రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కొంటున్నారా? ఈ బైక్స్‌ని ఎందుకు ట్రై చేయకూడదు?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ బైక్స్ భారతీయులకు ఒక రకమైన భావోద్వేగం అని చెప్పవచ్చు. 90's లో (1990) దశాబ్దంలో గ్రామాల్లోని ప్రెసిడెంట్ లేదా సర్పంచ్ ఇతర సంపన్నుల వద్దే ఉండేంది. దీంతో ఆ బైక్‌పై వెళ్లాలనేది ప్రతీ ఒక్కరికి ఓ కోరికలా ఉండేంది. మారిన కాలానికి అనుగుణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి వద్ద అందుబాటులో ఉంది. దీంతో ఈ బైక్‌లో కొత్త కొత్త వెరైటీలు పుట్టుకొచ్చాయి. కొన్ని సందర్భాల్లో దీనికి ప్రత్యామ్నాయ బైక్స్ కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. అయినా కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బిల్డ్ క్వాలిటీని ఇతర కంపెనీ బైకులు ఢీకొట్టలేక పోతున్నాయి.

ఇప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ ప్రీమియం బైక్స్‌తో పాటు లో-వేరియంట్ మోడళ్లను అందిస్తోంది. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి కొన్ని సవాళ్లు ఎదురువుతున్నాయి. ఈ సంస్థకు పోటీగా ఇతర కంపెనీలు కొత్త బైక్స్‌ని తీసుకువచ్చాయి. ప్రస్తుతం వీటి వైపు జనాలు చూస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ మాదిరిగానే ఉండే ఫీచర్లు డిజైన్‌తో ఉన్న బైక్స్‌కి యువత కూడా ఓటేస్తున్నారు.
హీరో మావ్రిక్: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌కి పోటీగా హీరో మావ్రిక్ బైక్ ఉంది. దేశంలో ఈ కంపెనీ బైక్స్ నంబర్ 1 స్థానంలో ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి పోటీగా మావ్రిక్ 440 బైక్‌ని హీరో సంస్థ తీసుకువచ్చింది. ఈ బైక్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.1.99 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.2.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఈ బైక్ 440 సీసీ ఆయిల్ / ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 26bhp శక్తిని మరియు 37 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. ఈ బైక్ గంటకు 110-150 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. లీటర్‌కి 30 కి.మీ మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా అధునాతన స్మార్ట్ ఫీచర్లు ఇందులో గమనించవచ్చు.
హోండా హైనెస్ సీబీ350: ఈ మోటార్ సైకిల్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కు గట్టి పోటీ ఇస్తుంది. కొత్త హోండా సీబీ350 మరియు సిబి 350 DLX వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1.99 లక్షలు, రూ.2.18 లక్షలుగా ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి ఏమాత్రం తీసిపోకుండా దీనిని రూపొందించింది.

కొత్త హోండా సీబీ350 348.36 సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 5,500rpm వద్ద 20.7 bp శక్తిని మరియు 3,000 rpm వద్ద 29.4 nm టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 42 KM మైలేజీని అందిస్తుంది.
TVS రోనిన్: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కి పోటీగా టీవీఎస్ రోనిన్ కూడా ఉంది. ఇది 225.9cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీని ధర కేవలం రూ. 1.49 లక్షలుగా ఉంది. ఈ బైక్ 14-లీటర్ ఇంధన సామార్థ్యం ఉన్న ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కి 42.95 కి.మీ మైలేజీని అందిస్తుంది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు యూఎస్‌బీ ఛార్జింగ్ అప్షన్‌ని గమనించవచ్చు.

హార్లీ డేవిడ్‌సన్ X440: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యానికి ఈ బైక్ అడ్డుకట్ట వేసిందని చెప్పవచ్చు. ఈ హార్లీ డేవిడ్సన్ బైక్ ధర రూ.2.29 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)గా ఉంది. ఈ బైక్ డెనిమ్, వివిడ్ మరియు ఎస్.డెనిమ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్ 440 సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్, 440 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








