రైడింగ్‌కి సిద్దమైపోండి.. Kawasaki కొత్త బైక్ వచ్చేసింది - ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపాన్ బైక్ తయారీ సంస్థ 'కవాసకి' దేశీయ విఫణిలో '2024 జెడ్900' (2024 Z900) బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కవాసకి లాంచ్ చేసిన కొత్త 2024 జెడ్900 బైక్ ధర రూ. 9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ బైక్ చూడటానికి దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ధర మాత్రమే పాత మోడల్ కంటే రూ.9000 ఎక్కువ కావడం గమనార్హం. ఈ బైక్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మెటాలిక్ స్పార్క్ బ్లాక్ మరియు మెటాలిక్ మ్యాట్ గ్రాఫెన్ స్టీల్ గ్రే కలర్స్.

2024 కవాసకి జెడ్900 మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. చిన్న హెడ్‌లైట్ ఇందులో కనిపిస్తుంది. స్పోర్టీ అండ్ రిలాక్డ్ రైడింగ్ అనుభూతిని అందించడానికి అనుకూలంగా ఉండే.. సీటు ఇందులో లభిస్తుంది. పిలియన్ కోసం స్టెప్ అప్ సీటు పొందుతుంది. ట్రెల్లీస్ ఫ్రెమ్ మీద ఆధారపడి ఉండే ఈ బైక్.. ప్లాట్ హ్యాండిల్ బార్, సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్ ఇందులో ఉన్నాయి.
ఇందులో కలర్ TFT డ్యాష్ ఉంటుంది. దీనిని రేడియాలజీ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి జత చేసుకోవచ్చు, తద్వారా నోటిఫికెషన్స్, న్యావిగేషన్ అలర్ట్స్ పొందవచ్చు. ఈ బైక్ ఫ్రంట్ సైడ్ USD ఫోర్క్ సెటప్, వెనుక వైపు మోనోషాక్ ఉంటుంది. ఇందులో 300 మీమీ డిస్క్ బ్రేక్ (ముందువైపు), సింగిల్ డిస్క్ 250 మీమీ వరకు ఉంటుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది.

కొత్త కవాసకి జెడ్900 బైక్ 948 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 9500 rpm వద్ద 125 హార్స్ పవర్ మరియు 7700 rpm వద్ద 98.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ తప్పకుండా దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరుని అందిస్తుందని భావిస్తున్నాము.
రెండు పవర్ మోడ్స్, త్రీ లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్, మూడు రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్ కర్బ్ వెయిట్ 212 కేజీలు, కాగా సీటు ఎత్తు 820 మీమీ వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 145 మిమీ వరకు ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమమైన ఈ బైక్ రైడింగ్ చేయడానికి కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 2024 కవాసకి జెడ్900 బైక్.. దేశీయ విఫణిలో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ (రూ. 10.17 లక్షలు, ఎక్స్ షోరూమ్) బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాయి. అయితే దాదాపు రూ. 10 లక్షల ధర వద్ద లాంచ్ అయిన ఈ బైక్ ఎలాంటి అమ్మకాలు పొందుతుందనేది తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








