ఆగస్టు 22న తొలి సీఎన్‌జీ స్కూటర్ రాబోతుంది.. ఆకట్టుకుంటున్న టీజర్!
ఆగస్టు 22 న టీవీఎస్ కంపెనీ ఓ స్కూటర్‌ని అధికారికంగా లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి ఇది వరకే వార్తలు వచ్చాయి. తాజాగా ఆ పుకార్లకు వాటికి బలం చేకూరుస్తూ ఆ సంస్థ ఇప్పుడు టీజర్‌ని విడుదల చేసింది. ఈ టీజర్‌లో వాహనం విడి భాగాలను మాత్రమే చూపించింది. తాజాగా విడుదలైన ఫోటోలలో ఆ స్కూటర్ ఫుల్ వ్యూ కనిపించకుండా ఉండేందుకు టీవీఎస్ జాగ్రత్త పడింది. విడుదల రోజే దీనికి సంబంధించిన లుక్‌ని చూపించే అవకాశం ఉంది.
అయితే ఆ కంపెనీ తీసుకురాబోయే ఈ స్కూటర్ సీఎన్‌జీ ఆధారిత స్కూటర్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సీఎన్‌జీ ఆధారిత స్కూటర్‌ని విడుదల చేసేందుకు టీవీఎస్ ప్లాన్ చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ టీజర్‌ని విడుదల చేసి మరింత ఆసక్తిని పెంచింది. దీనిని విడుదలకు సంబంధించిన అడ్వర్టైస్‌మెంట్‌ని ఆ కంపెనీ కాస్త వేగవంతం చేసింది.

కంపెనీ పాపులర్ స్కూటర్ మోడళ్లలో ఒకటైన జూపిటర్ 110 అప్డేటెడ్ మాదిరిగా వెర్షన్ టీజర్ చిత్రాలు ఉన్నాయి. సీఎన్‌జీ స్కూటర్‌ని విడుదల చేయడమే కాకుండా తన ఉత్పత్తులను రిఫ్రెష్ చేసే పనిలో టీవీఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. జూపిటర్ 110 మోడల్‌ని కూడా అప్ డేట్ చేస్తున్నట్లు తెలిసింది. విడుదలకు రెండు రోజుల ముందు ద్విచక్ర వాహన ప్రియుల దృష్టిని ఆకర్షించేందుకు టీవీఎస్ తన టీజర్ చిత్రాలను విడుదల చేయనుంది.
ముందుగా చెప్పినట్లుగానే ఆగస్టు 22న ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ చిత్రాల ఆధారంగా జూపిటర్ 110 స్కూటర్‌ని ఇప్పటి వరకు కంపెనీలో లేని విధంగా అప్ డేట్ చేసినట్లు తెలుస్తోంది. స్కూటర్ ముందు, వెనుక, వైపులా కొత్త లుక్ ఇచ్చేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. టీజర్ చిత్రాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.
ఇందులో లైట్లు మార్చినట్లు టీజర్ చిత్రాలు కూడా ధృవీకరిస్తున్నాయి. కొత్త జూపిటర్ 110లో కొత్తDRL, హెడ్‌లైట్లు, కొత్త డిజిటల్ స్క్రీన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్క్రీన్‌పై అదనపు ఫీచర్‌గా టర్న్ బై టర్న్ రూట్‌కి సంబంధించిన సమాచారాన్ని అందించే ఆప్షన్ కూడా ఇందులో ఆశించవచ్చు. అయితే కొన్ని విషయాల్లో ఇంజిన్‌లో ఎలాంటి మార్పు ఉండబోవని చెబుతున్నారు.
ప్రస్తుత జూపిటర్ 110 కు 109.7 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 7.88 ps శక్తిని 8.80 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది హోండా యాక్టివాకు పోటీగా జూపిటర్ 110ను విక్రయిస్తోంది. ఇప్పుడు రిఫ్రెష్డ్ జూపిటర్ 110ని విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం ఈ స్కూటర్‌పై టీవీఎస్ పతీష్టాత్మకంగా తీసుకునట్లు అర్థమవుతోంది.
హోండా యాక్టివా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా ఉంది. అదే స్థాయిలో టీవీఎస్ జూపిటర్ స్కూటర్ గట్టి పోటీని ఇస్తుంది. ఇప్పుడు మరింత పోటీని ఇచ్చేందుకు జూపిటర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ త్వరలో అమ్మకానికి రానుంది. అయితే దీనిని సీఎన్‌జీ వెర్షన్‌లో తీసుకువస్తుండటంతో ఆసక్తి పెరుగనుంది. అయితే దీనిపై కంపెనీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ సీఎన్‌జీ వెర్షన్‌లో వస్తే ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌గా రికార్డు తిరగరాయనుంది.


Click it and Unblock the Notifications








