పార్సిల్ బాక్స్‌లో రూ. 4 లక్షల బైక్.. సొంతం చేసుకున్న మహిళ (వీడియో)
సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు బైకులు, కార్లంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇందులో కేవలం పురుషులే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. ఇటీవల తమిళనాడుకు చెందిన మహిళ ఏప్రిలియా ఆర్ఎస్ 457 ఫస్ట్ బైక్ కొనుగోలు చేసింది.
ఓ చిన్నారికి తల్లి అయిన మహిళ తమిళనాడు రాష్ట్రంలోనే ఫస్ట్ ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ కొనుగోలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే ఈ బైకును ఇప్పటికి తమిళనాడులో ఎవరూ కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బైకును ఒక బాక్సులో ఉంచి ఒక పెద్ద ట్రక్కులో తీసుకువచ్చారు. దానిని ఆ మహిళ చేత ఓపెన్ చేయించారు.

ఆ మహిళ బాక్సులోని బైకును బయటకు తెస్తుంది. ఆ తరువాత డీలర్షిప్ సిబ్బంది డెలివరీకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తారు. ఆ తరువాత మహిళ కేట్ కట్ చేయడం వంటివి పూర్తి చేసుకుంటుంది. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు. వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ వీడియోపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. అభినందనలు చెబుతున్నారు.
నిజానికి వీడియోలో కనిపిస్తున్న మహిళకు బైకులంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చూస్తే.. వివిధ రకాల బైకులను డ్రైవ్ చేయడం చూడవచ్చు. ఇందులో కవాసకి నింజా జెడ్900, యమహా MT15 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 వంటి అనేక బైకులు ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ కూడా ఈ జాబితాలో చేరింది.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏప్రిలియా ఆర్ఎస్ 457 (Aprilia RS 457) బైక్ ధర రూ. 4.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 457 సీసీ ఇంజిన్ కలిగి 46.9 Bhp పవర్ మరియు 43.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది.
ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 30 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ బైక్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, 5 ఇంచెస్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు రైడ్ బై వైర్ సిస్టం వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో స్పోర్ట్స్, రోడ్ మరియు రెయిన్ అనే రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
కొత్త ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 320 మీమీ ఫ్రంట్, 220 మిమీ రియర్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. ఇది 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. సుమారు 175 కేజీల బరువున్న ఈ బైక్ ట్యూబ్‌లెస్ టైర్లను పొందుతుంది. ఇది మార్కెట్లో యమహా ఆర్3, కేటిఎమ్ RC390 మరియు కవాసకి నింజా 400 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఎక్కువమందిని తప్పకుండా ఆకర్షిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








