Ather 450 Apex ఏథర్ 450 అపెక్స్ ఇ స్కూటర్ లాంచ్.. 157 కి.మీ రేంజ్, ధర ఎంతంటే.??
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఏథర్ ఎనర్జీ(Ather Energy).. మార్కెట్లో 450 ఎక్స్, 450 ఎస్ ఇ స్కూటర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ క్రమంలో భారత మార్కెట్లో ఏథర్ ఎనర్జీ తన 450 మోడల్ లైనప్‌ను క్రమంగా విస్తరిస్తోంది. ఈ బ్రాండ్‌పై కొత్త ఏథర్ 450 అపెక్స్(Ather 450 Apex)ను సంస్థ నేడు విడుదల చేసింది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. గతంలో కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇప్పుడు గ్రామీణ స్థాయికీ విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈవీ కంపెనీలు సైతం.. సరికొత్త మోడళ్లు, అధిక రేంజ్‌తో స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఏథర్ నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న ఏథర్ 450 అపెక్స్‌ను నేడు మార్కెట్లోకి విడుదలైంది.

కొత్త ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ డిజైన్ విషయానికొస్తే ఈ స్కూటర్ 450X నుంచి అనేక అప్‌గ్రేడ్‌లను పొందింది. శక్తివంతమైన 7.0 KW ఎలక్ట్రిక్ మోటార్‌ను ఇందులో ఉపయోగించారు. ఈ మోటార్ గరిష్ఠంగా 26 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Ather 450 Apex ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠంగా 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుందని సంస్థ తెలిపింది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 3.7 kwh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. పూర్తి ఛార్జింగ్‌పై 157 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది.

కాగా ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏథర్ 450X లో వార్ప్(Warp) మోడ్‌ను సంస్థ ప్రవేశపెట్టగా.. ఏథర్ 450 అపెక్స్‌లో వార్ప్ ప్లస్(Warp+) రైడింగ్ మోడ్‌ను తీసుకొచ్చింది. Warp+ తో పాటు ఇందులో ఇంకా ఐదు రైడింగ్ మోడ్‌లను ఏథర్ ఎనర్జీ ప్రవేశపెట్టింది.
అంతే కాకుండా ఏథర్ 450 అపెక్స్ 'మ్యాజిక్ ట్విస్ట్'(Magic Twist) అనే ఫీచర్‌తో వస్తుంది. మీరు ఈ స్కూటర్‌పై వెళ్తున్నప్పుడు ప్రతి సారీ బ్రేక్ వేసే అవసరం లేకుండా స్కూటర్ వేగాన్ని తగ్గించడానికి ఈ ఫీచర్ సహాయం చేస్తుంది. కాగా ఈ స్కూటర్‌ను సంస్థ ప్రస్తుతం ఇండియమ్ బ్లూ పెయింట్ ఆప్షన్‌లో ప్రవేశపెట్టింది. సైడ్ ప్యానెల్స్‌ను ట్రాన్సపరెంట్‌గా రూపొందించారు.

ఇక కొత్త ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు సంస్థ ఐదు సంవత్సరాలు లేదా 60,000 కి.మీ బ్యాటరీ వారంటీని అందిస్తుంది. కాగా 450X లో మూడేళ్లు లేదా 30,000 కి.మీ బ్యాటరీని ఇస్తుంది. ఇది మినహా.. దాదాపు రెండు మోడల్స్ ఒకే తరహా ఫీచర్లు, హార్డ్‌వేర్‌ను అందుకున్నాయి.
ఏథర్ 450 అపెక్స్‌ను రూ. 1.89 లక్షల(ఎక్స్‌షోరూమ్) ధరతో సంస్థ విడుదల చేసింది. రూ. 2,500 టోకెన్ ఫీజుతో ఈ సరికొత్త స్కూటర్ బుకింగ్ గత డిసెంబర్‌లోనే ప్రారంభమయ్యాయి. మార్చి 2024 లో స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కాగా ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ ఈ-స్కూటర్‌గా తెలుస్తోంది. మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఎక్స్, సింపుల్ వన్‌కి ఈ స్కూటర్ గట్టిపోటీనిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








