రూ. 73,700లకే 'కొత్త జూపిటర్‌' స్కూటర్‌ విడుదల.. క్రేజీ డిజైన్‌, మరిన్నీ స్మార్ట్ ఫీచర్లతో సరికొత్తగా లాంచ్!!

2024 జూపిటర్‌ 110 (2024 Jupiter 110) స్కూటర్‌ నేడు అధికారికంగా మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ ప్రముఖ టూవీలర్‌ సంస్థ టీవీఎస్‌ తన కంపెనీ లైనప్‌లోని ది బెస్ట్ సెల్లర్ జూపిటర్‌ని ఇప్పుడు సరికొత్త అవతారంలో విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ న్యూ స్కూటర్‌లో డిజైన్, స్మార్ట్‌ టెక్నాలజీని పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేసింది. హోండా యాక్టివాకు గట్టి పోటీని ఇచ్చేలా దీనిని పూర్తి అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో ప్రవేశ పెట్టింది. భారతదేశ స్కూటర్ సెగ్మెంట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించాలనే ఉద్దేశంతో ఈ స్కూటర్‌ని విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఎవ్వరూ ఊహించిన ధరలో భారీ ఫీచర్లతో ఈ స్కూటర్‌ని మార్కెట్‌లోకి తీసుకురావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ స్కూటర్‌లోని వేరియంట్లు, ఫీచర్లు తదితర అంశాలు ఈ కథనంలో..

భారతీయ మార్కెట్‌లోని స్కూటర్ విభాగంలో టీవీఎస్‌ జూపిటర్‌ ప్రస్తుతం నం.2 స్థానంలో ఉంది. ఇప్పుడు కొత్త తరం మోడల్‌తో పూర్తి స్థాయిలో క్లాసిక్ ఫ్యామిలీ స్కూటర్‌గా అవతరించింది. దీనిని అందరికీ నచ్చే విధంగా కొత్త డిజైన్‌లో విడుదల చేసింది. టీవీఎస్ ఫ్యామిలీ స్కూటర్లతో ఇప్పటివరకు అందించని ఫీచర్లు, స్పేస్‌తో మరింత మందిని చేరువ అయ్యేలా దీనిని మార్పులు చేసి మార్కెట్‌లో విడుదల చేసింది.

2024 Jupiter 110 launched at Rs 73700

టీవీఎస్ 2024 జూపిటర్‌ మల్టీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మెటియోర్ రెడ్ గ్లాస్, టైటానియం గ్రే మ్యాట్, లూనార్ వైట్ గ్లాస్, స్టార్లైట్ బ్లూ గ్లాస్, గెలాక్టిక్ కాపర్ మ్యాట్ మరియు డాన్ బ్లూ మ్యాట్ అనే 6 ఆకర్షణీయమైన కలర్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ రంగుల్లో డాన్ బ్లూ మ్యాట్ లాంచ్ కలర్‌గా విడుదల చేసింది.

స్లీక్ హెడ్‌లైట్స్‌తో ఫ్రంట్‌ ఫేసియాను ఆకర్షణీయంగా రూపొందించింది. గ్లాస్ బ్లాక్ ప్లాస్టిక్‌ స్టైలిష్‌తో ఉంటుంది. అయితే ఫ్రంట్ అప్రాన్ పెద్దగానే ఉండనుంది. అధునాతన LED DRLsతోLED టర్న్ ఇండికేటర్లను అందించింది. ఇది లాంగ్ సీట్‌ని కలిగి ఉంది. 2024 టీవీఎస్‌ జూపిటర్ టాప్ వేరియంట్‌లో డ్యూయల్-టోన్ స్టిచింగ్‌, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సెటప్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

2024 Jupiter 110 launched at Rs 73700

2024 జూపిటర్‌లో మెచ్చుకోవాల్సిన ఫీచర్‌ ఫార్వర్డ్ సెట్ ఫ్యూయల్ ఫిల్లింగ్‌. ఇప్పటి వరకు జూపిటర్‌ వెనక భాగంలో ఫిల్లింగ్‌ చేసేవారు. ఇక నుంచి ముందు నుంచే ఫిల్‌ చేసుకోవచ్చు. కీ దగ్గరే USB ఛార్జర్ పోర్ట్‌ అక్కడే ఉండే చిన్న జేబులో ఫోన్‌ ఇతర వస్తువులను ఉంచవచ్చు. వస్తువులను వేలాడదీయడానికి హుక్ కూడా అందించారు. ఫ్యూయల్ ట్యాంక్ ఫ్లోర్ బోర్డ్‌లో ఉంచడం వల్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్ లభిస్తుంది.

డిజిటల్‌ ఇన్‌స్ట్రూమెంట్‌లో డిజిటల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ని సూచిస్తుంది. ఇందులో అత్యవసర బ్రేకింగ్ అలర్ట్‌ని కూడా కలిగి ఉంది. ఇది పానిక్ బ్రేకింగ్‌ సమయంలో బ్లింకర్లను ఫ్లాష్ చేస్తుంది. టర్న్ ఇండికేటర్లు రియల్ టైమ్‌లో ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవ్వవు. కానీ అవి ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఆఫ్ అయిపోతాయి.

2024 Jupiter 110 launched at Rs 73700

2024 టీవీఎస్‌ జూపిటర్ 110 న్యూ జెన్ ఇంజిన్ (New J110)తో నడిచే కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. మునుపటి జూపిటర్ 110 109.7 సీసీ యూనిట్‌తో పోలిస్తే ఇది కొద్దిగా ఎక్కువ 113.3సీసీతో వస్తుంది. ఎలక్ట్రిక్ అసిస్ట్‌తో కూడిన మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీని ఇంజిన్‌లో అందిస్తోంది. ఇది 8bhp పవర్ 9.2nm టార్క్‌ని, అసిస్ట్‌తో 9.8nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని iGO అసిస్ట్ (iGO assist) టెక్నాలజీ ద్వారా ఇంటెలిజెంట్ స్టార్ట్/స్టాప్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌గా పనిచేస్తుంది. టీవీఎస్ వేగవంతమైన స్టాండ్-స్టార్ట్ యాక్సిలరేషన్ మరియు పాస్-బై యాక్సిలరేషన్‌తో పాటు మెరుగైన టార్క్ మరియు ఉత్తమ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. జూపిటర్‌ పాత వెర్షన్ ఇది భర్తీ చేస్తుంది. దీనిని కేవలం రూ.73,700 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Thursday, August 22, 2024, 13:41 [IST]
English summary
2024 jupiter 110 launched at rs 73700 check full features and specifications
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+