65 కి.మీల మైలేజ్ ఇచ్చే హోండా కొత్త బైక్ లాంచ్.. ధర రూ.91 వేలు.. మిడిల్‌ క్లాస్ వారికి బెస్ట్ ఆప్షన్..

ప్రముఖ టూవీలర్ కంపెనీ హోండా (Honda) ఇండియాలో తన మార్కెట్‌ను పెంచుకోడానికి ప్రతి ఏడాది కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, ఇతర కంపెనీలకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. మధ్య తరగతి వినియోగదారులు ఎక్కువగా హోండా కంపెనీకి ఎక్కువ కస్టమర్లుగా ఉంటారు. ఇండియాలో చాలా మంది తమ రోజువారి అవసరాలకు అవసరమయ్యే టూవీలర్స్‌ కోసం ఈ కంపెనీకి చెందిన బైక్స్, స్కూటర్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇవి మైలేజ్ ఎక్కువగా ఇవ్వడంతో పాటు ధర కూడా చాలా వరకు రూ.ఒక లక్షలోపు ఉండటం కారణంగా హోండా కంపెనీ దేశంలో టూవీలర్ సెగ్మెంట్‌లో మంచి డిమాండ్ ఉన్న సంస్థగా ఉంది. ఇటీవల యాక్టివా కొత్త వెర్షన్‌ను విడుదల చేసి స్కూటర్ల విభాగంలో పోటిని పెంచిన కంపెనీ తాజాగా బైక్ సెగ్మెంట్‌లో కొత్త 125cc మోడల్‌లో SP 125 (2025 ఎడిషన్) ను తీసుకొచ్చింది. ఇప్పటికే 125సీసీ షైన్‌ ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న బైక్.

ఇప్పుడు ఇదే డిమాండ్‌ను మరింత పెంచుకోడానికి SP 125 ను మార్కెట్లో ప్రారంభించింది. దీని ధర తక్కువ, మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. భారతీయ వినియోగదారులు సాధారణంగా బడ్జెట్ ధరలో, మంచి పనితీరు కనబరిచే బైకులను ఎప్పుడు ఆదరిస్తారు. ఈ నేపథ్యంలో 125సీసీ బైక్ షైన్‌తో మార్కెట్లో తన హవాను ప్రారంభించిన హోండా ఇప్పుడు ఇదే సీసీ సెగ్మెంట్‌లో SP 125తో తన సక్సెస్‌ను కొనసాగించాలని చూస్తుంది.

2025 Honda Sp 125 Launched

హోండా ఎస్‌పీ 125 (Honda SP 125) 2025 ఎడిషన్ ఇండియా మార్కెట్లో రూ.91,771 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో విడుదల అయింది. దీని ఇంజిన్‌ను ప్రత్యేకంగా OBD 2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేశారు. చూడటానికి పాత షైన్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికి భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా ఇంజిన్‌ను అప్‌డేట్ చేశారు. ఇధి మంచి పనితీరును అందిస్తుంది. ఇది రెండు బ్రేక్ వేరియంట్లలో లభిస్తుంది.

హోండా ఎస్‌పీ 125 డ్రమ్ బ్రేక్ వెర్షన్ ప్రారంభ ధర రూ.91,771, పాత మోడల్‌తో పోలిస్తే, ధర రూ. 4,000 ఎక్కువ. అదే డిస్క్ బ్రేక్ వెర్షన్ ప్రారంభ ధర రూ.1,00,284గా ఉంది, ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. పాత మోడల్ కంటే ఇది రూ.8,816 ఎక్కువ. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 124 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ 10.7 bhp పవర్, 10.90 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2025 Honda Sp 125 Details

ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ సెటప్‌తో వచ్చింది. డిజైన్‌లో చిన్న మార్పులు మాత్రమే ఉన్నాయి. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు డ్యూయల్ స్ప్రింగ్‌లతో మెరుగైన సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రన్ అవుతుంది. లీటర్‌కు దాదాపు 65 కి.మీల మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 11.2 లీటర్లుగా ఉందని హోండా కంపెనీ పేర్కొంది. బైకుకు అందించిన గ్రాఫిక్స్ రిఫ్రెష్ చేశారు. ఆల్-ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ , టెయిల్‌ల్యాంప్‌ ఉంది.

SP 125లో ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీతో 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే, నావిగేషన్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌, హోండా రోడ్‌సింక్ యాప్ ద్వారా వాయిస్ అసిస్ట్ ఫీచర్‌ వంటి వాటిని కలిగి ఉంది. ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్,పెరల్ సైరన్ బ్లూ, మాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ అనే కలర్స్‌లలో లభిస్తుంది.

హోండా ఎస్‌పీ 125 (2025 ఎడిషన్) మొత్తం బరువు 116 కిలోలు. ఇది ప్రస్తుతం 125cc సెగ్మెంట్లో హీరో గ్లామర్, బజాజ్ ఫ్రీడమ్ CNG, బజాజ్ పల్సర్ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది. హోండా నుంచి షైన్ మోడల్ ఏ విధంగా అయితే బాగా క్లిక్ అయిందో ఈ కొత్త మోడల్ అంతకంటే ఎక్కువ సేల్స్ సాధిస్తుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 23, 2024, 18:40 [IST]
English summary
2025 honda sp 125 launched in india price starts from rs 91771
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+