టీవీఎస్‌ నుంచి అప్‌డేటెడ్‌ అపాచీ బైక్‌ లాంచ్‌.. స్పోర్టియర్‌ లుక్‌, రేసింగ్‌లోనూ దుమ్ము లేపండి!

టీవీఎస్ మోటార్ కంపెనీ అప్‌డేటెడ్‌ RR 310 బైక్‌ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు ఎక్కువ పవర్‌ అదనపు స్టైలింగ్‌తో వస్తుంది. ఈ సరికొత్త 2024 టీవీఎస్ అపాచీ RR 310 ప్రారంభ ధర రూ.2.75 లక్షల వద్ద మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రెండు వేరియంట్స్‌, మూడు బిల్ట్-టు-ఆర్డర్ (బిటిఓ) ఆప్షన్స్‌తో వస్తుంది. అయితే ఇది పూర్తిగా ఫెయిర్డ్, సూపర్ స్పోర్ట్ డిజైన్‌ని కలిగి ఉంది. ఈ బైక్ ట్రాక్, స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్లతో వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఈ అప్‌డేటెడ్ DOHC ఇంజిన్ 9800 rpm వద్ద 38 ps పవర్‌ని, 7900 rpm వద్ద 29 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని వాల్యూమెట్రిక్ సామర్థ్యాన్ని పెంచడానికి ఎయిర్‌ ఇన్ టేక్ సిస్టమ్‌ని సవరించారు. కొత్త తేలికైన అల్యూమినియం ఫోర్జ్డ్ పిస్టన్‌తో ఇంజిన్ ఇప్పుడు మరింత శక్తిని అందిస్తుంది. ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ (ఆప్షనల్) తో జతచేయబడి వస్తుంది.

2024 TVS Apache RR 310 Launched

ఇందులోని ఏరోడైనమిక్ రెక్కలు (Winglets) మంచి డౌన్ ఫోర్స్, స్థిరత్వాన్ని అందిస్తాయి. ఈ వింగ్స్‌ 3 కిలోల డౌన్ ఫోర్స్‌ హై-స్పీడ్ రన్‌లో కంట్రోల్‌ని అందిచగలవు. ఇందులో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాన్స్‌పరెంట్‌ క్లచ్ కవర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, RT-DSC (Race- Tuned Dynamic Stability Control) ఉన్నాయి. అలాగే టీవీఎస్‌ కనెక్ట్‌ యాప్‌ ద్వారా ఈ బైక్‌కి సంబంధించిన సమగ్ర సమాచారం లభిస్తుంది.

RT-DSCలో ఇదే ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ 6D IMUగా రానుంది. దీంతో ఇందులో భారీ సేఫ్టీ ప్యాకేజీతో వస్తుంది. వీటిలో కార్నరింగ్ ఏబీఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్ (Wheelie Control), స్లోప్ డిపెండెంట్ కంట్రోల్, రియర్ లిఫ్ట్-ఆఫ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. IMU క్రూయిజ్ ఫంక్షన్‌తో ఇది ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ కార్నరింగ్ క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది.

2024 TVS Apache RR 310 Launched

టీవీఎస్ 'బిల్ట్ టు ఆర్డర్' ప్లాట్‌ఫామ్‌ ద్వారా 2021లో ఈ ఫ్లాగ్‌షిప్‌ మోటార్‌సైకిల్‌ని అందిస్తున్నారు. వినియోగదారులు రెండు BTO కిట్స్‌ (డైనమిక్, డైనమిక్ ప్రో) ఒక కలర్ ఆప్షన్‌తో మోటార్ సైకిల్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన రేస్ నంబర్‌ని కూడా మోటార్ సైకిల్‌పై కస్టమైజ్‌ చేసుకోవాలి. ఈ రేస్ రిప్లికా ఖరీదు రూ 7,000గా ఉంది.

డైనమిక్ కిట్‌లో ప్రీలోడ్‌తో పూర్తిగా సర్దుబాటు చేయగల సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్, ప్రీలోడ్, వెనుక మోనోషాక్‌ రీబౌండ్ డంపింగ్ సర్దుబాటు ఉంటాయి. ఈ కిట్‌లో సరైన పనితీరు కోసం టైర్ ప్రెజర్ రియల్ టైమ్ ట్రాక్ చేయడానికి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్రాస్‌-కోటెడ్ డ్రైవ్ చైన్ కూడా ఉన్నాయి. ఇది మోటార్ సైకిల్ ఫర్ఫామెన్స్‌ని మెరుగుపరచడమే కాకుండా తుప్పు పట్టకుండా రక్షిస్తుంది. తద్వారా చైన్ లైఫ్‌స్టైల్‌ కూడా పెరుగుతుంది.

2024 TVS Apache RR 310

ఇందులో ఆప్షనల్‌గా వచ్చే డైనమిక్ కిట్‌ కోసం అదనంగా రూ.18,000 చెల్లించాలి. డైనమిక్ ప్రో కిట్‌లో రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో వస్తుంది. దీని ధర రూ. 16,000గా ఉంది. ఇందులో బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ ఆప్షన్ రూ.17,000కి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 16, 2024, 18:43 [IST]
English summary
2024 tvs apache rr 310 launched at rs 2 75 lakh check all details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+