కవ్విస్తున్న KTM కొత్త బైక్స్‌.. త్వరలోనే మార్కెట్‌లోకి.. బ్యాక్‌ సీట్‌ రిజర్వ్‌ కోసం కుర్రకార్ల ఆరాటం!

దేశంలో కేటీఎం బైక్స్‌కి ఉన్న క్రేజ్‌ వేరే. ముఖ్యంగా యూత్‌ ఈ బైక్‌ని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తూ ఉంటారు. అందువల్ల అమ్మకాల్లోనూ ఈ కంపెనీ బైక్స్‌ ఇతర కంపెనీలకు సవాళ్లను విసురుతుంది. ఈ బైక్‌ మార్కెట్‌లో ఇతర కంపెనీలతో పోల్చితే ఢిఫరెంట్ స్టైలింగ్‌, స్పెసిఫికేషన్స్‌తో వస్తాయి. ఆస్ట్రియాకు చెందిన ఈ కేటీఎం యువత అభిరుచులకు తగినట్లుగా కొత్త కొత్త బైక్స్‌ని విడుదల చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా శుక్రవారం గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్‌లో న్యూ 390 అడ్వెంచర్ ఎస్ (KTM Adventure 390 S), 390 ఎండ్యూరో ఆర్ (KTM 390 Enduro R) మోటార్ సైకిళ్లను ఆవిష్కరించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

KTM 390 అడ్వెంచర్ ఎస్: ఈ బైక్ పూర్తిగా విభిన్న డిజైన్‌ని కలిగి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా LED హెడ్‌లైట్స్‌, LED DRLs, LED టెయిల్‌లైట్స్‌, రియర్ ఇండికేటర్స్‌, ఎత్తుతో కూడిన విండ్‌స్క్రీన్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఫ్రంట్‌లో 21 ఇంచెస్‌, వెనక 17 ఇంచెస్‌ వైర్‌ స్పోక్‌ వీల్స్‌ కలవు. ఇవి అపోలో ట్రాంప్లర్‌ టైర్స్‌తో వస్తాయి.

KTM 390 Adventure and 390 Enduro R Bikes Showcased

సస్పెన్షన్‌ పరంగా అడ్జస్టబుల్‌ USD ఫోర్క్స్, మోనోషాక్‌తో వస్తాయి. ఫ్రంట్‌లో డిస్క్‌ బ్రేక్స్, వెనకాల డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ స్టాండర్డ్‌గా వస్తుంది. ఈ కేటీఎం 390 అడ్వెంచర్ ఎస్ బైక్ 399 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8,500 rpm వద్ద 46 hp మరియు 6,500 rpm వద్ద 39 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక ఫీచర్ల పరంగా చూస్తే TFT స్క్రీన్, స్విచెబుల్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బైక్‌ వీక్‌లో ఆరెంజ్‌, బ్లూ, అలాగే వైట్ కలర్‌ బైక్స్‌ని ప్రదర్శించారు. విడుదల సమయానికి వివిధ కలర్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి రానుంది.

KTM 390 Adventure and 390 Enduro R Bikes Showcased

KTM 390 ఎండ్యూరో ఆర్: ఈ బైక్‌ కూడా స్పోర్టీ లుక్‌తో అగ్రెస్సివ్‌గా కనిపిస్తుంది. పైన తెలిపిన స్మార్ట్ ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి. అయితే ఈ బైక్‌లో ముందు 21 ఇంచెస్‌, వెనక 18 ఇంచెస్‌ వైర్‌ స్పోక్‌ వీల్ సెటప్‌తో వస్తుంది. అంతే కాకుండా నార్మల్‌ LCD కన్సోల్‌, స్విఛ్‌గేర్‌ హౌసింగ్‌ విత్‌ ఏబీఎస్‌ టర్న్ ఆఫ్‌ బటన్‌ ఉంటుంది.

ఇది 399 సీసీ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 45.3 bhp పవర్, 39nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కొత్త KTM 390 ఎండ్యూరో ఆర్ లోనూ ముందు USDడి ఫోర్క్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్) కూడా కలదు. అన్ని ఎత్తుల వారికి సరిపోయేలా సీటింగ్‌ సర్దుబాటు కూడా కలదు.

KTM 390 Adventure and 390 Enduro R Bikes Showcased

KTM 390 అడ్వెంచర్ ఎస్ ధర రూ .3.8 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉంది. అదే విధంగా 2025 జనవరిలో న్యూఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోలో ఈ బైక్‌ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇక KTM 390 ఎండ్యూరో ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ .3.3 లక్షలుగా ఉండనుంది. ఈ బైక్‌ని 2025 మే లేదా జూన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, December 7, 2024, 9:25 [IST]
English summary
2025 ktm 390 adventure s and 390 enduro r showcased in ibw check details here
Read more on: #ktm #india bike week
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+