మంచి బైక్ కావాలా? కొత్త వెర్షన్‌లో ‘హోండా మోటార్‌సైకిల్స్' కింగ్‌లాంటి బైక్‌ని తెచ్చింది!
జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ కంపెనీగా ఉంది. ఈ కంపెనీ నుంచి 100 సీసీ నుంచి 1800 సీసీ వరకు సూపర్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బ్రాండ్ నుంచి కొనుగోలుకి సిద్ధంగా ఉన్న బైక్స్ లేదా స్కూటర్లు అన్ని రకాల కస్టమర్లకు చేరువగా ఉన్నాయి.
హోండా కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న బైక్స్ ఎంట్రీ లెవెల్ కమ్యూటర్‌లో ప్రధాన ప్రత్యర్థి హీరో మోటోకార్ప్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ మార్కెట్‌లో మరింత పోటీని ఇచ్చేందుకు SP 160 మోటార్ సైకిల్‌ని ప్రవేశపెట్టింది. ఈ బైక్ యూనికార్న్‌కి కాస్త తక్కువగా.. 125 సీసీ సెగ్మెంట్ మోటార్‌సైకిల్స్‌కి ఎక్కువగా ఉంటాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో 160 సీసీ విభాగంలో బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ, యమహా FZ, హీరో ఎక్స్‌ట్రీమ్ 160R, సుజుకి జిక్సర్ వంటివి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తాజాగా SP 160 మోడల్ 2025 వెర్షన్‌లో హోండా మోటార్‌సైకిల్స్ ఇండియా తీసుకువచ్చింది. ప్రధానంగా ఈ మోటార్ సైకిల్‌ని OBD2B ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేసేందుకు కంపెనీ ఈ మార్పును ప్రవేశపెట్టింది.
ఈ కొత్త హోండా SP 125 సింగిల్ డిస్క్, డ్యూయల్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోటార్‌సైకిళ్ల ధరలు వరుసగా రూ.1.22 లక్షలు, రూ.1.28 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. మునుపటి బైక్స్‌తో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.3,000 నుంచి రూ.4,600 ఎక్కువ పెరిగాయి.

ఈ బైక్‌కి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మోటార్ సైకిల్ భారతదేశంలోని అన్ని హోండా డీలర్‌షిప్స్‌కి ఆల్రెడీ చేరుకుంది. ఈ సెగ్మెంట్‌లో గట్టిగా నిలబెట్టేందుకు ఈ కొత్త ఫీచర్లతో ఈ మోడల్‌ని ప్రవేశపెట్టింది. కొత్త హోండా SP 160 LED హెడ్‌ల్యాంప్ కొద్దిగా పాలిష్ చేయబడింది. దీంతో ఇది ఫ్రంట్ ఫేసియాలో షార్ప్ లుక్‌తో యూత్‌ని ఆకట్టుకోనుంది.
రెండు వైపులా కవర్లతో కూడిన మజీల్ బాడీ ఫ్యూయెల్ ట్యాంక్, ఎగ్జాస్ట్ మఫ్లర్‌పై క్రోమ్ కవర్, LED టెయిల్‌లైట్ వంటి డిజైన్స్ మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఈ బైక్‌ని రేడియంట్ రెడ్ మెటాలిక్, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ వంటి కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇది భారీ డిజైన్‌తో అందరికీ సరిపోయేలా ఉంటుంది.
ఈ బైక్ 2025 మోడల్ బ్లూటూత్ కనెక్టివిటీతో 4.2-ఇంచెస్ TFT క్లస్టర్‌తో వస్తుంది. హోండా ఇటీవల లాంచ్ చేసిన యాక్టివా 125సీసీ వెర్షన్‌లోనూ ఇదే యూనిట్‌ని అందించారు. లైవ్ టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అండ్ SMS అలర్ట్స్, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేసే హోండా రోడ్‌సింక్ (Honda Roadsync) యాప్ కలదు.
ఈ మోటార్ సైకిల్‌లో టైప్-సి USB ఛార్జింగ్, స్పీడోమీటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్‌తో పాటు ఇంధన వినియోగానికి సంబంధించిన డేటా క్లస్టర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త హోండా SP 160 లో OBD2B స్టాండర్డ్‌తో 162.71 సిసి సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ కలదు. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది.
ఇందులోని ఇంజిన్ 7,500 rpm వద్ద 13 bhp పవర్, 5,250 rpm వద్ద 14.8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇతర మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. హోండా SP 160 ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, సస్పెన్షన్ కోసం వెనుక భాగంలో మోనోషాక్‌ని కలిగి ఉంది. ఈ ద్విచక్ర వాహనాలపై 10 సంవత్సరాల వరకు వారంటీని కూడా హోండా అందిస్తోంది.


Click it and Unblock the Notifications








