేటర్లు, చిన్న విండ్‌షీల్డ్ ఈ బైక్‌కు మరింత లుక్‌ను జోడిస్తాయి. ఇక Svartpilen 401 ఇంజిన్ విషయానికొస్తే ఇందులో 399cc, సింగిల్-సిలిండర్, DOHC ఇంజన్‌ను ఉపయోగించడంతో.. 45.6bhp మరియు 39Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడటం ద్వారా మరింత మృదువుగా, కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ బైక్ బరువు 171 కిలోలు ఉండటంతో.. దాని లైనప్‌లో ఇదే బరువైన మోటార్ సైకిల్.

177mm గ్రౌండ్ క్లియరెన్స్, గ్రిప్పీ 110/70 ఫ్రంట్ మరియు 150/60 వెనుక టైర్లు 17 అంగుళాలతో ఉండగా.. సామర్థ్యం గల ఛాసిస్‌ను కలిగి ఉంది. దీని ద్వారా గరుకు రోడ్లు, కఠినమైన భూభాగాలపై సైతం హస్క్‌వర్నా స్వార్ట్‌పైలెన్ 401 సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంకా ఇందులో 13.5-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇక ఫ్రంట్ డిస్క్ 320mm, రియర్ డిస్క్ 240mm ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








