వారెవా ఏమి బైకు.. అచ్చు హీరోలాగా ఉంది బాసూ.. చూస్తే మాత్రం కొనకుండా ఉండలేరు..

లగ్జరీ బైకులకు పేరుగాంచిన జావా మోటార్‌సైకిల్స్ నుంచి ఇటీవల అదిరిపోయే డిజైన్‌తో కొత్త మోడల్ జావా 42 ఎఫ్‌జె(jawa 42 fj) బైక్ ఇండియా మార్కెట్లోకి విడుదల అయింది. దీని లుక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. పాత జావా మోడళ్లతో పోలిస్తే, ఇది మరింత అధునాతన ఫీచర్లతో వచ్చింది. దీని ధర రూ.1.99 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది చాలా శక్తివంతమైన ఇంజిన్‌తో లాంచ్ అయింది. ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా లగ్జరీ లుక్‌ను కలిగించే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో జావా కంపెనీ తన మార్కెట్‌ను మరింత విస్తరించడానికి ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్ మీద రోడ్లపై వెళ్తుంటే ఒక హీరో లాంటి ఫీలింగ్ కలుగుతుంది. చూడటానికి రాయల్‌ లుక్‌తో ఉన్న బైకు ఇతర వివరాలను క్రింది కథనంలో చూద్దాం..

డిజైన్: కొత్త జావా 42 ఎఫ్‌జె బైక్ మోడ్రన్ రెట్రో థీమ్‌ను కలిగి ఉంది. ఇది టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్‌కు పక్కన ఉన్న అల్యూమినియం ప్లేట్ నుండి స్పష్టంగా కనిపిస్తుంది. సైడ్ ప్యానెల్ ఇతర జావా 42ల మాదిరిగానే ఉంది. కంపెనీ బ్రాండ్ చరిత్రకు అనుగుణంగా ఇది స్టైలీష్‌గా ఉంది. వెనుక ఫెండర్ నుండి బయటకు వచ్చిన విలక్షణమైన జావా టెయిల్ లైట్‌తో ఫెండర్‌లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

2024 Jawa 42 Fj Features

దీని మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్-అవుట్ ఇంజిన్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ పైపులు బైక్ స్పోర్టీ అంశాలను మరింత మెరుగుపరుస్తాయి. బేస్ మోడల్‌లో వైర్-స్పోక్ వీల్స్ ఉన్నాయి. ఇంధన ట్యాంక్ చాలా అద్భుతంగా ఉంటుంది. బైకుకు అల్యూమినియం హెడ్‌ల్యాంప్ హోల్డర్‌లు, గ్రాబ్ హ్యాండిల్స్, ఫుట్‌పెగ్‌లు ఉన్నాయి. బైక్ ప్రత్యేకమైన ఆఫ్-సెట్ ఫ్యూయల్ క్యాప్, ప్రీమియం స్టిచింగ్‌తో కూడిన సొగసైన, ఫ్లాట్ సీటును కలిగి ఉంది.

ఇంజిన్: ఇది ఆల్ఫా 2, 334 cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 21.45PS పవర్, 29.62Nm గరిష్ట్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. సస్పెన్షన్ సెటప్ కూడా అధునాతనంగా ఉంది. బైక్‌ ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ఇది సిటీ, లాంగ్ రైడ్‌లకు అనుకూలంగా ఉంటుంది.

2024 Jawa 42 Fj Launch Details

బ్రేకింగ్ సిస్టమ్: ప్రధానంగా కొత్త జావా 42 FJ బైక్ బ్రేకింగ్ సెటప్ గురించి చెప్పాలంటే, ఇది ఫ్లోటింగ్ కాలిపర్‌లతో ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో వచ్చింది. ఇది అదనపు భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టంను కలిగి ఉంది. ఇది 1440 mm వీల్‌బేస్, 178mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. డిస్క్ బ్రేక్‌లు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఎలాంటి రోడ్లపై అయిన కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది.

బైక్ స్కిడ్ కాకుండా ఉండటానికి మందపాటి ట్యూబ్‌లెస్ టైర్లను అందించారు. ఈ బైక్ డీప్ బ్లాక్ మ్యాట్ రెడ్ క్లాడ్, డీప్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ క్లాడ్, కాస్మో బ్లూ మ్యాట్, మిస్టిక్ కాపర్, అరోరా గ్రీన్ మ్యాట్ వంటి ఐదు కలర్స్‌లో అందుబాటులో ఉంది. కస్టమర్లు తమకు నచ్చిన కలర్‌ను ఎంచుకోవచ్చు. జావా 42 FJ అమ్మకాలపై కంపెనీ చాలా ఆశలు పెట్టుకుంది.

2024 Jawa 42 Fj Top Specifications

రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి లగ్జరీ బైకులకు పోటీగా ఇది కచ్చితంగా మెరుగైన విక్రయాలను సాధిస్తుందని జావా సంస్థ అంచనా వేస్తుంది. రానున్న రోజుల్లో ఈ బైక్ అమ్మకాల పరంగా సరికొత్త రికార్డును నమోదు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాల వారు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, November 4, 2024, 10:20 [IST]
English summary
2024 jawa 42 fj launch price engine all top specifications details here
Read more on: #jawa motorcycles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+