2024 TVS Jupiter 110 Review Video ఈ అప్‌డేటెడ్‌ స్కూటర్‌ ఎలా ఉందో ఇక్కడా తెలుసుకోండి!

TVS జూపిటర్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కమ్యూటర్ స్కూటర్‌గా ఉంది. దీనిని పూర్తి అప్‌గ్రేడ్‌లతో మార్కెట్‌లో పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్ మెరుగైన డిజైన్, భారీ ఫీచర్లు, మంచి ఫర్ఫామెన్స్‌ని కలిగి ఉంది. మా డ్రైవ్స్‌పార్క్‌ బృందం ఈ స్కూటర్‌ని రివ్యూ చేయడానికి టెస్ట్-డ్రైవ్ చేసింది. దీనికి సంబంధించిన ఫుల్‌ రివ్యూ ఇక్కడ మీ కోసం వీడియో రూపంలో అందిచాము.

డిజైన్ & స్టైలింగ్: TVS జూపిటర్ 110 దాని కొత్త డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. హ్యాండిల్‌బార్, ఫ్లోర్‌బోర్డ్ మరియు సులభంగా యాక్సెస్ చేయగల సీటు ఎత్తు వంటి ఫీచర్లు భారతీయ రైడర్‌లకు బాగా ఉపయోగపడతాయి. అదనంగా, ఇది ఆధునిక పూర్తి డిజిటల్ కలర్ LCD స్పీడోమీటర్‌తో వస్తుంది. ఇందులో స్మార్ట్ అలర్ట్స్‌, మైలేజీ ఇండికేటర్‌లు ఇంకా మరెన్నో ఇండికేటర్లను చూపిస్తుంది.

ఈ స్కూటర్‌ 113.3 cc సింగిల్-సిలిండర్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 2024 జూపిటర్ 110 సౌకర్యవంతమైన మరియు ఆనందకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. దీని సస్పెన్షన్ సిస్టమ్ ఎత్తైన ప్రదేశాలలో, గుంతల రోడ్లలో కూడా బాగా పని చేస్తుంది. దీనిపై ఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణాన్ని సాగించవచ్చు. ఎర్గోనామిక్ డిజైన్ వివిధ ఎత్తుల రైడర్‌లకు అనువైన సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఇది పట్టణ ప్రయాణానికి అనువైనదిగా ఉంటుంది.

జూపిటర్ 110 అప్‌డేట్ చేయబడిన డిజైన్‌, ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన ఆల్-రౌండర్ స్కూటర్‌గా పనిచేస్తుంది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 73,700 (ఎక్స్-షోరూమ్), టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 87,250 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మంచి మైలేజీతో పాటు ఫర్ఫామెన్స్‌ని ది బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది.

2024 TVS Jupiter 110 Review Video in Telugu 2024

More from DriveSpark

Article Published On: Saturday, August 24, 2024, 12:21 [IST]
English summary
2024 tvs jupiter 110 review video in telugu riding impressions specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+