ఖరీదైన ట్రయంఫ్ కొత్త బైక్ ఇదే.. ధర తెలిస్తే షాకవుతారు!

భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైకులు, కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్' (Triumph Motorycycle) దేశీయ విఫణిలో '2025 బోనావిల్లే టీ120' (2025 Bonneville T120) బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ట్రయంఫ్ బోనావిల్లే టీ120 బైక్ ధర ఎంత, డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, కలర్ ఆప్షన్స్ వంటి వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2025 ట్రయంఫ్ బోనావిల్లే టీ120 బైక్.. క్రాన్‌బెర్రీ రెడ్ కలర్ ఆప్షన్‌తో కొత్త డ్యూయల్ టోన్ క్రిస్టల్ వైట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.11.39 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఆధునిక డిజైన్ కలిగి ఉంటుంది. ఫీచర్స్ కూడా బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద ఈ లేటెస్ట్ బైక్ కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా.. చెప్పుకోదగ్గ మార్పులకు లోను కాలేదని తెలుస్తోంది.

Triumph Bonneville T120

2025 ట్రయంఫ్ బోనావిల్లే టీ120 బైక్ కొత్త డ్యూయెల్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే కాకుండా.. ఈ బైక్ సఫైర్ బ్లూ విత్ సిల్వర్ బ్లూ స్టెల్త్ ఎడిషన్, జెట్ బ్లాక్, కార్డోవన్ రెడ్ సిల్వర్ ఐస్ మరియు జెట్ బ్లాక్ విత్ ఫ్యూషన్ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో కూడా లభిస్తుంది. ఇవన్నీ చూడటానికి చాలా అద్భుతంగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి.

డిజైన్ విషయానికి వస్తే.. కొత్త 2025 ట్రయంఫ్ బోనావిల్లే టీ120 బైక్ రెట్రో బ్రిటిష్ మోటార్‌సైకిల్‌ను గుర్తుకు తెచ్చే ప్రామాణికమైన క్లాసిక్ స్టైలింగ్‌ను పొందుతుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, కర్వీ ఫ్యూయల్ ట్యాంక్ మరియు ఫ్లాట్ సీటు మొదలైనవన్నీ బైక్ యొక్క క్లాసిక్ లుక్‌ను మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి డిజైన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంగా అర్థమవుతోంది.

Triumph Bonneville T120 Rear Profile

రిట్రో డిజైన్ కలిగిన 2025 ట్రయంఫ్ బోనావిల్లే టీ120 బైక్ అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త బైకులోని ఫీచర్స్ అన్నీ కూడా దాని స్టాండర్డ్ మోడల్ బైకుకి సమానంగా ఉంటాయి. ఇవన్నీ బైక్ రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తద్వారా రైడర్ ఉత్తమ రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. మొత్తం మీద ట్రయంఫ్ బోనావిల్లే టీ120 బైక్ డిజైన్ మరియు ఫీచర్స్ ఆధునిక కాలంలోనే రైడర్లకు ఉపయోగపడేలా ఉందని తెలుస్తోంది.

ట్రయంఫ్ బోన్నెవిల్లే టీ120 బైకులో 1200 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6550 rpm వద్ద 78.9 Bhp పవర్ మరియు 3500 rpm వద్ద 105 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి అత్యుత్తమ ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

Triumph Bonneville T120 Side Design

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ట్రయంఫ్ బోన్నెవిల్లే టీ120 బైక్.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ మోటొరాడ్ కంపెనీ యొక్క R nineT మరియు డుకాటీ స్క్రాంబ్లర్ 1200 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. ఈ కొత్త బైక్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలు పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 5, 2024, 15:58 [IST]
English summary
2025 triumph bonneville t120 launched at rs 11 39 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+