ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఆంపియర్ ఎలక్ట్రిక్.. గత కొన్ని నెలలుగా తన సరికొత్త ఇ స్కూటర్‌ను టెస్ట్ చేసే పనిలో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఆంపియర్ ఈ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
టెస్ట్ రైడ్‌లో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్విఘ్నంగా 1500 కి.మీ యాత్రను ఆంపియర్ NXG ఇ స్కూటర్ పూర్తి చేసుకుంది. సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై సంస్థ ఈ స్కూటర్‌ను రూపొందించింది. ఇది కంపెనీ యొక్క అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌గా సంస్థ పేర్కొంది. నెలల తరబడి టెస్ట్ రైడ్, వివిధ పరీక్షలను పూర్తి చేసుకున్న NXG స్కూటర్ ఈ నెల 30 న విడుదల కానుంది.

ఈ మేరకు ఆంపియర్ ఎలక్ట్రిక్ వెల్లడించింది. కాగా కొన్ని నెలల క్రితం కంపెనీ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ ఆధారంగా ఆంపియర్ NXGకి Nexus అని పేరు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే, గతంలో గుర్తించిన కొన్ని టెస్ట్ మ్యూల్స్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేస్తున్నాయి. అవేంటంటే..
ఆంపియర్ NXG స్కూటర్ దాని డిజైన్ మరియు లుక్‌ను బట్టి.. ఫ్యామిలీ బేస్‌డ్ స్కూటర్ కోసం వెతుకుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించినట్లుగా తెలుస్తోంది. షార్ప్ మరియు స్పోర్టీ లుక్, స్టైలిష్‌గా బాడీ ప్యానెల్‌ల ద్వారా ఇది అర్థమవుతుంది. నీట్ అండ్ సింపుల్ డిజైన్‌తో కస్టమర్లను ఆకర్షించేలా ఉంది.
ఇక ఆంపియర్ NXG స్కూటర్‌లోని ఫుట్‌బోర్డ్‌లో పొడవైన సీటు మరియు విశాలమైన లెగ్‌రూమ్ ఆధారంగా పెద్దదిగా కనిపిస్తుంది. దీనిపై ఇద్దరు అడల్ట్స్ కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మార్కెట్లో ఏథర్ రిజ్టా అనే ఫ్యామిలీ స్కూటర్‌ను లాంచ్ చేయగా.. ఈ సారూప్యతతో ఈ రెండు స్కూటర్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే కొత్త ఆంపియర్ NXG ఇ స్కూటర్‌లో ఆల్-ఎల్‌ఈడీ లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు నావిగేషన్ కోసం TFT డిస్‌ప్లేను అందించవచ్చని తెలుస్తోంది. టెక్నాలజీ పరంగా ఆటోమొబైల్ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు వచ్చే ప్రతి కొత్త వాహనంలోని అధునాతన టెక్నాలజీ ఫీచర్లను ఆశించవచ్చు.
ఆంపియర్ NXG ఇ స్కూటర్ ఛాసిస్ విషయానికొస్తే.. ఒక చివర టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో అండర్‌బోన్ ఫ్రేమ్‌ని చూడవచ్చు. కాగా స్కూటర్ 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఇక ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉంది.
ఎన్నో అంచనాలతో K2K టెస్ట్ రన్, అడ్వెంచర్ టూర్‌ను పూర్తి చేసుకున్న ఆంపియర్ NXG స్కూటర్.. సంస్థకు చాలా ముఖ్యమైనది. దిగ్గజ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌కు చెందిన OLA S1X, ఏథర్ ఎనర్జీకి చెందిన Rizta స్కూటర్ల నుంచి ఆంపియర్ ఎన్‌ఎక్స్‌జీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ స్కూటర్ K2K ప్రత్యేక ఎడిషన్ బుకింగ్‌లను ఇటీవల సంస్థ ప్రారంభించింది.
దీంతో కొత్త NXG ఇ స్కూటర్ యూత్ ఫేవరెట్‌గా ఉంటుందని ఆంపియర్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ కొత్త స్కూటర్ ధర రూ. 1.20 లక్షల లోపే ఉంటుందని సమాచారం. మీడియా నివేదికలను పరిశీలిస్తే, ఆంపియర్ NXG ఎలక్ట్రిక్ స్కూటర్ 120 కి.మీల రైడింగ్ రేంజ్‌ను కలిగి ఉండవచ్చు. అంతేకాకుండా స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications








