ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటున్నారా? ఒక్క నిమిషం.. ఆ కంపెనీ స్కూటర్లపై ఏకంగా రూ.10,000లకు పైగా డిస్కౌంట్‌

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. అందులో భాగంగానే కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఏథర్‌ ఎనర్జీ, టీవీఎస్ మరియు ఇతర స్కూటర్ కంపెనీలు ఉన్నాయి.

తాజాగా మార్కెట్‌లో ఉన్న కంపెనీలకు ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ సంస్థ విడుదల చేస్తున్న స్కూటర్లు అధిక మొత్తంలో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత డిమాండ్‌కి తగినట్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆంపియర్ విడుదల చేస్తుంది. అందులో భాగంగానే తన కంపెనీ తీసుకువచ్చిన ముఖ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను ఆ సంస్థ తగ్గించింది. ఒక్కో స్కూటర్‌పై దాదాపు రూ. 10వేల వరకు తగ్గింపును ఆంపియర్ అందిస్తుంది.

Ampere-Electric-Scooters-Price-Drop

ముందుగా ఈ బ్రాండ్ నుంచి వచ్చిన మ్యాగ్నస్ EX (Magnus EX) ఎలక్ట్రిక్‌ స్కూటర్ మార్కెట్‌లో మంచి వాటాను కలిగి ఉంది. ఈ స్కూటర్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్ల కచ్చితమైన రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్ ఓషన్ బ్లూ, గ్లేసియల్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, గెలాక్టిక్ గ్రే మరియు మెటాలిక్ రెడ్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ స్కూటర్ కేవలం 10 సెకండ్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో రివర్స్‌ మోడ్‌ కూడా ఉంది. మాగ్నస్ ఈఎక్స్ ఇప్పుడు ధర రూ.10 వేలు తగ్గడంతో రూ. 94,900 ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇక మరో స్కూటర్‌ మాగ్నస్ LTని రూ. 84,900లకే ఇంటికి తీసుకువెళ్లవచ్చు. ఇంత తక్కువ ధరలో స్కూటర్‌లు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.

ఇంకో స్కూటర్‌ ఆంపియర్ రియో ఎల్‌ఐ-ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సైతం తగ్గించింది. రియో ఎల్ఐ ప్లస్ ధర ఇంతకుముందు రూ. 69,900గా ఉండగా. ఇప్పుడు రూ.10 వేలకు కుదించారు. ఈ స్కూటర్‌ ఇప్పుడు రూ. 59,900లకే అందుబాటులో ఉండనుంది. కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న స్కూటర్లలో లో వేరియంట్‌గా రియో ఎల్‌ఐ ప్లస్‌ ఉంది.

రియో లీ ప్లస్ ఒక స్లో ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్. ఇది గంటకు కేవలం 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. ఇది 120 కిలోల పేలోడ్‌ని తట్టుకుంటుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుండి 6 గంటలు పడుతుంది. గ్రామీణ ప్రాంతాలతో ఇతర వాణిజ్య అవసరాలకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

ఇక కంపెనీ నుంచి త్వరలో రానున్న ఆంపియర్ నెక్సస్‌ రూ.1,09,000 ప్రారంభ ధరతో విడుదల కానుంది. ఈ స్కూటర్‌ మే చివరి వారంలో విడుదల కానుంది. వీటిలో 3 కిలోవాట్ల LFP (lithium iron phosphate) బ్యాటరీ ప్యాక్‌తో రానున్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 136 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీనిని పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి సమయం 3 గంటల 22 నిమిషాలు పడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో, సిటీ, పవర్ మరియు లింప్ హోమ్ అనే నాలుగు రైడ్ మోడ్‌లలో వస్తుంది. ఇందులో కూడా రివర్స్ మోడ్ ఉంది. దీనిపై సిటీలో గంటకు 63 కిలోమీటర్లు, ఎకో మోడ్ లో 42 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా గంటకు 93 కిలోమీటర్లతో ప్రయాణించవచ్చు. ఇదే సిరీస్‌లో నెక్సస్‌ ST వేరియంట్‌ కూడా ఉంది. దీని ధర రూ. 1,19,000గా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, May 17, 2024, 15:07 [IST]
English summary
Ampere electric announced huge price drop up to 10000 on all variants check latest prices here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+