Aprilia RS 457 బుక్ చేసుకున్నారా! డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది..

భారతీయ మార్కెట్లో ఇటీవల విడుదలైన కొత్త 'ఏప్రిలియా ఆర్ఎస్ 457' బైక్ డెలివరీల గురించి కంపెనీ కస్టమర్లకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగానే ఈ నెల (2024 మార్చి) చివరి నాటికి 100 యూనిట్లను డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.

నివేదికల ప్రకారం కొత్త ఏప్రిలియా ఆర్ఎస్ 457 డెలివరీలు ఈ నెలలో ప్రారంభమవుతాయని సమాచారం. కాబట్టి కంపెనీ బైకులను డీలర్లకు పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ నెల చివరి నాటికి వంద యూనిట్లను డెలివరీ చేయనున్నట్లు సమాచారం.

Aprilia RS 457

రూ. 4.10 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైన కొత్త ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ యొక్క మాతృ సంస్థ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని మహారాష్ట్ర బారామతి ప్లాంట్‌లో ఈ బైక్ తయారీ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. కాగా ఇప్పుడు డెలివరీలకు సిద్ధమవుతున్నాయి.

ఏప్రిలియా ఆర్ఎస్ 457 ఇంజిన్

ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 457 సీసీ లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9400 rpm వద్ద 47 Bhp పవర్ మరియు 6700 rpm వద్ద 43.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ గ్రిజ్లీ ఎగ్జాస్ట్ నోట్‌ కలిగి ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.

Aprilia RS 457 Front View

ఈ బైక్ అల్యూమినియం ఫ్రేమ్ పొందుతుంది. అప్‌సైడ్‌డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనో షాక్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ కొత్త ఆర్ఎస్ 457 బైక్ 4-పిస్టన్ కాలిపర్‌తో జత చేయబడిన 320 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు వెనుకవైపు 220 మిమీ డిస్క్ ఉంటాయి. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. సుమారు 175 కేజీల(కర్బ్) బరువున్న ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

ఏప్రిలియా ఆర్ఎస్ 457 ఫీచర్స్

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఏప్రిలియా ఆర్ఎస్ 475 బైక్ 5 ఇంచే TFT కలర్ ఇన్‌స్ట్రుమెంటేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆల్ ఎల్ఈడీ లైటింగ్, బ్యాక్‌లిట్ స్విచ్ గేర్ మరియు మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఫుల్ ఫెయిర్డ్ బాడీ కలిగిన ఈ బైక్ ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, స్ప్లిట్ సీట్, ఫ్లోటింగ్ టెయిల్ సెక్షన్ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

Aprilia RS 457 Side Design

ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద 31 మంది డీలర్స్ ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైకును రిటైల్ చేయడానికి అధికారం కలిగి ఉన్నారు. కాబట్టి కంపెనీ ఫస్ట్ బ్యాచ్ కింది 100 యూనిట్లను డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఈ బైక్ ఉత్పత్తిని మరింత పెంచడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. కాబట్టి వచ్చే నెలలో (ఏప్రిల్ 2024) డెలివరీలు మరిన్ని జరిగే అవకాశం ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 16, 2024, 10:30 [IST]
English summary
Aprilia rs 457 bike deliveries begin this month in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+