2024 Indian Roadmaster Elite: ఈ బైక్ కేవలం 350 మందికి మాత్రమే.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి!
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఏదో ఒక మూల ఏదో ఒక వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థ కొత్త '2024 రోడ్‌మాస్టర్ ఎలైట్' ఆవిష్కరించింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన 2024 ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్‌కు కంపెనీ 1904 ఇండియన్ కామెల్‌బ్యాక్ యొక్క రెడ్ పెయింట్‌కు నివాళులు అర్పించడంలో భాగంగానే చెర్రీ రెడ్ అండ్ బ్లాక్ పెయింట్ స్కీమ్ అందించింది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఈ కొత్త బైకులో చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నట్లు, ఇవన్నీ వాహన వినియోగదారుని అనుకూలంగా ఉంటాయని సమాచారం.

2024 ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఈ బైకును కేవలం 350 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైకులో ఇంజిన్, ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ఫుట్ రెస్ట్ మీద బ్రాండింగ్ మరియు గ్రాఫిక్స్ చూడవచ్చు. ఇవి బైకుకు మరింత ఆకర్షణీయతను అందిస్తాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7 ఇంచెస్ TFT స్క్రీన్ ఉంటుంది. దీని ద్వారా టర్న్-బై-టర్న్ న్యావిగేషన్ పొందవచ్చు. అంతే కాకుండా ఇందులో హీటెడ్ అండ్ కోల్డ్ సీటు, పిలియన్ కోసం ఆర్మ్‌రెస్ట్ వంటివి ఉన్నాయి. రోడ్‌మాస్టర్ ఎలైట్ లిమిటెడ్ ఎడిషన్ గ్లోస్ బ్లాక్ డాష్, బ్లాక్ అవుట్ విండ్ స్క్రీన్, హ్యాండ్ పెయింటెడ్ గోల్డెన్ పిన్‌స్ట్రైప్స్ మరియు కలర్ మ్యాచింగ్ సీటు పొందుతుంది.

కొత్త ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ కార్నరింగ్ లైట్స్ మరియు 12 స్పీకర్ ఆడియో సిస్టం సెటప్ పొందుతుంది. ఈ బైకులో స్టోరేజ్ కెపాసిటీ ఏకంగా 136 లీటర్లు (శాడిల్ బ్యాగ్, టాప్ బాక్స్) కావడం గమనార్హం. ఇవన్నీ కూడా రిమోట్ లాక్ చేయబడతాయి. ఈ బైక్ 10 స్పోక్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
2024 రోడ్‌మాస్టర్ ఎలైట్ 1890 సీసీ వీ-ట్విన్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 bhp పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. సుమారు 412 కేజీల బరువున్న ఈ బైక్ దాని ప్రత్యర్థుల కంటే ఎక్కువ వెయిట్ కలిగి ఉన్నట్లు సమాచారం.

కంపెనీ ఈ కొత్త రోడ్‌మాస్టర్ ఎలైట్ లిమిటెడ్ ఎడిషన్ ధరలను వెల్లడించలేదు. కానీ ఈ బైక్ ధర 41999 అమెరికన్ డాలర్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34.85 లక్షలు. అయితే ఖచ్చితమైన ధరలు ఈ బైక్ లాంచ్ అయ్యే సమయంలో వెలువడతాయి. అంతేకంటే ముందు ఈ బైక్ భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సిన విషయం.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








