యమహా ఫాసినో ఇప్పుడు సరికొత్త వేరియంట్‌లో.. ధర కూడా తక్కువే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు లేదా అప్డేటెడ్ వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా ఇండియా ఎట్టకేలకు తన 'ఫాసినో' స్కూటర్‌ను 'ఎస్' వేరియంట్లో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్కూటర్ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ గమనించవచ్చు. కంపెనీ లాంచ్ చేసిన కొత్త 'యమహా ఫాసినో ఎస్' స్కూటర్ ధర, డిజైన్, కలర్ ఆప్షన్స్ మరియు ఇంజిన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త యమహా ఫాసినో ఎస్ వేరియంట్ ధర రూ. 93730 (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఇప్పుడు ఈ స్కూటర్‌ను అప్డేటెడ్ ఫీచర్లతో అందిస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గ అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే.. ఫైండ్ మై స్కూటర్. దీనినే 'ఆన్సర్ బ్యాక్' అని పిలుస్తారు. ఇది మొబైల్ యాప్‌లో యాక్టివేట్ అయినప్పుడు.. స్కూటర్‌ను సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఆన్సర్ బ్యాక్ మొబైల్ యాప్‌లో యాక్టివేట్ అయినప్పుడు స్కూటర్ దాదాపు రెండు సెకన్ల పాటు హారన్ సౌండ్ చేయడమే కాకుండా ఎడమవైపు, కుడివైపు ఉన్న ఇండికేటర్స్ ఎంగేజ్ అవుతాయి. ఆ సమయంలో దీన్ని సులభంగా గురించవచ్చు. ఈ ఫీచర్ స్టాండర్డ్ ఫాసినో స్కూటర్‌లో లేదు. ఇక డిజైన్ పరంగా ఇది దాదాపు మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది.
కొత్త యమహా ఫాసినో ఎస్ వేరియంట్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మ్యాట్ రెడ్, మ్యాట్ బ్లాక్ మరియు టాప్ ఎండ్ డ్యూయల్ టోన్ - డార్క్ మ్యాట్ బ్లూ. కంపెనీ అందించే డార్క్ మ్యాట్ బ్లూ వెర్షన్ ధర రూ. 94530 (ఎక్స్ షోరూమ్). ఫాసినో ఇప్పుడు మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి డ్రమ్, డిస్క్ మరియు ఎస్ వేరియంట్స్.

ధరల విషయానికి వస్తే.. యమహా ఫాసినో డ్రమ్ బ్రేక్ ధర రూ. 79900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ), డిస్క్ వేరియంట్ ధర రూ. 91130 (ఎక్స్ షోరూమ్) మరియు ఎస్ వేరియంట్ (కొత్తగా లాంచ్ అయిన మోడల్) మాట్ రెడ్ లేదా మ్యాట్ బ్లాక్ షేడ్ ధర రూ. 93730 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). అదే సమయంలో మాట్ డార్క్ బ్లూ ధర రూ. 94530 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).
కొత్త యమహా ఫాసినో ఎస్ వేరియంట్ అదే ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.2 హార్స్ పవర్ మరియు 10.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫాసినో బరువు 99 కేజీలు కాగా.. అండర్ సీట్ స్టోరేజ్ 21 లీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి ఇది కూడా దాని మునుపటి మోడల్స్ మాదిరిగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2024 యమహా ఫాసినో ఎస్ వేరియంట్ అన్ని విధాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్ 125, యమహా రే జెడ్ఆర్ 125 మరియు హీరో డెస్టినీ 125 ఎక్స్టెక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని మేము భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








