మరింత గ్లామరస్‌గా యమహా స్కూటర్లు, బైక్‌లు.. ఈ కలర్స్‌ను చూస్తే ఫిదా అయిపోతారు.!!

భారత మార్కెట్లో యమహా ఇండియా 2024 MT-15, Fascino 125 మరియు RayZR 125 టూ వీలర్ల కోసం కొత్త రంగులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు యమహా పైన పేర్కొన్న బైక్‌, స్కూటర్లను ఆకట్టుకునే రంగుల్లో తీసుకువచ్చినట్లు వెల్లడించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

Yamaha MT -15 బైక్‌ను ఇప్పుడు సంస్థ సైబర్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ప్రకాశవంతమైన పసుపు కలర్‌ వీల్స్‌తో చూడగానే అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా Cyan Storm DLX రంగుపై గ్రాఫిక్స్‌ను సర్దుబాటు చేసింది. దీనికి అదనంగా, MT-15 యొక్క DLX వెర్షన్‌లో వార్నింగ్‌ లైట్‌ను తీసుకువచ్చింది. ఇది భద్రతా ఫీచర్లలో ముఖ్యమైన భాగం.

Yamaha-MT-15-Gets-New-Colours

Yamaha MT-15 ఇప్పుడు కస్టమర్లకు ఏడు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. సైబర్ గ్రీన్‌లోని MT-15 ధర రూ. 1.72 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్టైలిష్‌ బైక్‌ను సంస్థ R15 ఆధారంగా స్ట్రీట్ నేక్డ్ బైక్‌గా రూపొందించింది. ఇది 155 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 18.4 bhp మరియు 14.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

యమహా నుంచి మార్కెట్లో అందుబాటులో ఉన్న స్టైలిష్‌ స్కూటర్‌.. Yamaha Fascino 125. ఈ స్కూటర్‌ను ఇప్పుడు సంస్థ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు కొత్త రంగుల్లో తీసుకువచ్చింది. ఫాసినో 125 స్కూటర్‌ డ్రమ్ బ్రేక్ వేరియంట్ కొత్త మెటాలిక్ బ్లాక్ కలర్‌తో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.79,150.

Yamaha RayZR 125లో సంస్థ Cyan Blue అనే కొత్త రంగు ఆప్షన్‌ను తీసుకువచ్చింది. సియాన్ బ్లూ కలర్‌తో ఈ స్కూటర్‌ ఇప్పుడు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీని డ్రమ్ బ్రేక్-ఎక్విప్డ్ రే జెడ్ఆర్ ధర రూ. 85,030గా ఉంది. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 91,430 గా ఉంది. Cyan Blue తో కలిపి ఈ స్కూటర్‌ ఇప్పుడు 5 రంగుల్లో అందుబాటులో ఉంది.

Fascino మరియు RayZR 125 స్కూటర్లు రెండూ 125cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజిన్‌ 8.2 bhp మరియు 10.3 Nm శక్తిని ఉత్పత్తి చేస్తాయి. CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. యమహా మోడళ్లలో కొత్త రంగుల పరిచయంతో తాజాదనాన్ని జోడించడంతో.. కస్టమర్లను ఆకట్టుకుంటుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, April 8, 2024, 21:57 [IST]
English summary
2024 yamaha mt 15 fascino 125 and rayzr 125 get new colour schemes check price details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+