Jaunty i Pro 120 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర రూ. 1.15 లక్షలు
భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. అమో మొబిలిటీ(Amo Mobility) అనే ఈవీ కంపెనీ కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ జాంటీ ఐ ప్రో(Jaunty i Pro) పేరుతో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధర, ఫీచర్లు, రేంజ్ పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో పోటీ తీవ్రంగా నెలకొంది. స్టార్టప్‌లు ఈ రంగంలో సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఈవీ తయారీదారు Amo Mobility.. Jaunty i Pro ఇ స్కూటర్‌ను రూ. 1.15 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ స్కూటర్ Vida V1 Plus, TVS iQube మరియు Ather 450 Plus స్కూటర్లకు పోటీగా లాంచ్ అయింది.

కలర్స్: Jaunty i Pro ఇ స్కూటర్ ను అమో మొబిలిటీ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ప్రవేశపెట్టింది. తెలుపు(White), నీలం(Blue), మరియు బూడిద(Grey) కలర్స్‌లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. కాగా 200 కంటే ఎక్కువ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ల ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.
బ్యాటరీ ప్యాక్: జాంటీ ఐ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సంస్థ 2.52 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. పూర్తి ఛార్జ్‌పై 120 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ను 3.5 గంటల్లో పూర్తి ఛార్జ్ చేసేలా ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించారు.
Jaunty i Pro ఇ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. దీని పేలోడ్ సామర్థ్యం 151 కిలోలు. ఇక రైడర్ల కోసం ఈ స్కూటర్‌లో సంస్థ ఎకనామిక్, సిటీ రైడ్ మరియు పవర్ మోడ్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను ప్రవేశపెట్టింది.

జాంటీ ఐ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో BLDC హబ్ మోటార్ గరిష్ఠంగా 3.95 bhp పవర్ మరియు 143 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడర్ల సేఫ్టీ కోసం ఇందులో బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించింది. అంటే రైడర్ ఒక బ్రేక్‌ను అప్లై చేసినప్పుడు, మరొకటి ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది. అంతేకాకుండా బ్యాటరీ టెంపరేచర్‌పై కూడా వార్నింగ్‌లను అందిస్తుంది.
Jaunty i Pro ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌పై AMO Mobility వ్యవస్థాపకుడు సుశాంత్ కుమార్ మాట్లాడారు. ప్రస్తుత ఈవీ టెక్నాలజీ యువగంలో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఈ స్కూటర్‌ను తీసుకువచ్చినట్లు సుశాంత్ కుమార్ చెప్పారు. ఆధునికతను కోరుకున్న రైడర్లకు Jaunty i Pro ఇ స్కూటర్ మరింతగా కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు.
సాంప్రదాయక వాహనాల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాల నుంచి భారత్‌కు విముక్తి కల్పించేందుకు పోరాటంలో పూర్తి మద్దతిస్తున్నట్లు సుశాంత్ కుమార్ వెల్లడించారు. కాగా ఇటీవల బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్.. తన తాజా చిత్రం 'మైదాన్' విడుదల సందర్భంగా అమో మొబిలిటీతో ఆయన భాగస్వామ్యం ఏర్పరుచుకున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








