అప్రిలియా నుంచి 4 సూపర్‌ టూరర్‌ బైక్‌లు లాంచ్‌.. ఒక్కో బైక్‌లో ఎన్నో స్పెషాలిటీస్‌.!!

ప్రముఖ ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీదారు అప్రిలియా(Aprilia) భారత్‌లో తన మొత్తం మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను లాంచ్‌ చేసింది. ఇందులో ఫ్లాగ్‌షిప్ RSV4 ఫ్యాక్టరీ, RS660, Tuono 660 మరియు Tuareg 660 వంటి అడ్వెంచరస్‌ బైక్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ మోటార్‌సైకిళ్లను CBUలుగా అప్రిలియా యొక్క మోటోప్లెక్స్ డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

రేసింగ్‌ ప్రియులకు పరిచయం అక్కర్లేని బైక్‌ పేరు.. RSV4 Factory సూపర్ బైక్‌.. దీనిని సంస్థ ఇప్పుడు రూ. 31.26 లక్షల ధరతో విడుదల చేసింది. ఈ బైక్‌ను అల్ట్రా గోల్డ్‌ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. WSBK సిరీస్‌లో విజయపరంపరను కొనసాగించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేస్ ట్రాక్‌ల్లో ఈ ఫ్లాగ్‌షిప్ ఆధిపత్యం చెలాయించింది.

Aprilia-Super-Bikes-Launch-RSV4-Factory

అప్రిలియా RSV4 ఫ్యాక్టరీ బైక్‌.. 1099cc, V4 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. 214 bhp మరియు 125 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పెసిఫికేషన్ల పరంగా ఇందులో ఎలక్ట్రానిక్ ఓహ్లిన్స్ ఫ్రంట్ ఫోర్క్స్, ఓహ్లిన్స్ రియర్ మోనోషాక్, బ్రెంబో మోనోబ్లాక్ కాలిపర్స్, క్విక్‌షిఫ్టర్ వంటివి ఉన్నాయి. ఇంకా అప్రిలియా RSV4 బైక్‌ టాప్-ఆఫ్-ది-షెల్ఫ్ బిట్‌లను కలిగి ఉంటుంది. బరువు కేవలం 202 కిలోలు.

ఇక అప్రిలియా RS660 మరియు Tuono 660 మిడిల్ వెయిట్ మోటార్‌సైకిళ్లుగా సంస్థ పరిచయం చేసింది. RS660 పూర్తి ఫెయిరింగ్‌ను కలిగి ఉండగా.. Tuono సగం ఫెయిరింగ్‌తో వస్తుంది. అయితే ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకే విధమైన అండర్‌పిన్నింగ్‌లను కలిగి ఉండటంతో పాటు.. అనేక భాగాలు సమానంగా ఉంటాయి.

Aprilia-RS600

RS660 ధర భారత మార్కెట్లో రూ. 17.74 లక్షలుగా ఉంది. ఈ బైక్‌ రేసింగ్‌ బ్లాక్‌, యాసిడ్‌ గోల్డ్‌, ట్రిబ్యూట్‌ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక Tuono 660 బైక్‌ ధర కూడా రూ. 17.74 లక్షలు. దీనిని టార్క్‌ రెడ్‌, రష్‌ గ్రే కలర్స్‌లో సంస్థ ప్రవేశపెట్టింది. స్పెసిఫికేషన్ల పరంగా అప్రిలియా 660 మోడల్‌లు ట్విన్-సిలిండర్ సెటప్‌ను కలిగి ఉంటాయి.

పెద్ద లీటర్-క్లాస్ V4 ఇంజిన్ మాదిరిగా కాకుండా ఈ రెండు మోటార్‌సైకిళ్లు 659cc, ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. RS660లో, ఇంజిన్ 98.5 bhp మరియు 67 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక Tuono 660లో, ఇంజిన్ 94 bhp ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్లు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటాయి. RS660 స్టాండర్డ్‌ ద్విదిశాత్మక శీఘ్ర షిఫ్టర్‌ను కలిగి ఉంటుంది.

Aprilila-Tuono-660

Aprilia Tuareg RS 660 మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ బైక్‌ను సంస్థ రూ. 18.85 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ బైక్‌ మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. Aprilia Tuareg RS 660 Atreides Black కలర్‌, Canyon Sand బైక్‌ ధర రూ. 18.85 లక్షలుగా ఉంది.

Aprilila-Tuareg-660

Aprilia Tuareg RS 660 Dakar Podium కలర్‌ బైక్‌ ధర రూ. 19.16 లక్షలు. RS 660 మరియు Tuono 660 మాదిరిగానే ఈ బైక్‌ అదే 659cc ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 80 bhp మరియు 70 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బరువు 204 కిలోలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 17, 2024, 12:32 [IST]
English summary
Aprilia launched rsv4 factory rs660 tuono 660 and tuareg 660 in india price specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+