136 కి.మీ రేంజ్‌తో ఫ్యామిలీ ఇ స్కూటర్ Ampere Nexus లాంచ్.. ధర రూ. 1.10 లక్షలు
భారత మార్కెట్లో ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ నెక్సస్ ఎట్టకేలకు నేడు విడుదలైంది. ఈ హై పర్ఫామెన్స్ ఫ్యామిలీ స్కూటర్‌ను గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లాంచ్ చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటీవలే టెస్ట్ రైడ్‌ను పూర్తి చేసుకుని దిగ్గజ రికార్డులను సాధించిన Nexus E Scooter పై మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ధర: గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ(GEMPL).. ఆంపియర్ నెక్సస్ ఇ స్కూటర్‌ను రెండు వేరియంట్లు.. EX, ST లలో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ. 1,09,900. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి. మేడ్ ఇన్ ఇండియాగా రూపొందించబడిన Nexus E Scooter అత్యుతమ టెక్నాలజీతో పాటు ఆధునిక ఫీచర్లను కలిగి ఉందని సంస్థ చెబుతోంది. ఇందులో మల్టీ ఇన్నోవేషన్లు, క్లాస్ లీడింగ్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

కలర్స్: విజువల్ అప్పీల్ కోసం ఎక్కువగా ఫ్లాట్ బాడీ ప్యానెల్‌లు మరియు కొన్ని క్రీజ్‌లతో ప్రారంభం సంప్రదాయబద్ధంగా Ampere Nexus ను రూపొందించారు. ఈ స్కూటర్ 4 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. జాన్స్కర్ ఆక్వా, ఇండియన్ రెడ్, లూనార్ వైట్ మరియు స్టీల్ గ్రే కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. రైడర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా నచ్చిన కలర్‌ను ఎంపిక చేసుకునేలా ఆకర్షణీయంగా రూపొందించింది.
ఫీచర్లు: ఫ్యామిలీ అవసరాలకు అనుగుణంగా అధిక పనితీరు, సౌకర్యం, డిజైన్, సేఫ్టీ ఫీచర్లతో నెక్సస్ ఇ స్కూటర్‌ను రూపొందించినట్లు సంస్థ చెబుతోంది. ఫీచర్ల పరంగా నెక్సస్ టాప్ స్పెక్ ST లో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో కూడిన 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను అందిస్తోంది. రైడర్ తమ స్మార్ట్ ఫోన్‌ను కన్సోల్‌తో కనెక్ట్ చేసిన తర్వాత, వారు డాష్‌లో ఇన్‌కమింగ్ కాల్ మరియు మెసేజ్ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.

మరోవైపు, Nexus EX వేరియంట్ చిన్న, 6.2-అంగుళాల సెగ్మెంటెడ్ LCD డిస్‌ప్లే మరియు తక్కువ కనెక్టివిటీ ఫీచర్‌లతో వస్తుంది. Nexus టర్నింగ్ ఇండికేటర్ల కోసం సంప్రదాయ స్విచ్‌లకు బదులుగా బటన్‌లను అందించింది. ఇందులో ఆల్-LED సెటప్‌ను కలిగి ఉంది. ప్రకాశవంతమైన హెడ్‌లైట్‌ని కలిగి ఉంటుందని సంస్థ పేర్కొంది..
డిజైన్: నెక్సస్.. NXG నుంచి కొన్ని డిజైన్ మరియు స్టైలింగ్ సూచనలను కలిగి ఉంటుంది. సింగిల్-సైడెడ్ స్వింగ్ ఆర్మ్ బదులుగా సంప్రదాయ స్వింగ్ ఆర్మ్‌ను చూడవచ్చు. Nexus టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉండగా.. ఫ్యామిలీ-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫార్ములాతో దీనిని రూపొందించారు.

డైమెన్షన్స్: ఆంపియర్ నెక్సస్ ఇ స్కూటర్ సీటు పొడవు 712 మి.మీ, సీటు ఎత్తు 765 మి.మీ గా ఉంది. అన్ని వేరియంట్లలో LED లైట్లు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తాయి. కాగా స్కూటర్ యొక్క వీల్‌బేస్ పొడవు 1,319 మి.మీ, 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. అలాగే 235 మి.మీ ఫ్లోర్‌బోర్డ్ స్థలంతో వస్తుంది.
ఆంపియర్ నెక్సస్ ఇ స్కూటర్‌లో బాడీవర్క్ కింద, టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు ట్విన్ షాక్ అబ్జార్బర్‌ల ద్వారా సస్పెండ్ చేయబడిన కొత్త, అండర్‌బోన్ ఛాసిస్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై ప్రయాణిస్తుంది. బ్రేకింగ్ విషయానికొస్తే ముందు వైపు డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

బ్యాటరీ: ఇక పనితీరు విషయానికొస్తే నెక్సస్ ఇ స్కూటర్.. కొత్త 4kW ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా గంటకు 93 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. 3 kWh, IP67 రేటెడ్ బ్యాటరీ LFP రకాన్ని కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 136 కి.మీ సర్టిఫైడ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుందని సంస్థ వెల్లడించింది.

భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా LFP రకం బ్యాటరీని ఎంచుకున్నట్లు ఆంపియర్ వెల్లడించింది. ఇక ఆంపియర్ నెక్సస్ ఇ స్కూటర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కస్టమర్లు రూ. 10,000 చెల్లించి తమ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. మే ద్వితీయార్ధం నుంచి దేశవ్యాప్తంగా 400 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లు, టచ్‌పాయింట్లలో టెస్ట్ రైడ్‌లు, డెలివరీలు ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications








